Samantha Ruth Prabhu's Noble Deeds: Transforming Lives Through Heartfelt Charity

Discover how actress Samantha Ruth Prabhu is making a difference by funding heart surgeries for underprivileged children through her Pratyusha Support foundation

Samantha Ruth Prabhu's Noble Deeds: Transforming Lives Through Heartfelt Charity

టాలీవుడ్ స్టార్ నటి సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంతో జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటూ కెరీర్ పరంగా కొనసాగుతున్నారు. తాజాగా శుభం అనే సినిమా ద్వారా ఆమె నిర్మాతగా కూడా మారారు. నేడు ఈ మూవీ గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రాబోతోంది. ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించిన ఈ మూవీ పై మొదటి నుండి మంచి పాజిటివ్ బజ్ ఉంది. 

సమంత రూత్ ప్రభు దాతృత్వం

కాగా తమ సినిమా మంచి విజయం అందుకుంటుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరోవైపు శుభం (Subham) మూవీ పెయిడ్ ప్రీమియర్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ లభించడంతో సమంత సహా మూవీ యూనిట్ మొత్తం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు త్వరలో తెలుగులో మా ఇంటి బంగారం అనే మూవీలో సమంత రూత్ ప్రభు నటించనున్నారనే న్యూస్ కొన్నాళ్లుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

అయితే దీనికి సంబంధించి ఆమె నుండి కన్ఫర్మేషన్ రావాల్సింది. ఇక ఇటీవల హిందీ సిరీస్ రక్త్ బ్రహ్మాండ్ Rakt Brahmand : The Bloody Kingdom లో నటిస్తున్నారు. ఈ సిరీస్ ని ప్రముఖ ఓటిటి మాధ్యమం త్వరలో ప్రసారం చేయనుండగా బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఈ సిరీస్ పై సమంత సహా టీమ్ మొత్తం ఎంతో నమ్మకంగా ఉన్నారు. 

అలానే వీటితో పాటు త్వరలో ఒక హాలీవుడ్ మూవీలో సమంత నటించనున్నారు. ఆ విధంగా కెరీర్ పరంగా ప్రస్తుతం పలు బిజీ ఆఫర్స్ తో కొనసాగుతున్నారు సమంత. అయితే కొన్నాళ్ల క్రితం మాయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన సమంత, అనంతరం ఫ్యాన్స్ తో పాటు శ్రేయోభిలాషలు, ఫ్యామిలీ యొక్క సపోర్ట్ తో పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. 

హీరోయిన్ సమంత సామజిక సేవ 

ఎప్పటికప్పుడు డాక్టర్స్ నుండి చికిత్స తీసుకోవడంతో పాటు అందరూ కూడా తనకి వెన్నంటే ఉండి ధైర్యం చెప్పారని ఆమె అన్నారు. అయితే నాగచైతన్యతో విడాకుల అనంతరం మానసికంగా తాను ఎంతో కృంగిపోయినట్లు కూడా ఆమె తెలిపారు. ఇక తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఇకపై ఎక్కువగా చెప్పబోనని, ఎక్కువగా సినిమాలు, అలానే కెరీర్ పైనే తాను ధ్యాస పెట్టాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. 

కాగా అసలు విషయం ఏమిటంటే, తొలిసారిగా ఏ మాయ చేసావే సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన సమంత, మొదటి నుండి తనకు లభించిన రెమ్యునరేషన్ లో కొంతమేర ప్రజలకు కొంత సేవ చేయాలనే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. 

అయితే సినిమాలోకి వచ్చి మెల్లగా అవకాశాలు అందుకుని నటిగా తనను తాను నిరూపించుకుని స్టార్ నటిగా ఎదిగిన అనంతరం ప్రత్యూష పేరుతో ఒక ఫౌండేషన్ సంస్థని ఏర్పాటు చేసారు సమంత. దాని ద్వారా పలువురు పేదసాదలకు తనకు వీలైనంతలో సాయం అందించారు. ముఖ్యంగా పలువురు చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలు కూడా ఆమె చేయించి నూతన జీవితాన్ని అందించారు. 

సమంత రూత్ ప్రభు ప్రత్యూష ఫౌండేషన్ తరపున సేవలు

ఆర్ధికంగా వెనుకబడిన బాలికలకు పుస్తకాలు, స్కూల్ ఫీజులు వంటివి తమ సంస్థ ద్వారా అందించి గొప్ప మనసు చాటుకున్నారు సమంత. ఆ విధంగా తమ ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా అటు హార్ట్ ఆపరేషన్స్ తో పాటు పలు సహాయాలతో తన దాతృత్వాన్ని నిరూపించుకున్న సమంత, కోవిడ్ సమయంలో కూడా పలువురికి ఆర్ధికంగా చేయూత అందించారు. 

అలా తనకు వీలైనంతలో ఇప్పటికే కూడా పలు సామజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ అందరికీ ఆదర్శముగా నిలుస్తున్నారు సమంత రూత్ ప్రభు. కాగా నటిగా ఆమె రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు అందుకోవడంతో పాటు ఆమె నటిస్తున్న సినిమాలు అన్ని కూడా విజయాలు సొంతం చేసుకుని బాగా క్రేజ్ తీసుకురావాలని మా Telugu Movie Media మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow