Vijay Deverakonda Takes a Holy Dip at Maha Kumbh Mela – Spiritual Journey & Significance

Vijay Deverakonda Holy Dip at Maha Kumbh Mela యువ నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల ది ఫామిలీ మ్యాన్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ మూవీని పరశురామ్ పెట్ల తెరకెక్కించారు

Vijay Deverakonda Takes a Holy Dip at Maha Kumbh Mela – Spiritual Journey & Significance

యువ నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల ది ఫామిలీ మ్యాన్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ మూవీని పరశురామ్ పెట్ల తెరకెక్కించారు. అయితే మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయింది. 

Vijay Deverakonda’s Spiritual Experience at Maha Kumbh Mela

ఇక తాజాగా యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో విజయ్ దేవరకొండ చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కింగ్‌డ‌మ్. తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచాయి. 

Why Did Vijay Deverakonda Take a Holy Dip at Maha Kumbh Mela?

సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం అవుతున్న ఈ మూవీని మే 30న పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. 

ఇక తరచు తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ఫ్యాన్స్, ఆడియన్స్ తో టచ్ లో ఉండే విజయ్ దేవరకొండ తన కెరీర్, వ్యక్తిగత విషయాలకు సంబందించిన న్యూస్ పంచుకుంటూ ఉంటారు. విషయం ఏమిటంటే ప్రస్తుతం జరుగుతున్న మహా కుంభ మేళాలో భాగంగా కుటుంబంతో కలిసి ప్రయాగ్ రాజ్ కు వెళ్లారు. 

Maha Kumbh Mela 2025 – Importance & Celebrity Participation

అనంతరం అక్కడి త్రివేణి సంగమంలో తల్లితో కలిసి పవిత్ర స్నానం ఆచరించారు. ఇప్పటివరకు కింగ్‌డ‌మ్ మూవీ కోసం దాచి ఉంచిన లుక్ ని విజయ్ ఈ పుణ్య స్నానం సందర్భంగా రివీల్ చేసి ఫోటోలని పోస్ట్ చేసారు. 

వాస్తవానికి అంతకముందు రోజు విజయ్ ఫ్యామిలీ ప్రయాగ్ రాజ్ కు వెళ్ళడానికి ఎయిర్ పోర్ట్ కి వెళ్లగా అక్కడ సాంకేతిక సమస్యల వలన వారి ప్రయాణం 5 గంటల పాటు ఆలస్యం అయింది.

Vijay Deverakonda’s Thoughts on Spirituality & Tradition 

మొత్తంగా ఈ మహాకుంభమేళా లో పాల్గొని పుణ్యనదుల్లో స్నానమాచరించడం ఎంతో ఆనందంగా ఉందని, అది కూడా కుటుంబంతో కలిసి వెళ్లి చేసిన ఈ పవిత్ర స్నానంతో మనసుకి కూడా ఎంతో ఆనందాన్ని అందించిందని అన్నారు విజయ్ దేవరకొండ. 

కాగా గతంలో లైగర్, ఇటీవల ది ఫ్యామిలీ మ్యాన్ మూవీస్ రెండూ కూడా ఫ్లాప్ కావడంతో తప్పకుండా ప్రస్తుతం తెరకెక్కుతున్న కింగ్‌డ‌మ్ మూవీతో తమ రౌడీ హీరో పెద్ద హిట్ కొట్టి బ్రేక్ సొంతం చేసుకోవడం ఖాయం అని విజయ్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

Other Celebrities Who Visited Maha Kumbh Mela 2025

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow