NTR Neel Movie Latest Update: Exciting News for Fans
Get the latest update on NTR and Prashanth Neel's upcoming movie. Stay tuned for exciting news and official announcements!

టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా నటుడిగా గొప్ప క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ నటించారు. ఆ ఇద్దరి పాత్రలకు గ్లోబల్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఎస్ ఎస్ రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు లభించిన విషయం తెలిసిందే.
NTR Neel Movie Latest Update Revealed!
దానితో అటు చరణ్ కి ఇటు ఎన్టీఆర్ కి మార్కెట్, క్రేజ్ రెండూ పెరిగాయి. అయితే ఆ మూవీ అనంతరం కొరటాల శివతో ఎన్టీఆర్ చేసిన పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎమోషనల్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ గా నిర్మించాయి. అయితే రిలీజ్ అనంతరం దేవర మూవీ పెద్ద విజయం సొంతం చేసుకుని హీరోగా ఎన్టీఆర్ క్రేజ్ ని మార్కెట్ ని మరింతగా పెంచేసాయి.
అయితే దాని అనంతరం కొన్నాళ్ల క్రితం నుండి బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీ చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ మూవీని యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా యువ దర్శకుడు అయాన్ ముఖర్జీ దానిని తెరకెక్కిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఆగష్టు 14న గ్రాండ్ గా భారీ స్థాయిలో ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక తాజగా కెజిఎఫ్, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా ఒక మూవీ స్టార్ట్ చేసారు ఎన్టీఆర్. ఈ మూవీపై అందరిలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
NTR and Prashanth Neel’s Film: New Developments
ఎన్టీఆర్ కి సరైన మాస్ డైరెక్టర్ పడితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది గతంలో పలు సినిమాల బ్లాక్ బస్టర్స్ తో ప్రూవ్ అయింది. ఇక ఈ మూవీని కూడా ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గట్లుగా పవర్ఫుల్ గా అదిరిపోయే స్టోరీతో తెరకెక్కిస్తున్నారట దర్శకుడు ప్రశాంత్ నీల్. అతి త్వరలో ఈ మూవీ యొక్క సెకండ్ షెడ్యూల్ గ్రాండ్ గా ప్రారంభం కానుండగా ఎన్టీఆర్ ఈ షెడ్యూల్ షూట్ లో పాల్గొననున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో మలయాళ నటుడు టోవినో థామస్ కీలక పాత్ర చేయనుండగా కన్నడ అందాల భామ రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి భువన గౌడ ఫోటోగ్రఫి సమకూరుస్తున్నారు.
Fans Await NTR Neel Movie's Official Announcement
మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ లెవెల్లో ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ అప్ డేట్ రానున్న శ్రీరామ నవమికి వస్తుందని కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అవుతున్నాయి. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ యొక్క అఫీషియల్ అప్ డేట్ ఇప్పట్లో లేదని, ప్రస్తుతం షూటింగ్ వేగంగా పూర్తి చేసేందుకు టీమ్ కసరత్తు చేస్తోందని టాక్.
అయితే జూనియర్ ఎన్టీఆర్ బర్త్ రోజున మాత్రం ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉందట. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్ర పవర్ఫుల్ గా ఉండడంతో పాటు మాస్ యాక్షన్ సీన్స్ అండ్ ఎలివేషన్స్ వేరొక రేంజ్ లో ఉండనున్నాయట. కాగా ఎన్టీఆర్ నీల్ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2026 సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ అయితే సన్నాహాలు చేస్తున్నారు. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
What's Your Reaction?






