Jr NTR & Hrithik Roshan's War 2 Teaser Out Now | Massive Action Adventure

War 2 teaser featuring Jr NTR and Hrithik Roshan is out now! Get ready for high-octane action, stylish visuals, and massive fan hype

Jr NTR & Hrithik Roshan's War 2 Teaser Out Now | Massive Action Adventure

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr), బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) కలిసి నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ మూవీ వార్ 2 (War 2). ఈ మూవీని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తుండగా యష్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) సంస్థ పై ఆదిత్య చోప్రా గ్రాండ్ గా నిర్మిస్తుండగా కీలక పాత్రల్లో అనిల్ కపూర్, అశుతోష్ రానా నటిస్తున్నారు. 

ప్రీతం సంగీతం అందిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే పలు భారీ యాక్షన్ సీన్స్ తీసిన మూవీ టీమ్, త్వరలో హృతిక్, ఎన్టీఆర్ ల పై క్రేజీ డ్యాన్స్ నంబర్ ని తెరకెక్కించనున్నారు. మొదటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఆగష్టు 14న గ్రాండ్ గా తెలుగు, తమిళ, హిందీ భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. 

జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ వార్ 2 టీజర్ విడుదల

2019లో రిలీజ్ అయి పెద్ద విజయం సొంతం చేసుకున్న వార్ మూవీకి ఇది సీక్వెల్ అనేది తెలిసిందే. ఆ మూవీలో హృతిక్ తో కలిసి టైగర్ ష్రాఫ్ నటించగా ఈ మూవీలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. అందాల భామ కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని నేడు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో యూట్యూబ్ లో రిలీజ్ చేసారు మేకర్స్. 

ఇక ఈ టీజర్ లో భారీ యాక్షన్ సీన్స్ అయితే ఎంతో అదిరిపయాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ పవర్ఫుల్ వాయిస్ ఓవర్ తో కబీర్ ని ఛాలెంజ్ చేస్తున్న సీన్స్, ఆయన ఎంట్రీ, లుక్స్, డైలాగ్స్ సూపర్ అని చెప్పకతప్పదు. దేవర అనంతరం ఎన్టీఆర్ ఈ మూవీలో ఎంతో ట్రెండీ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. 

మరోవైపు కబీర్ గా నటిస్తున్న హృతిక్ సీన్స్, డైలాగ్స్ కూడా టీజర్ లో సూపర్ గా ఉన్నాయి. ఇక కియారా అద్వానీని బికినీ సీన్ లో చూపించారు. టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మొత్తంగా వార్ 2 టీజర్ ఇప్పటివరకు మూవీ పై ఉన్న అంచనాలు అటు హృతిక్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్సు లో కూడా విపరీతంగా పెంచేసాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. 

భారీ యాక్షన్ ట్రీట్ – టీజర్ లో హై వోల్టేజ్ సీన్స్

ఆకట్టుకునే యాక్షన్ తో కూడిన థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ ఆగష్టు 14న రిలీజ్ అనంతరం పెద్ద విజయం ఖాయం అని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అటు హృతిక్ తో పాటు ఇటు ఎన్టీఆర్ పాత్ర కూడా మూవీలో ఎంతో పవర్ఫుల్ గా డిజైన్ చేసారని, వాళ్ళిద్దరి నడుమ వచ్చే యాక్షన్ సీన్స్ అయిత్ మరొక లెవెల్లో ఉంటాయని కొంతవరకు టీజర్ మనకు చెప్పకనే చెప్తోంది. 

ఫ్యాన్స్ స్పందన మరియు సోషల్ మీడియాలో ట్రెండ్

ఇక టాలీవుడ్ లో మంచి డ్యాన్సర్ గా పేరున్న ఎన్టీఆర్, అటు హాలీవుడ్ లో సూపర్ డ్యాన్సర్ గా పేరున్న హృతిక్ ఇద్దరూ కలిసి మంచి డ్యాన్స్ నెంబర్ చేస్తున్నారు అంటే అది రేపు వార్ 2 రిలీజ్ అనంతరం స్క్రీన్ పై ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్సు కి కూడా ఐ ఫీస్ట్ ని అందిస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మొత్తంగా వార్ 2 మూవీ విజయం అందుకోవాలని అలానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తోంది మా Telugu Movie Media టీమ్

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow