Mahesh Babu’s Khaleja Re-Release Worldwide Collections Report

Mahesh Babu’s cult classic Khaleja re-release creates box office waves. Check out the full worldwide collection report and fans’ response

Mahesh Babu’s Khaleja Re-Release Worldwide Collections Report

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మొత్తంగా మూడు సినిమాలు వచ్చాయి. అందులో 2005లో వచ్చిన అతడు మూవీ పెద్ద విజయం సొంతం చేసుకోగా అనంతరం 2010లో వచ్చిన ఖలేజా మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. 

అయినప్పటికీ ఆ మూవీలో సీతారామరాజు అనే డ్రైవర్ పాత్రలో సూపర్ స్టార్ నటనకు ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్సు అందరూ కూడా ఎంతో థ్రిల్ అయ్యారు. మెలోడీబ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన మహేష్ ఖలేజా మూవీలో లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించగా కనకరత్న మూవీస్ బ్యానర్ పై శింగనమల రమేష్ బాబు అప్పట్లో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్మించారు. 

ఖలేజా రీ రిలీజ్ కలెక్షన్లపై రిపోర్ట్

విశేషం ఏమిటంటే, ఖలేజా మూవీ దాదాపుగా అప్పట్లో అనేక ఏరియాస్ లో డే సుమని ఓపెనింగ్స్ తో భారీ రికార్డ్స్ అందుకోవడం. అయితే సినిమా థియేటర్స్ లో ఆకట్టుకోనప్పటికీ అనంతరం ప్రసారం అయిన టెలివిజన్ ఛానల్స్ లో మాత్రం ఖలేజాకి విపరీతమైన వ్యూయర్ షిప్ రేటింగ్స్ లభించాయి. 

ఇక ఈ మూవీ ఎప్పుడు ప్రదర్శితం అయినా కూడా టివిలో దీనికి ఎప్పటికప్పుడు మంచి రేటింగ్స్ రాసాగాయి. దానితో దీనిని తాజాగా థియేటర్స్ లో మళ్ళి 15 ఏళ్ళ అనంతరం ఇటీవల మే 30న రీ రిలీజ్ చేసారు. మంచి ధరకు ఈ మూవీ యొక్క రీ రిలీజ్ రైట్స్ అమ్ముడయ్యాయి. 

Khaleja 4K Release Total Collection

కాగా ఫస్ట్ డే నుండి ఖలేజా రీ రిలీజ్ లో థియేటర్స్ లో అదరగొట్టే స్థాయి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాదు అనేక ఇతర స్టార్స్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఈ మూవీకి థియేటర్స్ లో నీరాజనాలు పలికారు. ఇటీవల మహేష్ నటించిన బ్లాక్ బస్టర్ మురారి మూవీ కూడా థియేటర్స్ లో రీ రిలీజ్ అయి సంచలన రికార్డ్స్ నెలకొల్పిన విషయం తెలిసిందే. 

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆదాయం ఎంత తెలుసా?

ఇక మహేష్ ఖలేజా విషయంలో ఫస్ట్ డే నుండి భారీ ఓపెనింగ్స్, అంతకముందు ప్రదర్శించిన ప్రీమియర్స్ కి కూడా సూపర్ రెస్పాన్స్ రావడంతో ఇది ఓవరాల్ గా పెద్ద రికార్డ్స్ కొల్లగొట్టడం ఖాయం అని అందరూ భావించారు. అనుకున్నట్లుగానే డే 1 నుండి మహేష్ ఖలేజా మూవీ బాక్సాఫీస్ బద్దలుకొట్టింది. 

ఖలేజా 4K మూవీని మళ్ళి ఎన్నో ఏళ్ళ అనంతరం థియేటర్స్ లో చూడడంతో పాటు తమ అభిమాన సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ నటి అనుష్క శెట్టి ల పెర్ఫార్మన్స్, త్రివిక్రమ్ టేకింగ్స్, మణిశర్మ సాంగ్స్ కి అందరూ ఫిదా అవుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే అందులోని సీన్స్ ని రీ క్రియేట్ కూడా చేయగా అవి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాల్లో కూడా ఎంతో వైరల్ అయ్యాయి. మొత్తంగా మహేష్ ఖలేజా మూవీ యొక్క టోటల్ కలెక్షన్ డిటైల్స్ ఇప్పుడు చూద్దాం. 

Khaleja 4K Movie Re Release Total Boxoffice Collection 

నైజాం : రూ. 5. 78 కోట్లు

సీడెడ్ : రూ. 69 లక్షలు

ఆంధ్ర : 3. 24 కోట్లు

ఏపీ + తెలంగాణ టోటల్ కలెక్షన్స్ : రూ. 9. 71 కోట్లు 

కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా  : రూ. 98 లక్షలు

ఓవర్సీస్ : రూ. 1. 50 కోట్లు దాదాపుగా

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ : రూ. 12. 19 కోట్లు

మొత్తంగా చెప్పాలి అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ఖలేజా మూవీ రీ రిలీజ్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ రికార్డు ని డే 1 నుండి క్లోజింగ్ వరకు నమోదు చేసింది. ముఖ్యంగా ప్రీమియర్స్ పరంగా కూడా రికార్డ్స్ నెలకొల్పిన మహేష్ ఖలేజా మూవీ గతంలో తాను మురారితో క్రియేట్ చేసిన టాప్ కలెక్షన్ ని బీట్ చేసి ఖలేజా మరొక్కసారి తన సినిమాతోనే టాప్ లో నిలిచారు సూపర్ స్టార్. ఆ విధంగా అటు న్యూ రిలీజ్ లతో పాటు ఇటు రీ రిలీజ్ లలో కూడా తిరుగులేకుండా దూసుకెళ్తున్నారు మహేష్ బాబు

మహేష్ అభిమానుల స్పందన, థియేటర్ ఫుల్ షోలు

మరి దీనికే ఇలా ఉంటే అందరిలో ఇంకెన్నో భారీ అంచనాలు కల్గిన బ్లాక్ బస్టర్ సెన్సేషనల్ మావోయి అతడు ఆగష్టు 9న మహేష్ బాబు జన్మదినం సందర్భంగా రీ రిలీజ్ అనంతరం ఇంకెంతటి బాక్సాఫీస్ సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow