Sandeep Reddy Vanga Mahesh Babu Movie Name
Mahesh Babu teams up with Sandeep Reddy Vanga for a powerful action film. Here’s what we know about the movie name and its concept

యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ అందరికీ ఎంతో సుపరిచితం. అంతేకాదు మన దేశంతో పాటు అనేక ఇతర దేశాల్లో కూడా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు సందీప్. అయితే కెరీర్ పరంగా తొలిసారిగా యువ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో ఆయన తీసిన లవ్ యాక్షన్ మూవీ అర్జున్ రెడ్డి (Arjun Reddy). ఈమూవీలో అందాల నటి షాలిని (Shalini Pandey) పాండే హీరోయిన్ గా నటించగా ఒకప్పటి సీనియర్ నటి కాంచన ఒక ముఖ్య పాత్రలో నటించారు.
అయితే అప్పట్లో మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈమూవీ పెద్ద విజయం అందుకోవడంతో పాటు ఇందులో నటుడిగా విజయ్ దేవరకొండకు దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ కి ఎంతో పేరు తీసుకువచ్చింది. ఆ విధంగా ఫస్ట్ మూవీతోనే బెస్ట్ సక్సెస్ ని క్రేజ్ ని సొంతం చేసుకున్నారు సందీప్.
సందీప్ రెడ్డి వంగా – మహేష్ బాబు కాంబినేషన్ సినిమాకు టైటిల్
దాని అనంతరం అదే మూవీని హిందీలో షాహిద్ కపూర్ (Shadhid Kapoor), కియారా అద్వానీ (Kiara Advani) లతో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అక్కడ కూడా విజయం అందుకున్నారు. రిలీజ్ అనంతరం కబీర్ సింగ్ కి హిందీ ఆడియన్స్ సైతం మంచి రెస్పాన్స్ అందించారు. ఆ విధంగా అక్కడ కూడా పాపులర్ అయిన సందీప్ ఇటీవల బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ (Ranbir Kapoor), నేషనల్ క్రష్ రష్మీక మందన్న (Rashmika Mandanna) లతో తీసిన మూవీ ఆనిమల్ (Animal Movie).
Director Sandeep Reddy Vanga’s film style (Arjun Reddy, Animal)
ఈమూవీలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్ర చేయగా భద్రకాళి పిక్చర్స్, టి సిరీస్ ఫిలిమ్స్, సినీ 1 స్టూడియోస్, దీనిని గ్రాండ్ గా నిర్మించాయి. 2023 డిసెంబర్ లో పలు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఆనిమల్ మూవీ అందరినీ ఎంతో ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.
అయితే ఈ మూవీ లోని పలు సీన్స్ పై పలువురు విమర్శలు ఎక్కుపెట్టినప్పటికీ కూడా ఆడియన్స్ మూవీని చూసేందుకు థియేటర్స్ కి క్యూ కట్టారు. ఓవరాల్ గా ఆనిమల్ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 930 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుని హీరోగా రణబీర్ కపూర్, దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ ల పేరుని, మార్కెట్ ని విపరీతంగా పెంచేశాయి.
సినిమా కథ, టైటిల్, మరియు భారీ అంచనాలు
మొత్తంగా కేవలం రూ. 100 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ భారీ విజయంతో నిర్మాతలతో పాటు అనేకమంది బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఎన్నో లాభాలు సొంతం చేసుకున్నారు. అయితే దీని అనంతరం తాజాగా టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) తో సందీప్ రెడ్డి వంగా తీస్తున్న లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ స్పిరిట్ (Spirit Movie).
ఈ మూవీలో బాలీవుడ్ యువ నటి త్రిప్తి డిమ్రి (Tripti Dimri) హీరోయిన్ గా నటిస్తుండగా హర్షవర్ధన్ రామేశ్వర్ దీనికి సంగీతం అందించనున్నారు. కాగా ఈమూవీని కూడా ఎంతో భారీ స్థాయిలో టిసిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు నిర్మించనున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న స్పిరిట్ మూవీ త్వరలో ఫస్ట్ షెడ్యూల్ ని మెక్సికో లో జరుపుకోనుంది.
కాగా ఈమూవీలో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే, అర్జున్ రెడ్డి అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఒక ఇంటెన్స్ యాక్షన్ స్టోరీ ని వినిపించానని, అయితే అది కొన్ని కారణాల వలన కార్యరూపం దాల్చలేదని ఇటీవల సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) మాట్లాడుతూ చెప్పారు.
కాగా ఆ కథకి డెవిల్ అనే టైటిల్ ని కూడా అనుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఆ మూవీ కథనే ఆనిమల్ గా తీశానని, మహేష్ ఆ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని కోరారని కొందరు అవాస్తవాలు ప్రచారం చేయడం తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు సందీప్. కాగా అందులో ఏమాత్రం వాస్తవం లేదని, డెవిల్ కథ వేరు ఆనిమల్ కథ వేరని అన్నారు.
ప్రేక్షకుల్లో హైప్, సోషల్ మీడియా లో ట్రెండ్
అయితే అప్పట్లో మహేష్ తన కమిట్మెంట్స్ కారణంగా డెవిల్ (Devil Movie) మూవీ చేయలేకపోయారని, కథ ఎంతో నచ్చిందని మహేష్ బాబు చెప్తే తానే పూర్తి స్క్రిప్ట్ కోసం టైం తీసుకున్నానని, అయితే అప్పటికే మహేష్ కి రెండు కమిట్మెంట్స్ ఉండడంతో అది అక్కడే ఆగిపోయిందని తెలిపారు.
ఇక ఆ మూవీ యొక్క కథ తనవద్దనే ఇంకా ఉందని, తప్పకుండా ఫ్యూచర్ లో తాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక పవర్ఫుల్ యాక్షన్ స్టోరీ తీస్తానని చెప్పుకొచ్చారు సందీప్ రెడ్డి వంగా. మరోవైపు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ SSMB29 చేస్తున్నారు మహేష్ బాబు. ఈ మూవీ పై గ్లోబల్ ఆడియన్స్ లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇది 2027 సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది.
Why this combo with Mahesh is special
అయితే దీని అనంతరం తన కెరీర్ 30వ మూవీని సందీప్ రెడ్డి వంగా తో సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) పని చేయనున్నారు అనే వార్తలు కూడా మరోవైపు కొన్నాళ్లుగా పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో, వారిద్దరూ కలిసి ఆ సినిమా చేస్తారో లేదో తెలియాలి అంటే మరొక రెండున్నరేళ్లు ఆగాల్సిందే అని తెలుస్తోంది. కాగా ఇటువంటి లేటెస్ట్ టాలీవుడ్ మూవీ అప్ డేట్స్ కోసం తరచు మా Telugu Movie Media సైట్ ని ఫాలో అవుతూ ఉండండి.
What's Your Reaction?






