The Raja Saab Release Date, Trailer, and First Single Details
Get the latest updates on Prabhas’ The Raja Saab including official release date, teaser, trailer launch, and first single release details.

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఈ పేరు ప్రస్తుతం ఇండియన్ ఆడియన్స్ కి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాల్లో అమరేంద్ర బాహుబలి (Baahubali), మహేంద్ర బాహుబలి గా అయన ఆకట్టుకునే నటనతో ఎందరో ఫ్యాన్స్ ని సంపాదించారు.
అక్కడి నుండి హీరోగా దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్, మార్కెట్, పాపులారిటీతో కొనసాగుతున్నారు ప్రభాస్. ఇక ఆయన హీరోగా నటించి చివరిగా ఆడియన్సు ముందుకి వచ్చిన మూవీ కల్కి 2898 ఎడి. ఈ మూవీలో ప్రభాస్ తో పాటు బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), దీపికా పాడుకొనే, కోలీవుడ్ స్టార్ నటుడు కమల్ హాసన్ నటించారు.
ప్రభాస్ ది రాజాసాబ్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది
అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీని యువ దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కించగా టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ అయిన వైజయంతీ మూవీస్ వారు గ్రాండ్ గా దీనిని ఎంతో భారీ వ్యయంతో నిర్మించారు. ఎన్నో అంచనాల నడుమ 27 జూన్ 2024న రిలీజ్ అయిన కల్కి 2898 ఎడి మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించి మొత్తంగా క్లోజింగ్ లో వరల్డ్ వైడ్ రూ. 1100 కోట్ల కలెక్షన్ ని రాబట్టింది.
అయితే దీని తరువాత ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు రెండు. అందులో ఒకటి మారుతీ తెరకెక్కిస్తున్న ది రాజసాబ్ కాగా మరొకటి సీతారామం మూవీ ఫేమ్ హను రాఘవపూడి తీస్తున్న ఫౌజీ. ఈ రెండు సినిమాల యొక్క షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. అయితే వీటి అనంతరం త్వరలో ఆనిమల్ మూవీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ చేయనున్న మూవీ స్పిరిట్. ఈ మూవీని ప్రముఖ దిగ్గజ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి సిరీస్ తో కలిసి తన భద్రకాళి పిక్చర్స్ పై సందీప్ రెడ్డి వంగా గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.
బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రి హీరోయిన్ గా నటించనున్న ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా వేగంగా జరుపుకుంటున్న స్పిరిట్ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇందులో ప్రభాస్ ఒక పవర్ఫుల్, సిన్సియర్ పోలీస్ అధికారిగా కనిపించనుండగా ప్రముఖ సౌత్ కొరియన్ యాక్టర్ Ma Dong-seok విలన్ గా నటించనున్నారు అనేది కొన్నాళ్లుగా మీడియా మాధ్యమాల్లో ప్రసారం అవుతున్న వార్త.
ఇక ఈ సినిమాల తరువాత నాగ అశ్విన్ తో Kalki 2898 AD పార్ట్ 2 తో పాటు ప్రశాంత్ నీల్ తో salaar 2, Hanu Man దర్శకుడు ప్రశాంత్ వర్మతో ఒక భారీ మూవీ చేయనున్నారు ప్రభాస్. మొత్తంగా పరిశీలిస్తే టాలీవుడ్ ప్రస్తుతం తన కెరీర్ లైనప్ లో అత్యధిక సినిమాలు కలిగిన హీరో ప్రభాస్ అనే చెప్పాలి. కాగా అసలు విషయం ఏమిటంటే, ప్రస్తుతం ప్రభాస్ చేస్తోన్న సినిమాల్లో ఒకటైన మూవీ ది రాజాసాబ్ వాస్తవానికి రానున్న డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సి ఉంది.
ట్రైలర్ ఎప్పుడు వస్తుందో తెలుసా?
అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం దీనిని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేసే ప్లాన్ ఉందని నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్ నేడు తెలిపారు. ఇక ఈ మూవీలో ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని మాస్ కమర్షియల్ అంశాలు జోడించి గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతీ.
The Rajasaab మూవీలో ప్రభాస్ కి జోడీగా Nidhhi Agerwal, Malavika Mohanan, Riddhi Kumar నటిస్తుండగా కీలమైన పాత్రలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ కనిపించనున్నారు. మొదటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన The Rajasaab మూవీ తప్పకుండా ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఆకట్టుకోవడం ఖాయం అని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
Prabhas The Raja Saab Trailer
ఇప్పటికే The Rajasaab నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ తో పాటు ఇటీవల రిలీజ్ అయిన మరొక టీజర్ అందరినీ విశేషంగా ఆకట్టుకుని అంచనాలు మరింతగా పెంచేసాయి. ఈ మూవీకి రాక్ స్టార్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఆశించే సాంగ్స్ తో పాటు ఇందులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోనుందని తెలుస్తోంది.
ఇక తాజాగా నిర్మాత విశ్వప్రసాద్ చెప్పిన వివరాల ప్రకారం The Rajasaab మూవీ యొక్క ఫస్ట్ ట్రైలర్ ని త్వరలో రిలీజ్ కానున్న పాన్ ఇండియన్ కన్నడ మూవీ Kantara: Chapter 1 రిలీజ్ అయ్యే థియేటర్స్ లో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నట్లు తెలిపారు. తప్పకుండా ట్రైలర్ రిలీజ్ అనంతరం మూవీ పై అంచనాలు విపరీతంగా పెరుగుతాయని హీరో, దర్శకుడితో పాటు టీమ్ మొత్తం ఎంతో కష్టపడి మూవీ కోసం వర్క్ చేస్తున్నారని విశ్వప్రసాద్ అన్నారు.
ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అప్‌డేట్
అలానే రానున్న అక్టోబర్ 23న ప్రభాస్ జన్మదినం సందర్భంగా మూవీ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి కూడా తాము ప్లాన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మొత్తంగా నిర్మాత ఇచ్చిన ఈ అప్ డేట్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలో ది రాజా సాబ్ మూవీ యొక్క అఫీషియల్ రిలీజ్ డేట్ కూడా రానుంది. దర్శకుడు మారుతీ ప్రత్యేకంగా శ్రద్ధ కనబరిచి ప్రతి సీన్ జాగ్రత్తగా తీస్తున్న ఈ మూవీ విజయం పై పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఎంతో నమ్మకంగా ఉన్నారు.
కాగా రానున్న 2026 సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి తీస్తున్న Mana Shankara Vara Prasad Garu అలానే రవితేజ హీరోగా కిషోర్ తిరుమల తీస్తున్న మూవీస్ తో పాటు మరికొన్ని చిన్న సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. మొత్తంగా రానున్న సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలువనున్న వీటిలో ఏది ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.
What's Your Reaction?






