Tollywood Top Heroines 2024: Most Popular & Highest Paid Actresses

Tollywood Top Heroines టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం పలువురు హీరోయిన్స్ మంచి సక్సెస్ లతో, ఆడియన్స్ నుండి బాగా క్రేజ్ తో తమ ఆకట్టుకునే అందం అభినయంతో దూసుకెళ్తున్నారు. ఆ విధంగా బాగా పేరుతో కొనసాగుతున్న

Tollywood Top Heroines 2024: Most Popular & Highest Paid Actresses

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం పలువురు హీరోయిన్స్ మంచి సక్సెస్ లతో, ఆడియన్స్ నుండి బాగా క్రేజ్ తో తమ ఆకట్టుకునే అందం అభినయంతో దూసుకెళ్తున్నారు. ఆ విధంగా బాగా పేరుతో కొనసాగుతున్న లేటెస్ట్ 2025 టాప్ హీరోయిన్స్ గురించి, వారి తాజా సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం 

Tollywood Top Heroines in 2024 – Most Popular Actresses List

రష్మిక మందన్న (Rashmika Mandanna) :-

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న వారిలో రష్మిక ఒకింత అగ్ర స్థానంలో ఉన్నారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ముఖ్యంగా ఇటీవల అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీసిన పుష్ప 2 (Pushpa 2 : The Rule) అత్యంత భారీ విజయంతో మంచి క్రేజ్ అందుకున్నారు రష్మిక. ఇక ఏడాది క్రితం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రూపొందిన ఆనిమల్ (Animal) మూవీతో కూడా భారీ విజయం అందుకున్నారు రష్మిక. ఇక తాజాగా విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కిన హిస్టారికల్ ఎంటర్టైనర్ మూవీ ఛావాలో కూడా హీరోయిన్ గా నటించి తద్వారా కూడా మరొక విజయం తన ఖాతాలో వేసుకున్నారు. 

సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) :-

టాలీవుడ్ లో కొన్నేళ్లుగా తిరుగులేని స్టార్ హీరోయిన్ గా వరుసగా మంచి సక్సెస్ లతో బాగా క్రేజ్ తో కొనసాగుతున్నారు సమంత రూత్ ప్రభు. ఇటీవల వరుణ్ ధావన్ తో కలిసి సమంత నటించిన పాన్ ఇండియన్ వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ బాగానే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అంతకముందు ఆమె చేసిన శాకుంతలం అలానే యశోద కూడా అందరి నుండి బాగానే రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం సమంత రక్త్ బ్రహ్మాండ్ అనే సీరీస్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అలానే మరికొన్ని సినిమాలు కూడా ఆమె లిస్ట్ లో ఉన్నాయి, త్వరలో వాటి గురించి కూడా పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. 

కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) :-

టాలీవుడ్ స్ట హీరోయిన్స్ లో ఒకరైన కాజల్ అగర్వాల్ ఇటీవల లేడీ ఓరియెంటెడ్ మూవీ సత్యభామ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం సొంతం చేసుకున్నారు. ఇక తాజాగా శంకర్ దర్శకతంలో కమల్ హాసన్ హీరోగా రూపొండుతున్న (Indian 3) మూవీ ద్వారా త్వరలో ఆడియన్స్ ముందుకి రానున్నారు. అలానే మంచు విష్ణు కన్నప్పలో ఆమె ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. వీటితో పాటు మురుగదాస్ దర్శకత్వంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతోన్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సికందర్ లో కూడా ఆమె నటిస్తున్నారు. వీటితో పాటు కాజల్ లిస్ట్ లో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. 

Highest Paid Tollywood Actresses & Their Remuneration

కీర్తి సురేష్ (Keerthy Suresh) :-

టాలీవుడ్ స్టార్ నటి కీర్తి సురేష్ ఇటీవల నాగ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 ఏడి మూవీలో బుజ్జి అనే కారుకి డబ్బింగ్ చెప్పి ఆకట్టుకున్నారు. అలానే తమిళ్ లో రఘు తాత మూవీ చేసి అలరించారు. ఇక తాజాగా వరుణ్ ధావన్ హీరోగా బాలీవుడ్ లో తెరకెక్కిన బేబీ జాన్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మరొక విజయం తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ప్రస్తుతం రివాల్వర్ రీటా, కన్నివేడి మూవీస్ చేస్తున్నారు కీర్తి సురేష్. కొద్దిరోజుల క్రితం తన స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ ని ప్రేమించి వివాహమాడారు కీర్తి. 

పూజా హెగ్డే (Pooja Hegde) :-

యువ అందాల కథానాయిక అయిన పూజా హెగ్డే 2023లో బాలీవుడ్ లో రూపొందిన కిసి కా భాయ్ కిసి కి జాన్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి ఆకట్టుకున్నారు. అనంతరం తాజాగా షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన దేవా మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి విజయం అందుకున్నారు. కాగా ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఇళయదళపతి విజయ్ హీరోగా రూపొందుతోన్న జన నాయగన్ మూవీతో పాటు రాఘవ లారెన్స్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న కాంచన సిరీస్ లోని 4వ భాగంలో కూడా నటిస్తున్నారు. వీటితో పాటు తమిళ్ లోనే సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ తీస్తున్న రెట్రో లో కూడా హీరోయిన్ గా ఆమె నటిస్తున్నారు. అలానే హై జవానీ తో ఇష్క్ హోనా హై అనే హిందీ మూవీ కూడా ఆమె చేస్తున్నారు. 

శ్రీలీల (Sreeleela) :-

టాలీవుడ్ లో యువ అందాల కథానాయికగా మంచి సక్సెస్ లతో కొనసాగుతున్నారు శ్రీలీల. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం (Guntur Kaaram) మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయం అందుకున్నారు. అనంతరం అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ తీసిన పుష్ప 2 లో కిసిక్ సాంగ్ ద్వారా అందరినీ ఆకట్టుకున్నారు శ్రీలీల. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజ తో మాస్ జాతర, నితిన్ తో రాబిన్ హుడ్, శివ కార్తికేయన్ తో పరాశక్తి మూవీస్ చేస్తున్నారు శ్రీలీల. 

త్రిష (Trisha)  : -

ఇటీవల విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ తీసిన లియో మూవీతో మంచి విజయం అందుకున్న త్రిష, మరోవైపు తాజాగా అజిత్ హీరోగా రూపొందిన విడాముయార్చి మూవీ ద్వారా కూడా విజయం సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మరొక్కసారి అజిత్ తో కలిసి గుడ్ బ్యాడ్ అగ్లీ, మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర, కమల్ హాసన్ మణిరత్నం ల థగ్ లైఫ్ అలానే సూర్య హీరోగా రూపొందనున్న ఆయన కెరీర్ 45వ మూవీ కూడా చేస్తున్నారు త్రిష 

Rising Stars – New Generation Heroines Dominating Tollywood

అనుష్క శెట్టి (Anushka Shetty) :-

టాలీవుడ్ స్టార్ కథానాయికగా మంచి పేరుతో ప్రస్తుతం కొనసాగుతున్న వారిలో అనుష్క శెట్టి కూడా ఒకరు. ఇటీవల నవీన్ పోలిశెట్టి హీరోగా యువ దర్శకుడు పి. మహేష్ బాబు తెరకెక్కించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన అనుష్క ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి తీస్తున్న ఘాటీ మూవీ చేస్తున్నారు. అలానే మలయాళం లో గ్రాండ్ లెవెల్లో రోజిన థామస్ తెరకెక్కిస్తున్న భారీ మూవీ కథనార్ ది వైల్డ్ సోర్సరర్ మూవీస్ చేస్తున్నారు అనుష్క. కాగా వీటిలో ఘాటీ ఈ ఏడాది ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది. 

శృతి హాసన్ (Shruti Haasan) :-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన శృతి హాసన్ ఇటీవల 2023లో ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తీసిన భారీ పాన్ ఇండియన్ మాస్ మూవీ సలార్ పార్ట్ 1 ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయం సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ తీస్తున్న కూలిలో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు శృతి. అలానే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న తమిళ్ మూవీ ట్రైన్ తో పాటు సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం మూవీస్ చేస్తున్నారు శృతి హాసన్.   

మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) :-

టాలీవుడ్ యువ అందాల కథానాయిక మీనాక్షి చౌదరి గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందియే గుంటూరు కారం మూవీలో ఒక చిన్న పాత్రలో కనిపించారు. ఇక ఇటీవల విజయ్ హీరోగా రూపొందిన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం తో పాటు దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ మూవీస్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయాలు సొంతం చేసుకున్నారు. అలానే వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన మట్కా, విశ్వక్సేన్ హీరోగా రూపొందిన మెకానిక్ రాకీ మూవీస్ లో కూడా నటించి ఆకట్టుకున్నారు. ఇక ఇటీవల విక్టరీ వెంకటేష్ హీరోగా సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి తీసిన సంక్రాంతికి వస్తున్నాం మూవీలో ఒక హీరోయిన్ గా నటించి అతి పెద్ద విజయం అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఆమె మరికొన్ని సినిమాలని చేస్తున్నారు. 

రాశి ఖన్నా (Raashi Khanna) :-

టాలీవుడ్ యువ అందాల నటి రాశి ఖన్నా, ఇటీవల తమిళ్ లో సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన అరన్మనై మూవీతో పాటు హిందీ లో ది సబర్మతి రిపోర్ట్ మూవీస్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయాలు సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం జీవ హీరోగా తమిళ్ లో రూపొందుతున్న అగత్యా, సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతోన్న తెలుసు కదా తో పాటు మరొక మూవీ చేస్తున్నారు. 

Tollywood Actresses with the Biggest Fan Following in 2024

నిధి అగర్వాల్ (Nidhi Agerwal) :-

టాలీవుడ్ అందాల నటి నిధి అగర్వాల్ 2022లో ఉదయనిధి స్టాలిన్ హీరోగా రూపొందిన కలగ తలైవన్ తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా డెబ్యూ హీరోగా రూపొందిన హీరో మూవీస్ చేసి వాటితో మంచి విజయాలు సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్, జ్యోతికృష్ణ కలిసి తెరకెక్కిస్తున్న హరి హర వీర మల్లుతో పాటు ప్రభాస్ హీరోగా మారుతీ తీస్తున్న ది రాజా సాబ్ మూవీస్ చేస్తున్నారు నిధి అగర్వాల్. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow