Ram Charan & Sandeep Reddy Vanga Movie Fixed ?

Mega Power Star Ram Charan teams up with Sandeep Reddy Vanga for a massive pan-India project. Official announcement excites fans!

Ram Charan & Sandeep Reddy Vanga Movie Fixed ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఈ ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా ఆడియన్స్ ముందుకి వచ్చిన మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer). ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో శ్రీకాంత్, సముద్రఖని, రాజీవ్ కనకాల, అంజలి (Anjali) నటించారు. 

మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈమూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అయితే అందుకోలేకపోయింది. ఈ మూవీని ప్రముఖ దర్శకుడు శంకర్ (Shankar Shanmugam) తెరకెక్కించగా ఎస్ థమన్ సంగీతం అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పై దిల్ రాజు (Dil Raju) భారీ వ్యయంతో పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మించిన ఈమూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేసారు. 

రామ్ చరణ్ – సందీప్ రెడ్డి వంగా సినిమా ఫిక్స్ ?

అయితే ఈ మూవీ అనంతరం ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న మూవీ పెద్ది (Peddi). దీనిని ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు సన తెరకెక్కిస్తుండగా బాలీవుడ్ అందాల నటి జాన్వీ కపూర్ (Jahnvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వ్రిద్ది సినిమాస్ సంస్థ పై వెంకట సతీష్ కిలారు గ్రాండ్ గా పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తున్నారు. 

ఏ ఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్న ఈమూవీలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ (Shivaraj Kumar) కీలక పాత్ర చేస్తుండగా అమెజాన్ ప్రైమ్ లోని మీర్జాపూర్ ఫేమ్ దివ్యెందు కూడా మరొక ముఖ్య పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పెద్ది మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి మార్చి 27న గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో పలు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. 

Ram Charan Sandeep Reddy Vanga Movie

కాగా ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ యొక్క ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ ఇటీవల రిలీజ్ అయి మంచి క్రేజ్ అందుకుని సినిమా పై చరణ్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా బాగా అంచనాలు ఏర్పరిచింది. రామ్ చరణ్ ఇందులో మంచి మాస్ పాత్ర చేస్తున్నట్లు టీజర్ ని బట్టి చూస్తే మనకు అర్ధం అవుతుంది. 

పాన్ ఇండియా లెవల్లో ప్రాజెక్ట్ – అభిమానుల్లో హైప్

క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీగా రూపొందుతున్న పెద్ది రిలీజ్ అనంతరం భారీ విజయం అందుకోవడం ఖాయం అని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే ఈ మూవీ తరువాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేయనున్నారు. 

ఇటీవల అల్లు అర్జున్ (Allu Arjun) తో పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 (Pushpa 2 The Rule) తెరకెక్కించి  ఇండియా వైడ్ అతిపెద్ద బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుని దర్శకుడిగా సుకుమార్ రేంజ్ ని విపరీతంగా పెంచింది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు గ్రాండ్ గా భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. 

Animal Director Sandeep Reddy Vanga Next Movie with Ram Charan

ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ రామ్ చరణ్ RC 17 మూవీకి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పెద్ది మూవీ షూటింగ్ మరికొన్ని నెలల్లో పూర్తి కానుండగా దాని అనంతరం సుకుమార్ మూవీ షూట్ లో రామ్ చరణ్ జాయిన్ అవ్వనున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. 

అయితే అసలు విషయం ఏమిటంటే, పెద్ది అనంతరం రామ్ చరణ్ ఆనిమల్ (Animal) డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ఒక ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేయనున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రామ్ చరణ్ కి దర్శకుడు సందీప్ ఒక మంచి స్టోరీ లైన్ వినిపించారని టాక్. 

విడుదల తేదీ, టీం డీటెయిల్స్, మొదటి పోస్టర్ అప్‌డేట్

అయితే అది ఎంతో నచ్చిన చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) తో స్పిరిట్ చేసేందుకు సిద్దమవుతున్న సందీప్ రెడ్డి వంగా ఆ తరువాత ఈమూవీ యొక్క పూర్తి కథ, స్క్రిప్ట్ డెవలప్ చేయనున్నారట. టాలీవడ్ కి చెందిన ఒక అగ్ర నిర్మాణ సంస్థ దీనిని ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మించనున్నట్లు చెప్తున్నారు. 

అయితే ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ మాత్రం రావాల్సి ఉంది. అయితే మరోవైపు రామ్ చరణ్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram Srinivas) కూడా ఒక మూవీ చేయనున్నారని వార్తలు వచ్చినప్పటికీ తాజాగా అవేవి నిజం కాదని, ప్రస్తుతం వెంకటేష్ తో ఒక మూవీ అనంతరం ఎన్టీఆర్ తో మరొక మూవీని ఆయన చేయనున్నారని నిర్మాత సూర్యదేవర నాగవంశీ త్రివిక్రమ్ లైనప్ గురించి చెప్పారు. 

దానితో చరణ్, త్రివిక్రమ్ మూవీ వార్త ప్రచారం మాత్రమే అని తెలుస్తోంది. మరి చరణ్ తో సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) చేసే మూవీ నిజం అయితే అది సూపర్ క్రేజీ కాంబినేషన్ ని చెప్పకతప్పదు. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ అప్ డేట్స్, గాసిప్స్ కోసం మా తెలుగు మూవీ మీడియా సైట్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow