Shocking Truths About Prabhas That Fans Never Expected

These shocking and lesser-known truths about Prabhas will leave you stunned. From secret habits to unique career decisions – check it all here

Shocking Truths About Prabhas That Fans Never Expected

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ గా మూడు సినిమాలు చేస్తున్నారు. అందులో ముందుగా మారుతి తెరకెక్కిస్తున్న ది రాజా సాబ్ మూవీ డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీని నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ దానిని గ్రాండ్ గా నిర్మిస్తోంది. 

అయితే ఈ మూవీతో పాటు మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఇమాన్వి హీరోయిన్ గా మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ గా నిర్మిస్తున్న లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ కూడా చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది మధ్యలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు త్వరలో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేయనున్నారు. 

Lesser-known facts about Prabhas

ఈ మూవీలో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ అధికారి పాత్ర చేస్తుండగా అయనకు జోడీగా ఆనిమల్ మూవీ ఫేమ్ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా కనిపించనుంది. టి సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ఈ మూవీని గ్రాండ్ గా నిర్మించనున్నాయి. ఈ మూవీస్ మూడింటి పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ అందరిలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. 

ఫ్యాన్స్ కి తెలియని నిజాల వెల్లడి

అయితే తన కెరీర్ ని తొలిసారిగా ఈశ్వర్ సినిమా ద్వారా ప్రారంభించిన ప్రభాస్ ఆ మూవీతో మంచి విజయం అందుకున్నారు. అంతరం కెరీర్ మూడవ మూవీ వర్షంతో పెద్ద విజయం తన ఖాతాలో వేసుకున్నారు. ఇక అక్కడి నుండి మరింతగా సినిమాలు చేస్తూ వెళ్లిన ప్రభాస్ ఆపైన ఛత్రపతి, మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ వంటి సక్సెస్ఫుల్ సినిమాలతో నటుడిగా ఎందరో ఫ్యాన్స్, ఆడియన్స్ యొక్క మనసులు గెలుచుకుని దూసుకెళ్లారు. 

అయితే ఆ తరువాత జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళితో ప్రభాస్ తొలిసారిగా చేసిన మూవీ బాహుబలి. భారతదేశంలో తొలిసారిగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియన్ మూవీలో ప్రభాస్ రెండు పాత్రల్లో నటించారు. ఆయన అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా నటించిన ఈ మూవీలో అవంతిక గా తమన్నా భాటియా, దేవసేన గా అనుష్క శెట్టి నటించారు. 

అప్పట్లో అతి పెద్ద విజయం అందుకున్న ఈమూవీకి సీక్వెల్ గా రూపొందిన బాహుబలి 2 అంతము మించి అతి పెద్ద సంచలన విజయం సొంతం చేసుకుని దేశవిదేశాల్లో కూడా భారీ బాక్సాఫీస్ ప్రభంజనం సృష్టించింది. ఇక దీని అనంతరం సాహు తో మరొక విజయం తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్, ఆ తరువాత రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు చేసారు, అయితే అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. 

ఇక ఇటీవల ప్రశాంత్ నీల్ తీసిన సలార్ మూవీ ద్వారా మరొక పెద్ద విజయం తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్, ఆపైన నాగ అశ్విన్ తీసిన కల్కి 2898 ఏడి మూవీ ద్వారా కూడా విజయం అందుకున్నారు. ఈ రెండు సినిమాలు ఒకదాని తరువాత మరొకటి రిలీజ్ అయి అటు ఫ్యాన్స్ ని ఇటు ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్ అందుకున్నాయి. 

అయితే ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న మూడు సినిమాలతో పాటు సలార్ 2, కల్కి 2 కూడా త్వరలో పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్నాయి. త్వరలో ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కి సంబంధించి పూర్తి అఫీషియల్ లాంచింగ్ డీటెయిల్స్ వెల్లడి కానున్నాయి. ఆ విధంగా తన పెదనాన్న కృష్ణంరాజు యొక్క ఆశీస్సులతో ఆయన నటవారసుడిగా దూసుకెళ్తున్న ప్రభాస్ భారతదేశ టాప్ హీరోల్లో ఒకరుగా అత్యధిక రెమ్యునరేషన్ తో పాటు ఎంతో క్రేజ్ తో దూసుకెళ్తున్నారు. అయితే ప్రభాస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. 

Prabhas personal life revelations


1. నటుడిగా తన కెరీర్ ఆరంభానికి ముందుగా అందరు నటుల మాదిరిగా ప్రముఖ నటనా శిక్షకుడు సత్యానంద్ వద్ద నటన, డ్యాన్స్, ఫైట్స్ సహా ఇతర విద్యల్లో శిక్షణ తీసుకున్నారు. మొదటి నుండి దేనినైనా ఒకసారి చూస్తే ఇట్టే గ్రహించగల ప్రభాస్, నటన విషయంలో కూడా పెదనాన్న కృష్ణంరాజు మాదిరిగా ఫస్ట్ మూవీ నుండి అందరినీ ఆకట్టుకుంటూ దూసుకెళ్లారు. ఆయన ఫస్ట్ మూవీ ఈశ్వర్ అప్పట్లో బాగానే విజయం అందుకుంది. 


2. 23 అక్టోబర్ 1979లో సూర్యనారాయణ రాజు, శివకుమారి దంపతులకి జన్మించిన ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. ఆయన తండ్రి, పెదనాన్న సహా అందరూ కూడా మొగల్తూరు రాజులు కావడం అలానే వారికి ఆ చుట్టుప్రక్కల గ్రామంలో మంచి పేరు ఉందనేది అందరికీ తెలిసిందే. 


3. మొదటి నుండి పెదనాన్న, నాన్న మాదిరిగా ఎంతో మంచి మనసు, భోళా వ్యక్తిత్వం గల ప్రభాస్, తన స్నేహితులు, కుటుంబంలోని వారు ఎవరైనా సరే ఆర్ధికంగా సమస్యల్లో ఉంటె ఎంతో చలించిపోయేవారట. వారికి వెంటనే తనకు వీలైనంత సాయం అందించడంలో ప్రభాస్ ముందుంటారని పలువురు చెప్తుంటారు. ముఖ్యంగా ఇటీవల ఆయన నటనా శిక్షకుడు సత్యానంద్ కి ప్రత్యేకంగా ఒక బహుమతి అందించడంతో పాటు కరోనా సమయంలో ఆయనకి అండగా కూడా నిలిచారు ప్రభాస్. 

Inside Prabhas's off-screen personality


4. అయితే దాదాపుగా చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, హీరో ప్రభాస్ 2014 లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కానీ అది హీరోగా కాదు, అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా హీరో హీరోయిన్స్ గా నటించిన యాక్షన్ జాక్సన్ మూవీలోని ఒక సాంగ్ లో ప్రభాస్ కొన్ని క్షణాల పాటు కనిపించడంతో పాటు ఒక చిన్న డ్యాన్స్ స్టెప్ వేసిన సీన్ అప్పట్లో థియేటర్స్ ని షేక్ చేసింది. ఇప్పటికీ కూడా ఆ సీన్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్ అవుతుంటారు. 

ప్రభాస్ గురించి షాకింగ్ నిజాలు


5. అయితే తాను నటుడు కాకుంటే తమ ప్రాంతంలో రొయ్యల చెరువులతో పాటు మంచి భోజన హోటల్ పెట్టాలనేది మొదటి నుండి తన ఆలోచన అని చెప్తారు ప్రభాస్. అయితే హీరో అయినప్పటికీ కూడా తనకు ఇష్టమైన ఎన్నో రకాల ఫుడ్ ఐటెమ్స్ ని తన సెట్స్ లోని వారికి అందిస్తూ తన గొప్ప మనసు, ఉదారత చాటుకుంటూ ఉంటారు ప్రభాస్. తన మూవీ సెట్స్ లో ఎవరైనా నటుడు సరిగ్గా తినకపోతే వారియొక్క ఇష్టాలు తెలుసుకుని మరీ ప్రత్యేకంగా వండించి తెప్పిస్తారు అంటే ప్రభాస్ మంచి మనసు ఎటువంటిదో అర్ధం చేసుకోవచ్చు. 

Hidden truths about Tollywood star Prabhas


6. అలానే మొదటి నుండి తనకు పెద్దనాన్న, నాన్న మాదిరిగా ఫుడ్ తినడం బాగా జిమ్ చేయడం ఇష్టం అంటారు ప్రభాస్. ముఖ్యంగా అన్ని రకాల నాన్ వెజ్ ఐటెమ్స్ తినే ప్రభాస్, ఎక్కువ ఇష్టంగా బటర్ చికెన్ తో పాటు చికెన్ బిర్యానీ బాగా తింటారట. అయితే బాహుబలి సినిమా కోసం తాను, రానా దగ్గుబాటి ప్రత్యేకంగా ఒక శిక్షకుడి ద్వారా బాగా ఫుడ్ తినడంతో పాటు పక్కాగా వ్యాయామం చేశామని, ఆ పాత్రల కోసం ప్రత్యేకంగా శిక్షణ తప్పదని అంటారు ప్రభాస్. 


7. తన తండ్రి సూర్యరాయణ రాజు 2010లో మృతి చెందడంతో మానసికంగా ఎంతో కృంగిపోయారు ప్రభాస్. అదే సమయంలో కొరటాల శివతో ఆయన మిర్చి మూవీ చేస్తున్నారు. ఆ సమయంలో ఫ్యామిలీ, బంధువులు, స్నేహితులు ఆయనకు అండగా తోడుగా నిలిచారు. మిర్చి మూవీ షూటింగ్ కి ఆ సమయంలో కొంత బ్రేక్ పడింది. అందుకే ఆ మూవీ కొంత ఆలస్యం కావడంతో పాటు అందులో కొన్ని సీన్స్ లో ప్రభాస్ బాడీ, లుక్స్ విషయమై వ్యత్యాసం మనం గమనించవచ్చు. 


8. ముఖ్యంగా తాను ఒక దర్శకుడికి మాటిస్తే దానికి పక్కాగా కట్టుబడి ఉంటారు ప్రభాస్. ముఖ్యంగా మిర్చి అనంతరం బాహుబలి సినిమా ప్రారంభించారు రాజమౌళి, అక్కడి నుండి ఫస్ట్ పార్ట్ చిత్రీకరణ జరుపుకుని 2015లో రిలీజ్ కాగా అనంతరం సెకండ్ పార్ట్ 2017లో రిలీజ్ అయింది. మొత్తం దాదాపుగా నాలుగేళ్లకు పైగా ఈ రెండు ప్రాజక్ట్స్ కోసం పూర్తిగా బాడీని బిల్డప్ చేయడంతో పాటు మరొక ఇతర ప్రాజక్ట్ గురించి ప్రభాస్ ఆలోచన కూడా చేయలేదని, అటువంటి గ్రేట్ హీరోతో వర్క్ చేయడం ఎంతో సంతోషంగా ఉందని పలు సందర్భాల్లో రాజమౌళి చెప్పారు. 


9. ఈశ్వర్ మూవీ నుండి తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి బాహుబలి సిరీస్ సినిమాల తరువాత హీరోగా ఎవరికీ అందనంత ఎత్తుకి వెళ్ళిపోయిన ప్రభాస్ ప్రస్తుతం భారతీయ సినిమా పరిశ్రమలోని ప్రముఖ స్టార్స్ లో ఒకరిగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా ఆయన రెమ్యునరేషన్ కూడా అనేకమంది కంటే ఎక్కువ అంటే అతిశయోక్తి కాదు. ఆ విధంగా ప్రతి సినిమాతో హీరోగా ప్రభాస్ క్రేజ్ తో పాటు రేంజ్, మార్కెట్ వాల్యూ కూడా ఎంతో పెరుగుతోంది. 

అంతర్జాతీయ క్రేజ్, పర్సనల్ విషయాలు


10. మ్యాడం టుస్సాడ్స్ లో మైనపు విగ్రహం కలిగిన తొలి సౌత్ ఇండియన్ యాక్టర్ గా నిలిచారు ప్రభాస్. ఆయన నటించిన బాహుబలి మూవీలోని పాత్ర యొక్క మైనపు విగ్రహాన్ని 20174లో బ్యాంకాక్ లోని మ్యాడం టుస్సాడ్స్ మ్యూజియం లో ఏర్పాటు చేయగా దానికి విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ కూడా దానిని చూడడానికి అనేకమంది వెళ్తుంటారు అంటే ప్రభాస్ క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. 


11. తన పెదనాన్న కృష్ణంరాజు నటనలో తనకు ఎంతో పెద్ద ఇన్స్పిరేషన్ అని చెప్పే ప్రభాస్ కు హాలీవుడ్ నటుడు రాబర్ట్ డి నీరో అంటే కూడా ఎంతో ఇష్టం. అలానే ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ అంటే ఇష్టమని, ఆయన తీసే సినిమాలకు తను ఫ్యాన్ అని చెప్తారు ప్రభాస్. ఆయన తీసిన మున్నా భాయ్ ఎంబిబిఎస్, 3 ఇడియట్స్ సినిమాలు చాలాసార్లు చూసినట్లు చెప్పారు ప్రభాస్.


12. అయితే హీరోగా ప్రభాస్ ఇంతటి ఉన్నత స్థాయిలో కొనసాగుతుండడంతో ఎంతో ఆనందంగా ఉందని పలు సందర్భాల్లో వెల్లడించిన ఆయన పెదనాన్న కృష్ణంరాజు, అతడిని ఎప్పటికైనా హాలీవుడ్ హీరోగా చూడాలనేది తన కోరిక అని అన్నారు. అయితే త్వరలోనే అది నెరవేరాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపిన కృష్ణంరాజు ఇటీవల తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ప్రభాస్ కుటుంబం మొత్తం కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రభాస్ హాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశము లేకపోలేదు, కానీ అది ఎప్పుడు ఎలా ఏవిధంగా జరుగుతుందనేది వేచి చూడాలి. 


కాగా ఇటువంటి లేటెస్ట్ టాలీవుడ్ మూవీ న్యూస్, అప్ డేట్స్, రివ్యూస్, గ్యాలరీస్, బాక్సాఫీస్ కలెక్షన్స్, గాసిప్స్ కోసం ఎప్పటికప్పుడు మా Telugu Movie Media సైట్ ని ఫాలో అవుతూ ఉండండి, ధన్యవాదాలు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow