Jr NTR Replaces Allu Arjun in Trivikram’s Upcoming Mythological Movie ?
Big update: Jr NTR replaces Allu Arjun in Trivikram Srinivas's mythological project. Get full details on casting twist and production updates

టాలీవుడ్ స్టార్ నటులు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), అల్లు అర్జున్ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుసగా సినిమాలతో కొనసాగుతున్నారు. ఇటీవల కొరటాల శివ తీసిన దేవర పార్ట్ 1 (Devara Part 1) మూవీ ద్వారా పెద్ద విజయం అందుకున్నారు ఎన్టీఆర్. ఈమూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ ఆ మూవీని నిర్మించాయి.
ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి అయాన్ ముఖర్జీ తీస్తున్న వార్ 2 మూవీతో పాటు మరోవైపు కెజిఎఫ్, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి డ్రాగన్ సినిమాలు చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ రెండు సినిమాల పై ఆయన ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి.
కాగా వాటిలో వార్ 2 (War 2) ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకోగా దీనిని గ్రాండ్ గా ఆగష్టు 14న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు టీమ్ షహనాలు చేస్తోంది. ఇక ఈమూవీని ప్రముఖ బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం నుంచి అల్లు అర్జున్ ఔట్ – ఎన్టీఆర్ ఇన్ ?
మరోవైపు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తీస్తున్న డ్రాగన్ (Dragon) కూడా వేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా ఇందులో కన్నడ అందాల నటి రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) ఎన్టీఆర్ కి జోడీగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సలార్ మూవీతో మరొక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ప్రశాంత్ నీల్ ఈ మూవీని మరింత గ్రాండియర్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇక ఈమూవీని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తుండగా రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు.
మొదటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు కలిగిన ఈ క్రేజీ ప్రాజక్ట్ 2026 జూన్ 25న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మరోవైపు ఇటీవల పుష్ప 2 (Pushpa 2 The Rule) మూవీతో అతిపెద్ద సంచలన విజయం సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. ఈ మూవీలో రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటించగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దానిని తెరకెక్కించారు. ఇక పుష్ప 2 మూవీ మన తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ తో పాటు అటు నార్త్ లో కూడా అదరగొట్టిన విషయం తెలిసిందే.
Allu Arjun Out & Jr NTR in for Trivikram Srinivas Next Movie
అక్కడ ఈమూవీ అత్యధిక స్థాయి కలెక్షన్ సొంతం చేసుకుని ఇండియా వైడ్ టాప్ ప్లేస్ లో నిలిచినా విషయం తెలిసిందే. ఇక దీని అనంతరం తాజాగా కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ కుమార్ తో తన నెట్ మూవీ మొదలెట్టారు అల్లు అర్జున్ (Allu Arjun). AA22 అనే వర్కింగ్ టైటిల్ తో గ్రాండియర్ రేంజ్ లో రూపొందుతున్న ఈ మూవీలో బాలీవుడ్ అందాల నటి దీపికా పదుకొనె (Deepika Padukone) హీరోయిన్ గా నటిస్తున్నట్లు ఇప్పటికే టీమ్ అఫీషియల్ గా ఆమె పేరుని ప్రకటించింది.
అలానే మరొక ఇద్దరు అందాల భామలైన జాన్వీ కపూర్ (Janhvi Kapoor), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కూడా నటించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈమూవీని ప్రముఖ అగ్ర కోలీవుడ్ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తుండగా సాయి అభ్యంకర్, హ్యాన్స్ జిమ్మర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి క్రేజ్ ఏర్పరిచింది.
ఎందుకు మార్పు జరిగింది? పూర్తి వివరాలు
కాగా ఈ మూవీలో అల్లు అర్జున్ మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నట్లు టాక్. దీనిని 2026 చివర్లో రిలీజ్ చేయనున్నారు. అయితే వాస్తవానికి అట్లీ మూవీ ప్లేస్ లో అంతకముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక భారీ మైథలాజికల్ మూవీ అనౌన్స్ చేసారు అల్లు అర్జున్. దీనిని గీత ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంస్థలు నిర్మించనున్నట్లు కూడా అఫీషియల్ ప్రకటన వచ్చింది.
అయితే మధ్యలో హఠాత్తుగా అట్లీ తో మూవీ అనౌన్స్ చేసారు అల్లు అర్జున్. దానితో కొన్నాళ్ల పాటు త్రివిక్రమ్ ప్రాజక్ట్ ఆయన ప్రక్కన పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఇక త్వరలో విక్టరీ వెంకటేష్ తో ఒక మూవీ చేసేందుకు త్రివిక్రమ్ సిద్ధం అవుతున్నారు. అసలు మ్యాటర్ ఏమిటంటే, వెంకటేష్ తో మూవీ అనంతరం రామ్ చరణ్ తో ఒక మూవీ తో పాటు ఎన్టీఆర్ తో కూడా త్రివిక్రమ్ వర్క్ చేయనున్నారట.
Allu Arjun Trivikram Srinivas AA23 Movie
అలానే అల్లు అర్జున్ కోసం ఆయన రాసుకున్న మైథలాజికల్ మూవీని ఎన్టీఆర్ తో తీయనున్నారని అంటున్నారు. అయితే ఈ ప్రాజక్ట్ వాస్తవానికి రెండేళ్ల క్రితం ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ అనుకున్నారని, అప్పట్లో చర్చల దశలో ఉండిపోయిన ఇది ఆ తరువాత అల్లు అర్జున్ ఓకే చేయడంతో తెరమీదకు వచ్చిందని అంటున్నారు.
మొత్తంగా చివరికి అది మళ్ళి ఎన్టీఆర్ నే చేరిందని, ఇందులో ఎన్టీఆర్ కుమారస్వామి గా కనిపించనున్నారని, ఆకట్టుకునే కథ, కథనాలతో భారీస్థాయిలో గ్రాండియర్ మైథలాజికల్ (Mythological) ఎంటర్టైనర్ మూవీ గా దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram Srinivas) దీనిని తెరకెక్కించనున్నట్లు టాక్. ఇక ఈమూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నట్లు చెప్తున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ సినిమాపై ఫ్యాన్స్ అంచనాలు
ఇక వేరొకవైపు త్వరలో ఎన్టీఆర్ తో కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ ఒక మూవీ తీయనుండగా దానిని సితార సంస్థ నిర్మించనున్న విషయం తెలిసిందే. మొత్తంగా అటు నెల్సన్ మూవీతో పాటు ఇటు త్రివిక్రమ్ మూవీస్ తో రెండుసార్లు ఎన్టీఆర్ తో వర్క్ చేయనున్నారట నాగవంశీ. మొత్తంగా ఈ న్యూస్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది.
కాగా త్రివిక్రమ్, ఎన్టీఆర్ ప్రాజక్ట్ కి సంబంధించి ఆ మూవీ టీమ్ నుండి అఫీషియల్ గా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. మరి ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల ఈ క్రేజీ మూవీ పెద్ద వియజయం అందుకోవాలని అలానే ఇటువంటి లేటెస్ట్ టాలీవుడ్ మూవీ న్యూస్ కోసం మా Telugu Movie Media సైట్ ని చూస్తూ ఉండమని కోరుతున్నాము. మరి త్వరలో అనౌన్స్ మెంట్ వచ్చి ఆపై సెట్స్ మీదకు వెళ్లి రిలీజ్ అనంతరం ఈ భారీ క్రేజీ మూవీ ఎంతమేర విజయం అందుకుంటుందో, ఏస్థాయిలో బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.
What's Your Reaction?






