Kajal Aggarwal Movies, Husband, Age, Height, and Stunning Photos – Full Biography
Check out Kajal Aggarwal’s full biography including her age, height, husband name, latest movies list, and exclusive unseen photos.

టాలీవుడ్ స్టార్ నటీమణుల్లో ఒకరైన కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ప్రస్తుతం తెలుగు, తమిళ్ తో పాటు హిందీ చిత్ర సీమలో కూడా పలు మంచి అవకాశాలతో దూసుకెళ్తున్నారు. అయితే తొలిసారిగా తెలుగు చిత్ర సీమకు యువ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తేజ తీసిన లక్ష్మి కళ్యాణం మూవీ ద్వారా ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.
కాజల్ అగర్వాల్ బయోగ్రఫీ – పూర్తి వివరాలు
అప్పట్లో ఆ మూవీ మంచి విజయం అందుకుంది. అనంతరం క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తీసిన చందమామ (Chandamama) సినిమా హీరోయిన్ గా కాజల్ కు మరింత మంచి తీసుకువచ్చింది. ఆ మూవీలో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా నటించి తన ఆకట్టుకునే అందం, యాక్టింగ్ తో అందరినీ మెప్పించారు కాజల్ అగర్వాల్.
అయితే ఆ సినిమా అనంతరం మరికొన్ని సినిమాలని చేసి ఆకట్టుకున్న కాజల్, ఆపైన దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) హీరోగా రూపొందిన మగధీర (Magadheera) మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ సొంతం చేసుకున్నారు. ఈ మూవీ రెండు జన్మల కథగా రూపొంది 2009లో రిలీజ్ అయి భారీ విజయం సొంతం చేసుకుంది.
ఆ విధంగా మగధీర మూవీ ఒక్కసారిగా హీరోయిన్ గా కాజల్ యొక్క సినీ కెరీర్ ని విపరీతమైన ఎత్తుకు తీసుకువెళ్ళింది. అయితే అక్కడి నుండి తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు కాజల్. ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్ లో సైతం ఆమెకు ఆఫర్స్ క్యూ కట్టాయి.
ఆ తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తో ఆర్య 2 (Arya 2), పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) తో డార్లింగ్ (Darling), మిస్టర్ పర్ఫెక్ట్ (Mr. Perfect), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NT Ramarao Jr) తో బృందావనం (Brundhavanam), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో బిజినెస్ మ్యాన్ (Businessman) సినిమాలు చేసి మంచి విజయాలు సొంతం చేసుకోవడంతో పాటు ఎందరి ఫ్యాన్స్ యొక్క అభిమానాన్ని అందుకున్నారు కాజల్.
అనంతరం అటు తమిళ్ లో విజయ్ (Vijay) హీరోగా మురుగదాస్ తీసిన తుపాకీ (Thuppakki) సినిమాతో భారీ విజయం సొంతం చేసుకున్నారు. అలానే తెలుగులో ఎవడు (Yevadu), రామ్ చరణ్ తో మరొక్కసారి చేసిన గోవిందుడు అందరివాడేలే సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక మరొక్కసారి ఎన్టీఆర్ తో ఆమె చేసిన టెంపర్ మూవీ పెద్ద విజయం అందుకుంది.
కాజల్ అగర్వాల్ సినిమాలు లిస్టు
ఆపైన తొలిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో సర్ధార్ గబ్బర్ సింగ్ (Sardaar Gabbar Singh) సినిమా చేసారు. అయితే బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయింది. అలానే మరొక్కసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం సినిమా చేసారు, అయితే అది కూడా బోల్తా కొట్టింది. అక్కడి నుండి కెరీర్ పరంగా మరింత జాగ్రత్తగా కొనసాగిన కాజల్ అగర్వాల్, ఆపైన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150లో హీరోయిన్ గా నటించి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్నారు.
అలానే అటు హిందీ లో స్పెషల్ 26, ముంబై సాగా, ఫైనల్ కట్ డైరెక్టర్ వంటి సక్సెస్ లు అందుకుని అటు నార్త్ ఆడియన్సు యొక్క అభిమానాన్ని కూడా చూరగొన్నారు. ఇటీవల నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తీసిన యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి (Bhagavanth Kesari)తో పాటు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) తో మురుగదాస్ తీసిన సికందర్ సినిమాల ద్వారా ఆడియన్సు ముందుకి వచ్చారు.
అయితే వాటిలో భగవంత్ కేసరి పెద్ద సక్సెస్ కాగా, సికందర్ (Sikandar) పర్వాలేదనిపించే విజయం అందుకుంది. ఇక ప్రస్తుతం కమల్ హాసన్ తో శంకర్ తీస్తున్న ఇండియన్ 3 (Indian 3) తో పాటు మరికొన్ని సినిమాలు చేస్తున్నారు కాజల్. కాగా ఇటీవల గౌతమ్ కిచ్లు ని వివాహం చేసుకున్నారు కాజల్ అగర్వాల్. కాగా వారికి నీల్ అనే కుమారుడు 2022లో జన్మించాడు.
ఆమె భర్త గురించి – గౌతమ్ కిచ్లూ
కాగా ఆ విధంగా అటు ఫ్యామిలీని ఇటు సినిమా కెరీర్ ని జాగ్రత్తగా ప్లాంక్ చేసుకుంటూ కొనసాగుతన్నారు కాజల్. ఇక మొదటి నుండి అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో ఫ్యాన్స్ ఆడియన్స్ తో ఎంతో టచ్ లో ఉండే కాజల్, ఎప్పటికప్పుడు తన సినీ, వ్యక్తిగత విషయాలకు సంబదించిన పలు ఘటనలు, ఫోటోలు షేర్ చేసుకుంటూ ఉంటారు.
మొదటి నుండి కష్టాన్ని నమ్మితే ఖచ్చితంగా ఏదో ఒకరోజు విజయం మన తలుపు తడుతుందనేది తాను నమ్ముతానని, ప్రస్తుతం తన భర్త, కొడుకుతో జీవితం ఎంతో ఆనందంగా సాగుతుందని, వీలైతే ఇకపై మరిన్ని మంచి పాత్రలతో ఫ్యాన్స్, ఆడియన్స్ ని అలరించాలని కోరుకుంటున్నట్లు ఇటీవల ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ చెప్పారు కాజల్ అగర్వాల్. మరి నటిగా కాజల్ మరిన్ని విజయాలు అందుకుని దూసుకెళ్లాలని మా Telugu Movie Media టీమ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమెకు శుభాభినందనలు తెలియచేస్తోంది.
What's Your Reaction?






