Big Rumor on Tollywood Heroine Takes the Industry by Storm!
A shocking rumor about a Tollywood heroine is going viral. What's the truth behind it? Check out the full details here!

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం యువ హీరోయిన్స్ కొందరు మంచి క్రేజ్ తో తమ టాలెంట్ తో ఆడియన్స్ మనసు చూరగొంటూ దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా మరికొందరు అయితే ఫస్ట్ మూవీతోనే తమ ఆ ఆకట్టుకునే అందం యాక్టింగ్ తో అందరినీ అలరించి మరిన్ని అవకాశాలు అందుకుంటున్నారు.
Big Rumor on Tollywood Heroine
ఆ విధంగా టాలీవుడ్ కి ఫస్ట్ మూవీ ఏ మాయ చేసావే మొదలుకుని తాజాగా రిలీజ్ అయిన సిటాడెల్ హనీ బన్నీ వరకు నటిగా తన రేంజ్ ని తన మార్కెట్ ని అలానే ఫ్యాన్స్ ఆడియన్స్ యొక్క క్రేజ్ ని అమాంతం పెంచుకుంటూ కొనసాగుతున్నారు సమంత రూత్ ప్రభు. ముఖ్యంగా మలయాళ భామ అయిన సమంత తొలిసారిగా అక్కడి స్థానికి కేబుల్ ఛానల్ లో వచ్చే చిన్న యాడ్స్ లో నటించి అక్కడి ఆడియన్స్ ని అలరించారు.
అదే సమయంలో ఆమె యాడ్స్ చూసిన ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, తాను అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోగా రూపొందనున్న ఏ మాయ చేసావే సినిమా కోసం ఎంపిక చేసారు. ఇందిరా ప్రొడక్షన్స్ సంస్థ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని నిర్మించారు.
ఆస్కార్ సంగీత దర్శకుడు ఏ ఆర్ రహమాన్ స్వరాలు సమకూర్చిన ఈ మూవీ అప్పట్లో అతి పెద్ద విజయం అందుకుంది. నాగచైతన్య తో పాటు జెస్సి పాత్రలో నటించిన సమంత పాత్ర యువతని విశేషంగా ఆకట్టుకుంది. రొమాంటిక్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఏ మూవీలో యువ నటుడు సుధీర్ బాబు తొలిసారిగా చిత్ర సీమకు ఎంట్రీ ఇచ్చారు.
Sensational Buzz in the Film Industry!
ఈ మూవీలో సమంత సోదరుడిగా ఆయన కనిపించారు. అయితే ఈ సినిమా విజయంతో అమాంతం మంచి క్రేజ్ అందుకున్న సమంత, అక్కడి నుండి ఏకంగా టాలీవడ్ బడా స్టార్స్ సరసన అవకాశం అందుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో ఆమె చేసిన బృందావనం, సూపర్ స్టార్ మహేష్ తో చేసిన దూకుడు, నాని హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి తీసిన ఈగ సినిమాల్లో నటించి వాటి ద్వారా భారీ విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు సమంత.
అనంతరం అటు తమిళ్ లో కూడా సమంతకు అవకాశాలు క్యూ కట్టాయి. సూర్య తో ఆమె సికిందర్, విజయ్ తో కత్తి వంటి సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించారు. ఇక తెలుగులో అక్కడి నుండి దాదాపుగా అందరు స్టార్స్ తో నటించి మంచి విజయాలు అందుకున్నారు సమంత. కాగా అప్పట్లో వరుసగా విజయాలు సొంతం చేసుకుంటూ దూసుకెళ్లిన సమంత ని టాలీవుడ్ గోల్డెన్ లెగ్ హీరోయిన్ అనేవారు.
Is This News True or Just Gossip?
ఆ తరువాత కొన్నాళ్ళకు తన తొలి చిత్ర హీరో అక్కినేని నాగచైతన్యని ప్రేమించి వివాహం చేసుకున్న సమంత, కొన్నేళ్ల కాపురం అనంతరం పలు కారణాల రీత్యా ఇటీవల ఆయన నుండి విడిపోయి తన ఫ్యామిలీతో కలిసి విడిగా జీవిస్తున్నారు. అనంతరం ఆమెకు మాయోసైటిస్ వ్యాధి సోకడంతో డాక్టర్స్ నుండి మెరుగైన ట్రీట్మెంట్ తీసుకున్న సమంత, కొన్నాళ్ళకు పూర్తిగా కోలుకున్నారు.
అయితే తెలుగులో ఆమె ప్రధాన పాత్రలు చేసిన బేబీ, గుణశేఖర్ తీసిన భారీ మైథలాజికల్ ఎంటర్టైనర్ శాకుంతలం, అలానే పాన్ ఇండియన్ మూవీ యశోద ఆమెకు మరింత మంచి పేరు తీసుకువచ్చాయి. అటు ఆమెఅజ్ఞ్ ప్రైమ్ తీసిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ 2వ సీజన్ లో రాజీ పాత్రలో సమంత పెర్ఫార్మన్స్ ప్రతి ఒక్కరినీ ఎంతో ఆకట్టుకుంది.
ఇక ఇటీవల వరుణ్ ధావన్ తో కలిసి అమెజాన్ ప్రైమ్ వారి సిటాడెల్ లో నటించి ఆకట్టుకున్నారు సమంత రూత్ ప్రభు. అయితే విషయం ఏమిటంటే, లేటెస్ట్ టాలీవుడ్ రూమర్ ప్రకారం త్వరలో మళ్ళి టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యారట సమంత. అది కూడా సుకుమార్ తో త్వరలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కించనున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ RC 17 తో అట.
Fans Eagerly Waiting for Clarification!
ఈ మూవీ యొక్క స్టోరీ ఎంతో విభిన్నంగా ఉంటుందని, అలానే ఇందులో హీరోయిన్ పాత్రకు కూడా ఎంతో మంచి ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. కాగా హీరోయిన్ పాత్రకు మొదట రష్మిక మందన్న పేరు వినబడినప్పటికీ లేటెస్ట్ బజ్ ప్రకారం అయితే సమంతని తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం RC 17 మూవీ యొక్క పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు సుకుమార్.
మరోవైపు బుచ్చిబాబు సనతో చరణ్ ఒక మూవీ చేస్తున్నారు. ఇది పూర్తి అయినా వెంటనే సుకుమార్ మూవీలో జాయిన్ అవుతారట. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చనున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. కాగా త్వరలోనే ఈ మూవీ గురించిన మరిన్ని పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.
What's Your Reaction?






