Mollywood Star Actor Joins Prabhas in Spirit Movie – Big Update Out!
A top Mollywood star is set to appear in Prabhas upcoming film Spirit, directed by Sandeep Reddy Vanga. Check full update here.

టాలీవుడ్ స్టార్ యాక్టర్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం మారుతీ తెరకెక్కిస్తున్న హర్రర్ కామెడీ యాక్షన్ డ్రామా మూవీ ది రాజా సాబ్. ఈ మూవీ పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇందులో యువ అందాల కథానాయికలు మాళవిక మోహనన్, రద్దీ కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా రాక్ స్టార్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
ప్రభాస్ స్పిరిట్ లో మలయాళ స్టార్ యాక్టర్
ఇక ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నెగటివ్ రోల్ చేస్తున్నట్లు టాక్. ముఖ్యంగా ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుగుతోంది. త్వరలో ఈమూవీని ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు. అయితే దీనితో పాటు యువ నటి ఇమాన్వితో కలిసి సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి తీస్తున్న మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నారు ప్రభాస్.
ఈ యాక్షన్ లవ్ డ్రామా మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ రెండిటి అనంతరం ఈ ఏడాది చివర్లో ఆనిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తీయనున్న స్పిరిట్ మూవీ షూట్ లో జాయిన్ అవ్వనున్నారు ప్రభాస్.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మాలీవుడ్ నటుడి పాత్ర
ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించేందుకు ప్రస్తుతం స్పిరిట్ టీమ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని వేగంగా చేస్తోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతమే అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీని టి సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు భారీ వ్యయంతో నిర్మించనున్నాయి.
ఇప్పటికే స్పిర్తి మూవీ యొక్క పూర్తి స్క్రిప్ట్ అలానే డైలాగ్స్ వర్షన్ కూడా పూర్తి చేసిన సందీప్ రెడ్డి వంగా ఇతర పనుల నిమిత్తం తన టీమ్ తో కలిసి ముఖ్యంగా మూవీ యొక్క లొకేషన్స్ వేటలో ఉన్నారు. ఇందులో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ అధికారిగా కనిపించనుండగా ఒక బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది.
త్వరలో ఇందులో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనే దాని పై టీమ్ నుండి క్లారిటీ రానుంది. విషయం ఏమిటంటే, ఇటీవల మలయాళ చిత్ర పరిశ్రమలో యాక్షన్ డ్రామా మూవీ మార్కో ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్నారు నటుడు ఉన్ని ముకుందన్.
ఇక తెలుగులో కూడా మార్కో బాగానే కలెక్షన్ రాబట్టింది. దానితో అందరి దృష్టి ఉన్ని ముకుందన్ పై పడింది. ఇటీవల అనుష్క తో కలిసి భాగమతి మూవీలో కూడా ఆయన ఒక కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. కాగా స్పిరిట్ మూవీలోని ఒక ముఖ్య పాత్ర కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా ఉన్ని ముకుందన్ ని ప్రత్యేకంగా కలిసారుట.
ఈ సినిమాతో మాలీవుడ్ హీరోకు కలిసొచ్చే అవకాశాలు
కాగా ఇందులో ఆయనది నెగటివ్ పాత్ర అని అంటున్నారు. త్వరలో దీనికి సంబంధించి పూర్తిగా క్లారిటీ రానుందని, కథ, పాత్ర తనకు నచ్చితే చేసేందుకు ఉన్ని ముకుందన్ కూడా ఆసక్తి చూపుతున్నారని టాక్. మొత్తంగా టాక్ ఆఫ్ ది ఇండియా గా మారిన స్పిరిటి మూవీ పక్కాగా ఎప్పుడు పట్టాలెక్కుతోంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే వాటి పై పూర్తి క్లారిటీ రావాలి అంటే మరికొన్ని నెలల వరకు ఆగాల్సిందే.
What's Your Reaction?






