SSMB29 Movie Release Date – Mahesh Babu & Rajamouli's Epic Film Latest Updates

SSMB29 Movie Release Date సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీ గుంటూరు కారం (Guntur Kaaram). ఈ మూవీలో యువ అందాల కథానాయికలు శ్రీలీల (Sreeleela) మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)

SSMB29 Movie Release Date – Mahesh Babu & Rajamouli's Epic Film Latest Updates

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీ గుంటూరు కారం (Guntur Kaaram). ఈ మూవీలో యువ అందాల కథానాయికలు శ్రీలీల (Sreeleela) మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) నటించారు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మించిన ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా కీలక పాత్రల్లో రమ్యకృష్ణ, జయరాం, ప్రకాష్ రాజ్, మురళి శర్మ, సునీల్, జగపతి బాబు తదితరులు నటించారు. 

SSMB29 Movie Release Date – Official Announcement & Updates

మంచి అంచనాలతో రిలీజ్ అయిన గుంటూరు కారం మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం అందుకుంది. దాని అనంతరం తాజాగా దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న మూవీ SSMB29. ఈ మూవీ పై మొదటి నుండి వరల్డ్ వైడ్ ఆడియన్స్ అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. 

ఇటీవల తాను తీసిన ఆర్ఆర్ఆర్ (RRR) మూవీతో అతి భారీ విజయం అందుకున్న రాజమౌళి, ఆ మూవీలోని నాటు నాటు సాంగ్ కి గాను ఏకంగా ఆస్కార్ అవార్డు దక్కించుకున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ తో చేస్తున్న SSMB 29 మూవీ తాజాగా ఫస్ట్ షెడ్యూల్ జరుపుకుంటోంది. ఇక ఈ మూవీలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఒక కీలక పాత్ర చేస్తుండగా మలయాళ స్టార్ నటుడు కం దర్శకుడైన పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) నెగటివ్ పాత్ర చేస్తున్నట్లు టాక్. 

Mahesh Babu & SS Rajamouli’s SSMB29 Movie Story & Genre

అలానే హాలీవుడ్ కి చెందిన పలువురు నటులు ఇతర పాత్రల్లో నటించనున్నారట. ఎం ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీని దాదాపుగా వెయ్యి కోట్లకు పైగా భారీ వ్యయంతో శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా ఒక హోలీవుడ్ నటి మహేష్ కి జోడీగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఒక కీలక షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ కోసం రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ సెట్టింగ్ వేసారట.

 ఇక ఈ మూవీలోని తన పాత్ర కోసం ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు పూర్తిగా హెయిర్ అలానే గడ్డం తో పాటు ఫుల్ గా బాడీ కూడా పెంచుతున్నారు. తన కెరీర్ లో ఇప్పటివరకు మహేష్ పోషించని ఒక పవర్ఫుల్ పాత్రని ఇందులో మహేష్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు వరల్డ్ వైడ్ ఆడియన్స్ అందరిని అలరించి ఆకట్టుకునేలా దర్శకుడు రాజమౌళి దాదాపుగా ఏడాదిన్నరగా ఈ మూవీ ఒక్క స్క్రిప్ట్ పై కసరత్తు చేసి ఫైనల్ గా లాక్ చేశారట. 

When is SSMB29 Movie Releasing? Latest Reports & Speculations

ఈ మూవీకి విజయేంద్ర ప్రసాద్ కథని అందించారు. గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతున్న ఈ మూవీ ఎక్కువగా సౌత్ ఆఫ్రికా లోని అమెజాన్ అడవులతో పాటు కెన్యా, బల్గెరియా, అమెరికా, దుబాయ్, ఇంగ్లాండ్ దేశాల్లో కూడా షూటింగ్ జరుపుకుంటుందట. ఇప్పటివరకు అయితే ఈ మూవీకి నిర్మాతగా కేఎల్ నారాయణ మాత్రమే వ్యవహరిస్తున్నప్పటికీ ఒక ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ కూడా ఇందులో భాగస్వామి కానుందనే వార్తలు కూడా వస్తున్నాయి. 

SSMB29 Movie Budget, Cast & Shooting Details

2025 జనవరి 2న SSMB 29 మూవీ యొక్క అధికారిక పూజా కార్యక్రమాలు జరుగగా కేవలం టీమ్ సభ్యులు మాత్రమే ఇందులో పాల్గొన్నారు. దానికి సంబందించిన ఫోటోలు కానీ వీడియో కానీ బయటకి రిలీజ్ చేయలేదు. ఐతే విషయం ఏమిటంటే, ఒక ప్రత్యేక రోజున ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఫిక్స్ అయ్యారని అంటున్నారు. 2027 ఏప్రిల్ 27 న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుందట. కాగా అదే డేట్ కి గతంలో 2006లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి మూవీ టాలీవుడ్ లో అతిపెద్ద సంచలన విజయం సొంతం చేసుకుని హీరోగా మహేష్ బాబుకి సూపర్ స్టార్ ఇమేజ్ తీసుకువచ్చింది. దానితో ఆ డేట్ ని జక్కన్న అండ్ టీమ్ లాక్ చేశారట.

Mahesh Babu’s Look & First Glimpse – What to Expect?

త్వరలో తమ మూవీ గురించిన అనౌన్స్ మెంట్ గ్లింప్స్ ని రిలీజ్ చేసి ప్రపంచానికి తమ మూవీ గురించి పరిచయం చేయనున్నారట జక్కన్న. ఈ ఈవెంట్ ని గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీని పై అఫీషియల్ గా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. మొత్తంగా అందరిలో ఎన్నో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ భారీ పాన్ వరల్డ్ మూవీ ఎంతమేర ఆడియన్స్ ని అలరించి ఏ స్థాయిలో కలెక్షన్ సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.  

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow