Deepika Padukone Confirmed as Heroine in Prabhas’ Spirit Movie – Fans Excited ?
Deepika Padukone is all set to play the lead opposite Prabhas in the upcoming movie 'Spirit', directed by Sandeep Reddy Vanga. Check full details and updates.

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న మూవీ ఒకటి కాగా. మరొకటి మారుతి తెరకెక్కిస్తున్న ది రాజా సాబ్ మూవీ. ఈ రెండు మూవీస్ పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు నెలకొని ఉన్నాయి.
ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాలో కథానాయికగా దీపికా పదుకొణే
అయితే వీటిలో ది రాజా సాబ్ మూవీ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకుంది. ఈ ఏడాది ఈమూవీ ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ హర్రర్ కామెడీ యాక్షన్ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నెగటివ్ పాత్ర చేస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తున్న ది రాజా సాబ్ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న మూవీలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రలో అనుపమ్ ఖేర్ కనిపించనున్నారు. ఈ లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో భారీ కాంబినేషన్
వచ్చే ఏడాది ఈ మూవీ ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక ఈ రెండు సినిమాల అనంతరం త్వరలో సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ చేయనున్నారు ప్రభాస్. చాలా రోజుల క్రితం అనౌన్స్ అయిన ఈమూవీలో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ అధికారిగా కనిపించనుండగా దీనిని గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో భద్రకాళి పిక్చర్స్, టి సిరీస్ సంస్థలు భారీ వ్యయంతో నిర్మించనున్నాయి.
ఇప్పటికే మూవీ యొక్క స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసిన సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం లోకేషన్స్ తో పాటు కీలక పాత్రధారుల యొక్క ఎంపిక పనుల్లో నిమగ్నం అయి ఉన్నారు. ఇక ఈ మూవీ యొక్క ఫస్ట్ షెడ్యూల్ ని మెక్సికోలో ప్లాన్ చేస్తోంది టీమ్. కాగా లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీలో బాలీవుడ్ అందాల కథానాయిక దీపికా పదుకొనె ఇందులో హీరోయిన్ గా ఎంపికైనట్లు చెప్తున్నారు.
తాజాగా ఆమెకు స్పిరిట్ మూవీ యొక్క స్టోరీ వినిపించి ఆమె నుండి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారట దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అయితే ఆనిమల్ మాదిరిగా ఇందులో యాక్షన్ ఎమోషనల్ అంశాలు కూడా ఉంటాయట. ముఖ్యంగా ఈ మూవీలో తన పాత్ర పై గట్టిగా దృష్టి పెట్టిన హీరో ప్రభాస్ ప్రస్తుతం ఆ పాత్ర కోసం యూరోప్ లో కొంత మేకోవర్ పరంగా సిద్దమవుతున్నట్లు టాక్.
త్వరలో ఆయన ఇండియాకి తిరిగి వచ్చిన తరువాత ఒక నెల అనంతరం స్పిరిట్ మూవీ పట్టాలెక్కనుందట. ఇక ఇందులో హీరోతో పాటు హీరోయిన్ పాత్ర కూడా ఎంతో చక్కగా డిజైన్ చేశారట దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.
ఫ్యాన్స్ స్పందన, రిలీజ్ డేట్ అప్డేట్స్
ఇటీవల బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ తో ఆయన తీసిన ఆనిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సొంతం చేసుకుని ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 930 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీలో అంజలి పాత్ర చేసిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన పాత్రలో అద్భుతంగా నటించి హీరోతో పాటు మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఆ విధంగా స్పిరిట్ లో కూడా హీరోయిన్ దీపికా రోల్ ఉండనుందని అంటున్నారు.
అయితే పక్కాగా ఈ మూవీలో ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసారా లేదా అనేది మాత్రం తెలియాలి అంటే దీని పై స్పిరిట్ మూవీ టీమ్ నుండి అఫీషియల్ గా ప్రకటన రావాలి. కాగా అన్ని కార్యక్రమాలు ముగించి స్పిరిట్ మూవీని 2026 చివర్లో ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేలా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అండ్ టీమ్ ప్లాన్ చేస్తోందట.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇటీవల ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ ఎంటర్టైనర్ మూవీ కల్కి 2898 ఏడి లో దీపికా పదుకొనె ప్రధాన పాత్ర చేసిన విషయం తెలిసిందే. పార్ట్ 2 లో ఆమె పాత్ర మరింతగా ఉంటుందట. మరి ఇప్పుడు స్పిరిట్ మూవీలో ప్రభాస్ కి జోడీగా దీపికా ఎంపిక అయింది నిజమే అయితే రెండవసారి ఆమె ప్రభాస్ తో జోడీ కడుతున్నట్లే. మరి ఈ సారి వీరిద్దరి కాంబో ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
What's Your Reaction?






