Telugu Films News – Trending Tollywood Updates
Stay updated with Telugu films news, including movie announcements, cast updates, and latest releases. Fast and reliable updates from Telugu Movie Media

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఈ ఏడాది ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ అయి ఆడియన్స్ ముందుకి వచ్చాయి. మరికొన్ని ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి, ఇంకొన్ని అతి త్వరలో అందరి ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.
మరి వాటిలో ఏ ఏ సినిమా ఎంత మేర షూట్ జరుపుకుంది, ముందుగా ఏది ఆడియన్స్ ముందుకి రానుంది అనేటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ చూద్దాం. ముందుగా ఈ ఏడాది త్వరలో ఆడియన్స్ ముందుకి రానున్న పెద్ద మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ తీస్తున్న హరి హర వీర మల్లు.
టీజర్/ట్రైలర్ లాంచ్ వివరాలు
ఈ భారీ పాన్ ఇండియన్ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం గ్రాండ్ గా నిర్మిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పారిచిన ఏ ఈమూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన మూడు గ్లింప్స్ టీజర్స్ తో పాటు మూడు సాంగ్స్ కూడా ఎంతో ఆకట్టుకుని సినిమా పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు పెంచేసాయి.
నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న హరి హర వీర మల్లు మూవీ జూన్ 12న పాన్ ఇండియన్ రేంజ్ లో పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక దీని అనంతరం కింగ్ అక్కినేని నాగార్జునాన, ధనుష్ తొలిసారిగా కలిసి యాక్ట్ చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కుబేరా. ఈ మూవీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా శేఖర్ కమ్ముల దీనిని గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.
కాగా ఈ పాన్ ఇండియన్ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి తో పాటు తన సొంతం సంస్థ ఎమిగోస్ క్రియేషన్స్ పై శేఖర్ కమ్ముల స్వయంగా నిర్మిస్తుండడం విశేషం. ఈ మూవీ పై తమిళ్ తో పాటు తెలుగు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. జూన్ 20న ఈ మూవీ ఆడియన్స్ ముందుకి రానుంది.
రాబోయే సినిమాల విశేషాలు
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన కుబేర లోని ఫస్ట్ సాంగ్, నేడు రిలీజ్ అయిన ట్రాన్స్ గ్లింప్స్ వీడియో ఎంతో ఆకట్టుకుని ఇప్పటివరకు మూవీ పై ఉన్న అంచనాలు మరింతగా పెంచేసాయి. అయితే వీటి అనంతరం జులై 5న విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే కలిసి నటిస్తున్న కింగ్డమ్ మూవీ ఆడియన్స్ ముందుకి రానుంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ మూవీని గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తుండగా కీలక పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న కింగ్డమ్ మూవీ యొక్క ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ తో పాటు ఫస్ట్ సాంగ్ ఇటీవల రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.
దీని తరువాత జులై లోనే మాస్ మహారాజ్ రవితేజ మాస్ జాతర కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా భాను భోగవరపు దీనిని గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న మాస్ జాతర నుండి తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
అలానే మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ మూవీ విశ్వంభర మూవీ ఆగష్టు లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా యువి క్రియేషన్స్ సంస్థ దీనిని గ్రాండ్ గా నిర్మిస్తోంది.
తెలుగు ఫిలిమ్స్ న్యూస్ – తాజా అప్‌డేట్స్
ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈమూవీ తప్పకుండా విజయవంతం అవుతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభాస్ హీరోగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ హర్రర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ది రాజాసాబ్.
ఈ మూవీ పై ప్రభాస్ ఫ్యాన్స్ లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. త్వరలో టీజర్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీ కూడా ఈ ఏడాది ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో సంజయ్ దత్ కీలక పాత్ర చేస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ హీరోలుగా బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరక్కుతున్న యాక్షన్ మూవీ వార్ 2. ఇటీవల టీజర్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈమూవీ ఆగష్టు 14న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.
ఇక రజినీకాంత్ హీరోగా కింగ్ నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర కీలక పాత్రల్లో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ కూలీ. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్ ల తో పాటు ఒక సాంగ్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఆగష్టు 14న ఈ మూవీ రిలీజ్ కానుంది.
వీటితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళిల క్రేజీ కాంబినేషన్ మూవీ SSMB 29 తో పాటు పవన్ కళ్యాణ్, సుజీత్ ల ఓజి, అలానే అల్లు అర్జున్ అట్లీల మూవీతో పాటు రామ్ చరణ్ పెద్ది, ఎన్టీఆర్ వార్ 2, డ్రాగన్ సినిమాలు కూడా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.
ఈ సినిమాలలో చాలావరకు సినిమాలు ఈ ఏడాది అయితే ఆడియన్స్ ముందుకి వచ్చే ఛాన్స్ లేదు. ఇక బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తీస్తున్న అఖండ 2 మూవీ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. 14 రీల్స్ ప్లస్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
ఇక వీటితో పాటు విక్టరీ వెంకటేష్ హీరోగా త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈమూవీని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించనుంది. దీని యొక్క పూర్తి వివరాలు అతి త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.
What's Your Reaction?






