Pushpa 2 Hindi TV Premiere: Date, Time & Channel Details

Catch Allu Arjun's blockbuster 'Pushpa 2: The Rule' in Hindi on Zee Cinema. Premieres on May 31 at 7:30 PM. Don't miss the action-packed sequel

Pushpa 2 Hindi TV Premiere: Date, Time & Channel Details

టాలీవుడ్ (Tollywood) స్టార్ యాక్టర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇటీవల పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2 ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. వాస్తవానికి అంతకముందు అల్లు అర్జున్ చేసిన పుష్ప 1 మూవీ మంచి విజయం అందుకుంది. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటించగా సుకుమార్ తెరకెక్కించారు. 

Pushpa 2 Hindi TV premiere date

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పుష్ప 1 (Pushpa The Rise) మూవీలో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ కనబరిచిన అద్భుత నటనకు ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ నుండి కూడా విశేషమైన రెస్పాన్స్ లభించింది. అనంతరం ఆయనకు భారత ప్రభుత్వం నుండి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా లభించింది. 

పుష్ప 2 హిందీ టీవీ ప్రీమియర్ వివరాలు

ఇక దాని తరువాత ఇటీవల రిలీజ్ అయిన పుష్ప 2 (Pushpa 2 The Rule) అంతకుమించిన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీలో కూడా మరొక్కసారి తన అద్భుత నట విశ్వరూపాన్ని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు అల్లు అర్జున్. ఇంకా ఈ మూవీలో రావు రమేష్, అనసూయ భరద్వాజ్, సునీల్, జగపతి బాబుతో పాటు మలయాళ నటుడు ఫహాద్ ఫాసిల్ కూడా కీలక పాత్రలు చేసారు. 

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈమూవీకి ఆయనతో పాటు కోలీవుడ్ యువ మ్యూజికల్ సెన్సేషన్ సామ్ సి ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూర్చారు. మొదటి అందిలో భారీ అంచనాలు ఏర్పరిచిన పుష్ప 2 మూవీ అన్ని భాషల ఆడియన్స్ ని ఆకట్టుకుని ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 1800 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుని గొప్ప రికార్డు సృష్టించింది. 

Pushpa 2 television broadcast details

ఇక అటు నార్త్ లో పుష్ప 2 మరింతగా అదరగొట్టింది అని చెప్పాలి. ముఖ్యంగా హిందీ గ్రాస్ పరంగా ఇండియా వైడ్ పుష్ప 2 మూవీ ప్రస్తుతం టాప్ స్థానంలో ఉంది. ఒకరకంగా ఈ రికార్డు ని అందుకోవడం అంత సులభం కాదని చెప్పాలి. ఇక పుష్ప 2 మూవీ థియేటర్స్ లో అల్ ఏరియాస్ లో అదరగొట్టిన అనంతరం ఓటిటి లో రిలీజ్ లో కూడా రిలీజ్ అయి బాగానే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. 

విడుదల తేదీ, సమయం మరియు ఛానల్ సమాచారం

పలు భాషల ఓటిటి ఆడియన్స్ కూడా దీనికి బాగా రెస్పాన్స్ అందించారు. అయితే అసలు విషయం ఏమిటంటే, నిన్న అనగా మే 31న రాత్రి 7 గం. 30 ని. లకు పుష్ప 2 మూవీ యొక్క హిందీ టెలివిజన్ ప్రీమియర్ ప్రదర్శితం అయింది. ప్రముఖ హిందీ టెలివిజన్ ఛానల్ జీ సినిమాలో దీనిని ప్రదర్శించారు. 

Pushpa 2 Hindi version on TV

వాస్తవానికి అంతకంకుండు తెలుగు టెలివిజన్ ప్రీమియర్ గా ప్రదర్శితం అయి మంచి రేటింగ్స్ ని రెస్పాన్స్ ని అందుకున్న పుష్ప 2 మూవీ ఇటు హిందీలో కూడా భారీ స్థాయిలో టిఆర్పి ని అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ నుండి పుష్ప అనే పాత్ర భారతదేశం అంతటా సాధారణ ఆడియన్స్ మదిలో ఒక మంచి ఇంప్రెషన్ ని ఏర్పరిచింది. 

పుష్ప 2 థియేటర్, OTT తర్వాత టీవీలో ప్రసారం వివరాలు

ఆ విధంగా తన నటనతో అందరిలో చెరగని ముద్రవేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక తాజగా పుష్ప 2 మూవీ హిందీ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రదర్శితం కావడంతో అది ఎంతమేర టిఆర్పి అందుకుంటుందనేది ప్రస్తుతం అందరిలోనూ ఎంతో ఆసక్తికరంగా మారింది. 

ఓవైపు ఇటీవల మళ్ళి ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభము అయినప్పటికీ కూడా టివిల్లో ఆడియన్స్ ఈ మూవీ వైపు బాగానే మొగ్గుచూపినట్లు టాక్. మొత్తంగా అయితే లేటెస్ట్ గా హిందీ ఆడియన్స్ ముందుకి వచ్చిన పుష్ప 2 మూవీ ఓవరాల్ గా ఎంతమేర టీఆర్పీ సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow