10 Shocking Facts About Mahesh Babu You Probably Didn’t Know

Discover 10 shocking and unknown facts about superstar Mahesh Babu – from childhood surprises to rare behind-the-scenes moments

10 Shocking Facts About Mahesh Babu You Probably Didn’t Know

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మన తెలుగు ఆడియన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర భాషలు ఆడియన్స్ కి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు అని చెప్పాలి. తన తండ్రి నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినిమాల్లోకి బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. తొలిసారిగా ఒకప్పటి దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు తీసిన నీడ సినిమా ద్వారా మహేష్ బాబు సినిమా రంగ ఎంట్రీ ఇచ్చారు. అక్కడి నుండి బాల నటుడిగా పలు సినిమాలు చేస్తూ కొనసాగారు మహేష్ బాబు.

Mahesh Babu Interesting Facts

అయితే అప్పట్లోనే నటన పట్ల ఆసక్తితో తో పాటు ఆ వయసులోనే ఎన్నో సాహసాలు చేసారు మహేష్ బాబు. ముఖ్యంగా కొడుకు దిద్దిన కాపురం మూవీలోని గుర్రం ఎక్కి ఫైట్ చేసే సీన్ కోసం యూనిట్ వారు డూప్ ని సిద్ధం చేస్తే అది అవసరం లేదు నేనే స్వయంగా చేస్తాను అంటూ మహేష్ బాబు ఆ ఫైట్ ని ఒరిజినల్ గా చేయడం జరిగింది. ఆ విధంగా చిన్నప్పటి నుండే తండ్రి కృష్ణ మాదిరిగా ఎంతో డేరింగ్ డాషింగ్ తత్వం సూపర్ స్టార్ మహేష్ బాబు సొంతం. ఇక ఆ తరువాత బాలచంద్రుడు మూవీతో బాలనటుడిగా సినిమాలకు విరామం పలికిన మహేష్ బాబు, అనంతరం సత్యానంద్ దగ్గర నటనలో శిక్షణ తీసుకుని 1999లో కె రాఘవేంద్ర రావు తీసిన రాజకుమారుడు మూవీ ద్వారా హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. 

బాలీవుడ్ నటి ప్రీతీ జింతా హీరోయిన్ గా నటించిన ఈ మూవీని వైజయంతి మూవీస్ సంస్థ పై అశ్వినీదత్ గ్రాండ్ గా నిర్మించగా అప్పట్లోనే ఈ మూవీ అతి పెద్ద సంచలన విజయం సొంతం చేసుకుంది. ముఖ్యంగా హీరోగా ఫస్ట్ మూవీతోనే తన ఆకట్టుకునే అందంతో పాటు అద్భుత అభినయంతో ఎందరో ఫ్యాన్స్ మనసు దోచారు మహేష్ బాబు. అప్పట్లో రాజకుమారుడు మూవీ భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకోవడంతో పాటు నటుడిగా మహేష్ బాబుకు విశేషమైన క్రేజ్ తీసుకువచ్చింది. ఆ తరువాత యువరాజు మూవీతో ఎబోవ్ యావరేజ్ సక్సెస్ అందుకున్న మహేష్ కు 4వ సినిమా మురారి భారీ విజయాన్ని అందించింది.

మహేష్ బాబు గురించి మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు

అందులో మహేష్ నటనకు విమర్శకుల నుండి సైతం ప్రసంశలు దక్కాయి. ముఖ్యంగా మురారిలోని క్లైమాక్స్ సీన్స్ లో మహేష్ బాబు నటనకు ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్, విమర్శకులు సైతం ప్రసంశలు అందించారు. ఇక అక్కడి నుండి నటుడిగా మరింతగా దూసుకెళ్లిన మహేష్ బాబుకి 7వ సినిమా ఒక్కడు అత్యద్బుత విజయం హీరోగా విపరీతమైన స్టార్డంని తీసుకువచ్చింది. ఆపైన అతడు, పోకిరి, దూకుడు సినిమాలతో దూసుకెళ్లారు సూపర్ స్టార్. అలానే తన కెరీర్ లో పోకిరి, దూకుడు, శ్రీమంతుడు సినిమాలతో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్స్ సొంతం చేసుకున్నారు మహేష్ బాబు. 

ముఖ్యంగా ఇటీవల ఆయన నటించిన సర్కారు వారి పాట, గుంటూరు కారం సినిమాలతో ఫస్ట్ డే ప్రీమియర్స్ నుండి నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా అవి థియేటర్స్ లో సూపర్ హిట్ స్థాయి కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి అంటే మహేష్ బాబు స్టార్డం, బాక్సాఫీస్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. టాక్ తో సంబంధం లేకుండా ప్లాప్ తో కూడా సూపర్ హిట్ కొట్టగల సమర్ధత సూపర్ స్టార్ మహేష్ బాబు సొంతం అని నిరూపించిన మహేష్ బాబు ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB29 లో హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ 2027 సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకి రానుంది. కాగా మహేష్ బాబు గురించి చాలామందికి తెలియని కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. 

1. కెరీర్ బిగినింగ్ నుండి కొంత రిజర్వ్డ్ గా ఉండే మహేష్ బాబు, ముఖ్యంగా ఎక్కువగా ఎవ్వరితోను కలిసేవారు కాదని రూమర్స్ వచ్చాయి. వాస్తవం ఏమిటంటే, ఆయన ఎవరినైనా కలిసి వారు నచ్చితే విపరీతంగా ఇంటరాక్ట్ అవుతారట. అలానే మహేష్ బాబు వారితో వేసే సరదా పంచెస్ కి పగలబడి నవ్వాల్సిందే. ఆ విధంగా అందరితో పసి పిల్లాడి మాదిరిగా కలిసిపోతారు మహేష్ బాబు. రాను రాను పూర్తిగా కలివిడిగా అందరితో మరింత సరదాగా ఉండే సూపర్ స్టార్ సెట్స్ లో ఉన్నారు అంటే లైట్ బాయ్ నుండి దర్శకుడి వరకు అంతా సూపర్ సందడే. 

2. ఇక తన సినిమా కెరీర్ ని రాజకుమారుడు మూవీతో హీరోగా మొదలెట్టిన మహేష్ బాబు కెరీర్ 5వ సినిమా అయిన టక్కరి దొంగ మూవీలో అనేక రిస్కీ స్టంట్స్ ఒక్క షాట్ కూడా డూప్ లేకుండా ఎంతో కష్టపడి చేసారు. ముఖ్యంగా తన ఎంట్రీ సీన్ తో పాటు ఇంటర్వెల్ ఎపిసోడ్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ కోసం మహేష్ బాబు పడ్డ కష్టం అంతా ఇంతా కాదని ఆ మూవీ దర్శకుడు జయంత్ చెప్పారు. 

సూపర్ స్టార్ బాల్యంలోనే డేరింగ్ డాషింగ్

3. అలానే టక్కరి దొంగ మూవీకి సంబంధించి సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్క రూపాయి కూడా తన నుండి రెమ్యునరేషన్ గా తీసుకోలేదని దర్శకుడు జయంత్ చెప్పారు. అలానే ఆ మూవీ అప్పట్లో ఆడియో పరంగా హైయెస్ట్ సేల్స్ అందుకోవడంతో పాటు టాలీవుడ్ లో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న మూవీగా కూడా నిలవగా ఓవరాల్ గా యావరేజ్ గా నిలిచింది. 

4. ఇక ఎవరైనా స్టార్ నటుడు లేదా నటి మంచి క్రేజ్ తో దూసుకెళ్తుంటే వారికి ఇతరులతో లవ్ అఫైర్స్ ఉన్నాయి అంటూ పుకార్లు చెర్కర్లు కొట్టడం సహజం. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలో అటువంటివి ఏవి ప్రచారం కాలేదు. అయితే తన మూడవ సినిమా వంశీ లో నటించిన నమ్రత శిరోద్కర్ తో మహేష్ ప్రేమలో ఉన్నారు అంటూ అప్పట్లో ఒకటి రెండు కథనాలు వచ్చినా, ఆ పైన అతడు సినిమా సమయంలో ఆమెను గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు మహేష్ బాబు. 

5. ఇక తన కెరీర్ బాలచంద్రుడుతో బాలనటుడిగా విరామం పలికిన మహేష్ బాబు, అప్పట్లో కొంత బొద్దుగా ఉండేవారు. అయితే ఆ శరీరం తగ్గడానికి హైదరాబాద్ కేబీఆర్  పార్క్ కి నిత్యం వెళ్లడంతో పాటు నిత్యం ఎంతో కష్టపడేవారని మెగాబ్రదర్ నాగబాబు ఒక వీడియోలో చెప్పుకొచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అప్పట్లో ఎంతో కష్టపడ్డారని, ఇక ఆయన పరిగెత్తుతుంటే సింహం మాదిరిగా ఉంటుందని అన్నారు. 

Shocking Facts about Mahesh Babu

7. ఇక మహేష్ బాబు సినీ కెరీర్ ని పరిశీలిస్తే మనకు ఒక ఇంట్రస్టింగ్ విషయం అర్ధం అవుతుంది. వాస్తవానికి టాలీవుడ్ లో అత్యంత అందగాడైన మహేష్ బాబు తన కెరీర్ లో పూర్తి స్థాయి లవ్ స్టోరీ మూవీ ఒక్కటి కూడా చేయలేదు. అప్పట్లో లవ్ స్టోరీ సినిమాల దర్శకుడిగా పేరు గాంచిన ఏ. కరుణాకరన్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక మంచి లవ్ స్టోరీ చేయాల్సి ఉంది కానీ అని కార్యరూపం దాల్చలేదని అప్పట్లో పలు వార్తలు వచ్చాయి. 

మహేష్ బాబు మంచి మనసు, వ్యక్తిత్వం

8. అలానే మహేష్ కెరీర్ లో పూర్తి స్థాయి మాస్ సినిమా కూడా రాలేదనే చెప్పాలి. నిజానికి టాలీవుడ్ టాప్ స్టార్ అయిన మహేష్ బాబుకి కోట్లాది ఫ్యాన్ బేస్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ లో విశేషమైన క్రేజ్ ఉంది. ఆయన కెరీర్ లో పోకిరి, బిజినెస్ మ్యాన్, ఆగడు వంటి మాస్ సినిమాలు వచ్చినప్పటికీ సూపర్ ఫ్యాన్స్ కోరుకునే స్థాయి ఊరమాస్ మూవీ మాత్రం ఆయన నుండి రాలేదు. 

9. ఇక మిగతా హీరోల మాదిరిగా సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి మనసు, వ్యక్తిత్వం గురించి అందరికీ తెల్సిందే. తన నుండి వచ్చిన ఏదైనా సినిమా ఫెయిల్ అయితే అందుకు వచ్చిన నష్టాన్ని భరించి నిర్మాతకు అండగా నిలిచే గొప్ప మనసు ఆయనది. అలానే సినిమా సినిమా ఫ్లాప్ అయితే దానికి కారణం తానే అని, తాను కనుక ఆ మూవీ యొక్క స్టోరీ ఓకే చేయకపోతే అది జరుగదు కదా అంటారు మహేష్. అలానే తన సినిమా విజయవంతం అయితే అది తన టీమ్ మొత్తం పడ్డ కష్టం అంటూ గొప్పగా చెప్తారు మహేష్. 

Mahesh Babu Unknown sSories

10. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేకత ఏమిటంటే, ఆయన పూర్తి స్థాయి డైరెక్టర్స్ హీరో కావడం. ఒక్కసారి దర్శకుడి నుండి కథ విని ఓకె చేసిన తరువాత సినిమా సెట్స్ మీదకు వెళ్లి పూర్తి అయ్యేవరకు ఆయన స్టోరీ విషయంలో ఏ విధంగా కలుగచేసుకోరని, అందుకే ఆయనతో సినిమా తీయడం, మంచి విజయం అందించడం తేలిక అని, ముఖ్యంగా ఆయనతో ఒకసారి పని చేస్తే మళ్ళి మళ్ళి పనిచేయాలని అనిపిస్తుందని పలువురు దర్శకులు చెప్తూ ఉంటారు. 

11. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇటీవల బాహుబలి సినిమాల రాక తరువాత పాన్ ఇండియన్ సినిమాలు, పాన్ ఇండియన్ స్టార్స్ క్రేజ్ అనేది వచ్చింది. కానీ నేటి టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరికంటే ముందు పాన్ ఇండియన్ రేంజ్ లో ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఎంతో క్రేజ్ అందుకున్నారు  సూపర్ స్టార్ మహేష్ బాబు. అప్పట్లో ఇండియా వైడ్ జరిగిన మోస్ట్ డిజైరబుల్ కాంటెస్ట్ లో మొదట నాలుగవ స్థానం, ఆపైన మూడు, అనంతరం రెండు, ఒకటి స్థానాలను అందుకున్న మహేష్ బాబు, ఫైనల్ గా ఫరెవర్ మోస్ట్ డిజైరబుల్ మెన్ గా అప్పట్లోనే బాలీవుడ్ స్టార్స్ ని తలదన్ని తారాస్థాయిలో నిలిచారు. 

Tollywood Superstar Secrets

12. ఇక మహేష్ బాబు తొలిచిత్రం రాజకుమారుడు అప్పట్లోనే ప్రిన్స్ నెంబర్ గా డబ్ అయి మంచి పేరు అందుకుంది. ఆ విధంగా అప్పటి బాలీవుడ్ దర్శకులు కొందరు కృష్ణ గారిని కలిసి మహేష్ బాబుని హిందీ సినిమాల్లోకి అహ్వాహించారు. అయితే తను ముందు తెలుగులో రాబోయే రోజుల్లో బాగా స్థిరపడాలని, అనంతరం హిందీ గురించి ఆలోచిస్తాం అంటూ కృష్ణ ఆ అవకాశాలను సున్నితంగా తోసిపుచ్చారని అప్పటి సినీ పత్రికల్లో వార్తలు వచ్చాయి.  

13. ఇక ఫైనల్ గా అటు స్క్రీన్ పైనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టార్ గా నిరూపించుకున్న మహేష్ బాబు, దాదాపుగా 4500 మందికి పైగా చిన్నారులకు హృదయ శస్త్ర చికిత్సలు చేయించి తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. అలానే పలువురు పెద్ద విద్యార్థులకు తనవంతుగా ఫీజులు కట్టడం, పుస్తకాల పంపిణీతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని బుర్రిపాలెం గ్రామాన్ని, తెలంగాణలో సిద్దాపురం గ్రామాలని దత్తత తీసుకుని తనవంతుగా అభివృద్ధి చేస్తున్నారు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow