Chava Box Office Collection: Day-Wise Earnings & Worldwide Report

Chava Box Office Collection Till Now ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి చిత్రాలు వస్తూ ఆడియన్స్ ని అలరిస్తూ బాగానే కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తాజాగా స్టార్ నటుడు విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా మ్యాడాక్ ఫిలిమ్స్

Chava Box Office Collection: Day-Wise Earnings & Worldwide Report

ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి చిత్రాలు వస్తూ ఆడియన్స్ ని అలరిస్తూ బాగానే కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తాజాగా స్టార్ నటుడు విక్కీ కౌశల్ (Vicky Kaushal) హీరోగా రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా మ్యాడాక్ ఫిలిమ్స్ సంస్థ పై గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిన హిస్టారికల్ యాక్షన్ డ్రామా మూవీ ఛావా (Chhaava). 

Chava Box Office Collection – Day-Wise & Worldwide Earnings

ప్రారంభం నాటి నుండి అందరిలో భారీ స్థాయిలో క్రేజ్ కలిగిన ఈ మూవీ వాస్తవానికి గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వలన రెండు నెలలు వాయిదా పడి ఇటీవల ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవము నాటి గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఈ మూవీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందింది. 

దీనిని లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించగా ఏ ఆర్ రహమాన్ సంగీతం సమకూర్చారు. ఇక ఈ మూవీలో శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్ అద్భుతంగా నటించగా ఆయన భార్య యేసు భాయ్ భోంస్లే పాత్రలో తన ఆకట్టుకునే అందం అభినయంతో మెప్పించారు రష్మిక మందన్న. 

Chava First Day Collection & Opening Weekend Report

మొత్తంగా తొలి రోజు తొలి ఆట నుండి హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది ఛావా మూవీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణం తరువాత అనుకోకుండా ఆయన రాజ్యం పైకి ఔరంగజేబు దాడి చేయడానికి వస్తాడు. ఐతే అదే సమయంలో శివాజీ కుమారుడు అయిన శంభాజీ మహారాజ్ అతడిని అడ్డగించి పోరాడతాడు. 

దానికి సంబందించిన కథనాన్ని బేస్ చేసుకుని రూపొందింది ఈ మూవీ. ఇక ఈ మూవీలో ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా నటించగా ఇతర కీలక పాత్రల్లో అశుతోష్ రాణా, ప్రదీప్ రావత్, డయానా పేంటీ, దివ్య దత్త నటించారు. ఆకట్టుకునే కథ కథనాలతో పాటు హీరో హీరోయిన్స్ ఇద్దరి సూపర్ యాక్టింగ్, భారీ గ్రాండియర్ విజువల్స్, యుద్ధ సన్నివేశాలు, యాక్షన్ ఎమోషమల్ అంశాలు ఈ మూవీ సక్సెస్ కి ప్రధాన కారణాలు. 

Chava Total Box Office Collection – India & Overseas Earnings

ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ నుండి ఈ మూవీ పై రోజు రోజుకు క్రేజ్ మరింతగా పెరుగుతోంది. ఫస్ట్ డే రూ. 31 కోట్లు కాగా, సెకండ్ డే రూ. 37 కోట్లు, థర్డ్ డే రూ. 48.5 కోట్లు, ఫోర్త్ డే రూ. 24 కోట్లు, ఫిఫ్థ్ డే రూ. 25.25 కోట్లు, సిక్స్థ్ డే రూ. 32 కోట్లుగా ఉంది. మొత్తంగా ఈ మూవీ ఇప్పటికే రూ. 200 కోట్ల మార్క్ వరకు నెట్ కలెక్షన్ కు చేరుకుంది. 

Chava Movie Hit or Flop? Budget, Verdict & Final Collections

మరోవైపు ప్రస్తుతం బాలీవుడ్ లో రిలీజ్ అయిన లేటెస్ట్ సినిమాలు ఏవి కూడా పెద్దగా దీనికి పోటీగా లేకపోవడం తో పాటు నేడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి అలానే రానున్న రెండు రోజుల అనంతరం వీకెండ్ కావడం మరింత కలిసి వచ్చే అంశం. ఇక ఛావా మూవీ ఇండియా వైడ్ గానే కాదు అటు ఓవర్సీస్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటూ మంచి కలెక్షన్ రాబడుతోంది. 

Chava vs Other Recent Movies – Box Office Performance Comparison

దీనిని బట్టి ఈ మూవీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ క్లోజింగ్ సమయానికి ఈ ఏడాది ఆధ్యాతిక కలెక్షన్ సొంతం చేసుకున్న మూవీగా నిలిచే అవకాశం చాలావరకు కనపడుతోందని అంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టులు. అలానే ఛావా మూవీ తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయాలనీ పలువురు ప్రేక్షకాభిమానులు మూవీని ప్రసంశిస్తూ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కోరుతున్నారు. దీని పై ఛావా టీమ్ నుండి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.   

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow