Game Changer Songs Release Date, Audio Launch Event Details

Find out the release date of Game Changer movie songs starring Ram Charan along with details of the grand audio launch event

Game Changer Songs Release Date, Audio Launch Event Details

మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా ఇటీవల శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer). ఈ మూవీలో బాలీవుడ్ అందాల నటి కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటించగా ఇతర ముఖ్య పాత్రల్లో సముద్రఖని, శ్రీకాంత్, రాజీవ్ కనకాల, అంజలి, ఎస్ జె సూర్య నటించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మొయివే ఇటీవల 2025 సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి వచ్చి ఆశించిన మేర ఆకట్టుకోలేకపోయింది. 

గేమ్ ఛేంజర్ పాటలు విడుదల వివరాలు

ముఖ్యంగా రామ్ చరణ్ పోషించిన రెండు పాత్రలకు, ఆయన పోషించిన నటనకు అందరి నుండి మంచి మార్కులు పడ్డప్పటికీ కూడా కథ,కథనాలు పూర్తిగా మూస పద్ధతిన సాగడం, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి పెద్దగా ఆకట్టుకోకపోవడంతో పలువురు ఫ్యాన్స్ ఆడియన్స్ మూవీ పై పెదవి విరిచారు. 

శంకర్ నుండి తాము ఎంతో ఆశించమని, అలానే దీనికి కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) కథని అందించడంతో మూవీ తప్పకుండా ఆకట్టుకునేలా ఉంటుందని భావించామని, కానీ అలా లేకపోవడం నిరాశ పరిచిందని పలువురు ఫ్యాన్స్, ఆడియన్సు నిరాసక్తత వ్యక్తం చేసారు. ఇక ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందించారు. 


ఆర్ఆర్ఆర్ (RRR) తరువాత ఆచార్య (Acharya) మూవీ చేసారు చరణ్, దానికి మణిశర్మ (Mani Sharma) సంగీతం అందించారు. మొత్తంగా ఎన్నో క్రితం చేసిన బ్రూస్ లీ అనంతరం థమన్ (S Thaman) తో చరణ్ చేస్తున్న మూవీ కావడంతో మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ మూవీ యొక్క సాంగ్స్ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. 

ఆడియో లాంచ్ ఈవెంట్ హైలైట్‌లు

ఇక ఫస్ట్ సాంగ్ గా ఇందులోని జరగండి (Jaragandi) సాంగ్ రిలీజ్ అయింది. కాగా ఈ సాంగ్ ని అఫీషియల్ కంటే ముందే కొందరు సోషల్ మీడియాలో లీక్ చేసారు. అనంతరం కొన్నాళ్ళకి టీమ్ అధికారికంగా ఈ సాంగ్ ని రిలీజ్ చేసింది. ఆడియో పరంగా ఆకట్టుకున్న ఈ సాంగ్ బాగానే యూట్యూబ్ లో రెస్పాన్స్ సొంతం చేసుకుంది. 

ఆ తరువాత రా మచ్చా (Ra Macha) అనే పల్లవితో సాగె సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేయగా ఇది కూడా బాగానే సక్సెస్ అయింది. ఆ తరువాత దోప్ సాంగ్ ని అనంతరం చివరిగా నా నా హైరానా సాంగ్ ని రిలీజ్ చేసారు. వాస్తవానికి ఆడియో పరంగా గేమ్ ఛేంజర్ సాంగ్స్ అన్ని కూడా అందరినీ ఆకట్టుకుని మూవీ పై బాగానే అంచనాలు ఏర్పరిచాయి. 

ఇక థియేటర్స్ లో మూవీ రిలీజ్ అనంతరం ఇవి ఆశించిన స్థాయి రెస్పాన్స్ అందుకోలేకపోయాయి. మాస్టర్ స్టైల్ మేకింగ్ టాలెంట్ కలిగిన శంకర్ (Shankar Shanmugam) మూవీస్ లో సాంగ్స్ ఎంతో అద్భుతంగా ఉంటాయనేది తెలిసిందే. అదే విధంగా గేమ్ ఛేంజర్ సాంగ్స్ కి కూడా భారీ స్థాయిలో ఖర్చు చేసారు మేకర్స్. జరగండి సాంగ్ తో పాటు నానా హైరానా (Naa Naa Hyraanaa) సాంగ్స్ కి మరింత భారీ స్థాయిలో ఖర్చు చేసారని తెలుస్తోంది. 

సంగీత దర్శకుడి వ్యాఖ్యలు

అయితే అవి రెండూ అంతగా స్పందన అందుకోలేదు. ఆ విధంగా గేమ్ ఛేంజర్ మూవీ సక్సెస్ సాంగ్స్ పై ఒకింత నెగటివ్ ప్రభావమే చూపింది. అనంతరం మూవీలో కొండదేవర (Konda Devara), అరుగుమీద (Arugu Meedha) సాంగ్స్ కూడా బాగానే రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక కీలక సీన్స్ లో థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదని చెప్పాలి. 

ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడమే ఈ మూవీ యొక్క సాంగ్స్ కి కూడా కొంత మైనస్ అయిందనేది సినీ విశ్లేషకులు చెప్తున్న మాట. ఇక ఆ తరువాత ఓటిటిలోకి వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీ ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా కూడా ప్రదర్శితం అయింది.

కాగా ప్రస్తుతం ఈ మూవీ యొక్క సాంగ్స్ కి యూట్యూబ్ (Youtube) లో ఇతర భాషల ఆడియన్స్ నుండి కూడా బాగానే రెస్పాన్స్ అందుకుంటుండడం విశేషం. కాగా ఇటువంటి తెలుగు మూవీస్ సాంగ్స్, తెలుగు మూవీ న్యూస్, తెలుగు మూవీ అప్ డేట్స్ కోసం మా Telugu Movie Media సైట్ ని చూస్తూ ఉండండి. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow