Amazing Facts About Keerthy Suresh – Tollywood’s Talent Queen

Keerthy Suresh is more than just a National Award winner. Discover amazing facts about her hidden talents and achievements

Amazing Facts About Keerthy Suresh – Tollywood’s Talent Queen

తెలుగు సినిమా (Telugu Cinema) పరిశ్రమలో ప్రస్తుతం స్టార్ నటిగా దూసుకెళ్తున్న వారిలో కీర్తి సురేష్ (Keerthy Suresh) కూడా ఒకరు. వాస్తవానికి నటిగా తొలిసారిగా రామ్ సరసన నేను శైలజ మూవీ ద్వారా ఆమె హీరోయిన్ గా లాంచ్ అయినప్పటికీ, అంతకుముందే వికె నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణతో అయినా ఇష్టం నువ్వే సినిమా చేసారు. 

కానీ అది కొంత లేట్ గా రిలీజ్ అవ్వడం, ముందుగా నేను శైలజా రిలీజ్ అవ్వడంతో అది ఆమె ఎంట్రీ మూవీగా మారింది. కిషోర్ తిరుమల తీసిన ఈ మూవీలో రామ్, కీర్తి ల జోడీకి మంచి పేరు రావడంతో పాటు మూవీ పెద్ద విజయం అందుకుని నటిగా ఆమెకు విశేషమైన క్రేజ్ తీసుకువచ్చింది. 

కీర్తి సురేష్ గురించి ఆశ్చర్యకర విషయాలు

అనంతరం నానితో నేను లోకల్ సినిమా చేసిన కీర్తికి అనంతరం ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం లభించింది. అది కూడా త్రివిక్రమ్ తెరకెక్కించిన అజ్ఞాతవాసి మూవీలో. అయితే ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలయింది. ఆ తరువాత కొన్నాళ్ళకు పలు అవకాశాలతో కొనసాగుతున్న కీర్తి సురేష్ కి నాగ అశ్విన్ తీసిన మహానటి మూవీ ఛాన్స్ లభించింది. 

దిగ్గజ గొప్ప నటి సావిత్రి జీవితం ఆధారంగా రోపొందిన ఈ మూవీలో కీర్తి సురేష్ అద్భుత నటన అందరినీ ఆకట్టుకోవడంతో పాటు మూవీ ఘన విజయం సాదించింది. ముఖ్య విషయం ఏమిటంటే, ఈ మూవీలో అద్భుత నటనకు గాను కీర్తి సురేష్ ఏకంగా బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు. 

Keerthy Suresh Movies

ఇక అక్కడి నుండి కెరీర్ పరంగా ఆమె వెనుతిరిగి చూసుకోలేదు. ఆపైన తమిళ్ లో విజయ్ తో సర్కార్, విశాల్ తో పందెం కోడి 2, విక్రమ్ తో స్వామి స్క్వేర్ వంటి సినిమాలు చేసారు. ఆ విధంగా తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని దూసుకెళ్లారు కీర్తి సురేష్. ఇక కరోనా సమయంలో పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి మరింత మంచి పేరు సొంతం చేసుకున్నారు. 

అటు మలయాళంలో కూడా ఒక మూవీ చేసి ఆకట్టుకున్న కీర్తి సురేష్, ఇటీవల హిందీలోకి కూడా తెరంగేట్రం చేసారు. వరుణ్ ధావన్ హీరోగా తమిళ సూపర్ హిట్ మూవీ తేరికి రీమేక్ అయిన బేబీ జాన్ మూవీలో ఆమె హీరోయిన్ గా నటించి ఆకట్టుకున్నారు. ఇక ప్రస్తుతం తమిళ్ లో రివాల్వర్ రీటా, అమెజాన్ ప్రైమ్ వారి ఉప్పుకప్పురంబు తో పాటు మరికొన్ని సినిమాలు చేస్తున్నారు. 

ముఖ్యంగా మొదటి నుండి తన ఆకట్టుకునే అందం, అభినయంతో మంచి క్రేజ్ తో ఎందరో ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని మెప్పిస్తూ కొనసాగుతున్న కీర్తి సురేష్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. తరచు తన ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి మాధ్యమాల్లో తన సినిమాలు, వ్యక్తిగత విషయాలకు సంబంధించి పలు విషయాలు అందరితో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు మనం కీర్తి సురేష్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాము.

పెర్ఫామెన్స్, స్టైల్, వ్యక్తిత్వం


1. ముందుగా కీర్తి సురేష్ తల్లి మేనకా సురేష్ 1990 లలో పేరున్న మంచి నటి. అలానే తండ్రి సురేష్ కుమార్ మంచి పేరున్న నిర్మాత. మొత్తంగా వారిద్దరికీ మంచి పేరుతో పాటు వారిది కేరళలో పేరెన్నిక గల కుటుంబం. మొదటి నుండి తల్లితండ్రుల వద్దనే పెరిగి విద్యాబుద్ధులతో పాటు పలు కళల్లో కూడా మంచి ప్రావిణ్యం సంపాదించారు కీర్తి సురేష్. 


2. ఓవైపు తల్లి నటి, తండ్రి నిర్మాత కావడంతో బాలనటిగా కీర్తి సురేష్ మొత్తంగా మూడు సినిమాల్లో నటించారు. పైలెట్స్, అఛనేయనేనిక్కిష్టం, అలానే కుబేరన్ అనే సినిమాల్లో ఆమె నటించడం జరిగింది. ఆ తరువాత పూర్తిగా పైచదువులు చదువుకుని అనంతరం 2013లో గీతాంజలి అనే మలయాళ మూవీ ద్వారా ఆమె సినీ రంగ ప్రవేశం చేసారు.


3. ముఖ్యంగా అటు నటిగా కొనసాగుతున్నప్పటికీ కీర్తి కి మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టం. అలానే ఆమెకు వయోలిన్, కీ బోర్డు ప్లే చేయడం వచ్చు. తన ఇన్స్ట్రుమెంటల్ కలెక్షన్ తో తన ఇంట్లో ఒక మ్యూజికల్ వాల్ ని కూడా నిర్మించారు కీర్తి సురేష్. 

Keerthy Suresh Husband


4.  ఆమె ప్రత్యేకంగా ప్రొఫెషనల్ సింగర్ కానప్పటికీ ఆమె గాత్రం ఎంతో బాగుంటుంది. పలు సినిమాల్లో ఆమె డబ్బింగ్ చెప్తున్నప్పుడు మీరు పాటలు పాడవచ్చు కదా అని పలువురు ఆమెను అడిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇటీవల ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 ఏడి మూవీలో చిట్టి అనే ఫ్యూచర్ జనరేషన్ కార్ కి ఆమె వాయిస్ ఓవర్ అందించిన విషయం తెలిసిందే. 


5. చిన్నప్పటి నుండి నాట్యం పట్ల మంచి మక్కువ కలిగిన కీర్తి సురేష్ దాదాపుగా రెండేళ్లకు పైగా భారత నాట్యంలో ఎంతో బాగా శిక్షణ తీసుకున్నారు. అలానే కాంటెంపరరీ మ్యూజిక్ తో పాటు కర్ణాటిక్ మ్యూజిక్ లో కూడా మంచి ప్రావిణ్యం ఉంది. 


6. అలానే అదే డ్యాన్స్ లో భాగంగా భరత నాట్యంతో పాటు కథక్ తో పాటు ఇతర క్లాసికల్ డ్యాన్స్ లు కూడా ఆమె నేర్చుకున్నారు. అందుకే సినిమాల్లోని సాంగ్స్  డ్యాన్సింగ్ మూమెంట్స్ లో ఆమె మంచి గ్రేస్ తో డ్యాన్స్ చేయడం చూడవచ్చు. 

తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు


7. అటు డ్యాన్స్ వంటి కళలతో పాటు కీర్తి సురేష్ స్పోర్ట్స్ లో కూడా మంచి ప్రావిణ్యం సంపాదించారు. మొదటి నుండి టెన్నిస్, స్విమ్మింగ్ బాగా నేర్చుకున్నారు. అయితే స్పోర్ట్స్ అనేవి నేర్చుకోవడం వలన ప్రావిణ్యంతో పాటు కొంత మానసిక ఉల్లాసం అలానే శారీరకంగా కూడా ఎంతో రిలీఫ్ గా ఉంటుందని ఆమె అంటారు. 


8. ఓవైపు నటిగానే కాక చిన్న స్క్రిప్ట్స్ రాయడం కూడా కీర్తి సురేష్ కి వచ్చు. త్వరలో మంచి ప్రొడక్షన్ సంస్థని స్థాపించి ఆమె దర్శకురాలిగా కూడా మారే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు చెప్తుంటారు. అయితే ప్రస్తుతం మాత్రం తన దృష్టి మొత్తం మాత్రం యాక్టింగ్ పైనే అని తెలుస్తోంది. 


9. ఇక ఆన్ స్క్రీన్ యాక్టింగ్ గురించి కీర్తి సురేష్ పలు సందర్భాల్లో మాట్లాడుతూ, నిజానికి మహానటి పాత్ర చేయడానికి తాను మొదట భయపడ్డానని, అయితే తరువాత దర్శకుడు నాగ అశ్విన్ సహా మరికొందరు ప్రోత్సహించారని అన్నారు. అప్పటి నుండి మెల్లగా తన నటన పై తనలో మరింత కాన్ఫిడెన్స్ పెరిగిందని ఆమె చెప్తారు.

Keerthy Suresh Age


10. అయితే నటన పరంగా కానీ, డ్యాన్స్ కానీ, లేదా ఇతర ఎటువంటి పనిలో అయినా ఎప్పటికప్పుడు క్రియేటివిటీ తో పాటు సరికొత్తగా ప్రయత్నాలు చేయాలనేది తన ఆలోచన అని ఆమె చెప్తారు. ఆ విధంగా ఎప్పటికప్పుడు ప్రేక్షకాభిమానులకు వినూత్న పాత్రలతో మంచి ఎంటర్టైన్మెంట్ అందించవచ్చని అంటారు. 


11. త్వరలో ఆమె నుండి రానున్న ఉప్పుకప్పురంబు, నెట్ ఫ్లిక్స్ వారి అక్క ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో మంచి హైప్ ఏర్పరిచాయి. ఇవి తప్పకుండా నటిగా తన పేరు, క్రేజ్ ని మరింతగా పెంచుతాయని భావిస్తున్నారు కీర్తి సురేష్. 

12. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బాలీవుడ్ కింగ్ ఖాన్ అయిన షారుఖ్ ఖాన్ తో కీర్తి సురేష్ మంచి అనుబంధం కలిగి ఉన్నారని చెప్పాలి. అసలు మ్యాటర్ ఏమిటంటే కీర్తి సురేష్ సోదరి రేవతి సురేష్, షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ కంపెనీ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ లో విజువల్ ఎఫెక్ట్స్ స్పెషలిస్ట్ గా ఎప్పటి నుండో వర్క్ చేస్తుండడంతో వారికి షారుక్ తో మంచి స్నేహానుబంధం ఉందట. 


13. అలానే తన యుక్త వయసులో కీర్తి కొన్నాళ్ల పాటు చెన్నైలోని పెరల్ అకాడెమిలో ఫాషన్ డిజైనింగ్ కోర్స్ చేసారు. అనంతరం అదే కోర్స్ కి సంబంధించి ఆమె స్కాట్లాండ్, లండన్ లకు వెళ్లి ఇంటర్న్ షిప్ చేసి మరింత ప్రావిణ్యం సంపాదించారు. 


14. అసలు విషయం ఏమిటంటే, తాను చిన్నప్పటి నుండి తలపతి విజయ్ కి పెద్ద ఫ్యాన్ అని పలు ఇంటర్వూస్ లో చెప్తుంటారు కీర్తి సురేష్. ఇక ఆయనని చూడడమే కల అనుకున్న తనకి ఏకంగా భైరవ మూవీలో ఆయన సరసన నటించే ఛాన్స్ వచ్చినప్పుడు అది కలా లేక నిజమా అని తానే నమ్మలేకపోయానని ఆమె చెప్పారు. అలానే సూర్య అంటే కూడా ఎంతో ఇష్టం అని చెప్తారు కీర్తి. 

15. ఇక శరీరాన్ని, మనసుని ఎప్పుడూ జాగ్రత్తగా ప్రశాంతంగా ఉంచుకోవాలని చెప్పే కీర్తి సురేష్ వెజిటేరియన్ ఫుడ్ నే తింటుంటారు. నిత్యం క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా వంటివి చేయడంతో పాటు డైట్ విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటేనే మన జీవితం ఎంతో చక్కగా సాగుతుందని ఆమె చెప్తారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow