Telugu News Live: Latest Tollywood Movie Updates and Breaking Cinema News

Stay updated with Telugu News Live from Tollywood – catch the latest movie announcements, celebrity updates, trailers, and cinema news in real-time

Telugu News Live: Latest Tollywood Movie Updates and Breaking Cinema News

ఇప్పటికే 2025 ఏడాదిలో పలు సినిమాలు ఆడియన్స్ ముందుకి వచ్చి వారికి మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించాయి. ఇక మరికొన్ని బడా మరియు చిన్న, మధ్యతరహా సినిమాలు ప్రొడక్షన్ స్టేజి లో ఉన్నాయి. అయితే వాటిలో దాదాపుగా చాలా సినిమాల పై ఆడియన్స్ లో మంచి క్రేజ్ నెలకొని ఉంది. మొత్తంగా టాలీవుడ్ (Tollywood) నుండి ఈ ఏడాది పలు భారీ సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఇక మరొక ఎనిమిది నెలలు మిగిలి ఉండడంతో రానున్న ఏయే స్టార్స్ యొక్క సినిమాలు ఏ స్టేజ్ లో షూటింగ్ దశలో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 

Mahesh Babu :

గతఏడాది సంక్రాంతి కానుకగా గుంటూరు కారం (Guntur Kaaram) మూవీ ద్వారా ఆడియన్సు ముందుకి వచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu). అయితే ఈ మూవీ ఫస్ట్ డే నెగటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ సూపర్ స్టార్ యొక్క సూపర్ స్టార్డంతో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద బాగా కొల్లగొట్టి హిట్ అయింది. ఇక దాని అనంతరం కొంత గ్యాప్ తీసుకున్న మహేష్ బాబు, తాజాగా ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో చేస్తున్న మూవీ SSMB 29

ఈ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ పై అందరిలో ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొని ఉన్నాయి. తొలిసారిగా ఈ మూవీ ద్వారా ఏకంగా పాన్ వరల్డ్ రేంజ్ లో మార్కెట్ ని టార్గెట్ చేసిన సూపర్ స్టార్ తప్పకుండా దీనితో భారీ విజయం అందుకోవడం ఖాయం అని తెలుస్తోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని అలానే 15న శాతం షూటింగ్ ని పూర్తి చేసుకున్న SSMB29 మూవీ 2027 సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం కనపడుతోంది. 

Pawan Kalyan :

టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతూ మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్న పవన్, లేటెస్ట్ గా హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu) యొక్క షూట్ మొత్తం పూర్తి చేసారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలిసి తెరకెక్కిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా మొదటి భాగం జూన్ 13న గ్రాండ్ గా ఆడియన్సు ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. 

ఇక దీని అనంతరం మరోవైపు సుజీత్ దర్శకత్వంలో గ్రాండ్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ ఓజి (OG) (They Call Him OG) కూడా చేస్తున్నారు. ఈ మూవీపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్సు లో కూడా ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది కూడా 80 శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకోగా దీనిని ఈ ఏడాది సెప్టెంబర్ 5న రిలీజ్ చేయనున్నారు . ఇక వీటితో పాటు త్వరలో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సెట్స్ లో జాయిన్ అయి బ్యాలెన్స్ షూట్ ని పూర్తి చేస్తారు పవన్. ఈ మూవీని హరీష్ శంకర్ తీస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది. 

తాజా టాలీవుడ్ న్యూస్ - తెలుగు న్యూస్ లైవ్ కవరేజ్

NT Ramarao Jr :

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. అందులో ఒకటి హృతిక్ రోషన్ (Hrithik Roshan) తో కలిసి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో నటిస్తున్న వార్ 2 (War 2) కాగా మరొకటి ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ (Dragon) మూవీ. ఈ రెండు మూవీస్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. కాగా వీటిలో వార్ 2 షూటింగ్ చివరి దశకు చేరుకోగా దీనిని ఆగష్టు 14న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇక ప్రశాంత్ నీల్ మూవీ వచ్చే ఏడాది జూన్ చివర్లో ఆడియన్స్ ముందుకి రానుంది. వీటి అనంతరం కొరటాల శివ తో దేవర 2 (Devara 2), అలానే కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ నెల్సన్ తో ఒక మూవీ కూడా చేయనున్నారు ఎన్టీఆర్. 

Ramcharan :

మెగా పవర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) ఈ ఏడాది ఇప్పటికే గేమ్ ఛేంజర్ (Game Changer) మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. అయితే ఈ మూవీ పరాజయం పాలయిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం బుచ్చి బాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ పెద్ది (Peddi). ఈ మూవీలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రలో కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. అలానే అమెజాన్ ప్రైమ్ వీడియోలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న మీర్జాపూర్ సిరీస్ లో నటించిన దివ్యేందు కూడా మరొక ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఏ ఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి చివర్లో ఆడియన్సు ముందుకి రానుంది. దీని అనంతరం సుకుమార్ తో ఒక మూవీ చేయనున్నారు రామ్ చరణ్. 

Allu Arjun :  

ఇటీవల పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ మూవీ పుష్ప 2 (Pushpa 2 The Rule) తో దేశవ్యాప్తంగా అతి పెద్ద కలెక్షన్స్ ప్రభంజనం సృష్ఠించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తాజగా అట్లీ దర్శకత్వంల్లో ఒక భారీ పాన్ వరల్డ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీని కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు గ్రాండ్ గా నిర్మించనుండగా సాయి అభ్యంకర్ దీనికి సంగీతం సమకూర్చనున్నారు ఇక ఈ మూవీ ద్వారా తొలిసారిగా ట్రిపుల్ రోల్ లో అల్లు అర్జున్ కనిపించనున్నట్లు టాక్. అలానే ఆయనకు జోడీగా యువ అందాల నటీమణులు మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), జాన్వీ కపూర్ (Janhvi Kapoor), రష్మిక మందన్న (Rashmika Mandanna) కనిపించనున్నారని అంటున్నారు. అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న AA 22 మూవీ 2027 ప్రారంభం లో రిలీజ్ కి రెడీ అవుతోంది. దీని అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తో ఒక మైథలాజికల్ మూవీ చేయనున్నారు అల్లు అర్జున్ . 

సినిమా బ్రేకింగ్ న్యూస్, టీజర్లు, షూటింగ్ అప్‌డేట్స్

Prabhas :

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. అందులో ఒకటి మారుతీ తీస్తున్న ది రాజా సాబ్ (The Rajasaab) కాగా మరొకటి హను రాఘవపూడి తీస్తున్న మూవీ. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. కాగా వీటిలో ది రాజా సాబ్ మూవీ చాలావరకు షూట్ పూర్తి చేసుకుని త్వరలో ఆడియన్స్ ముందుకి వచేదుకు సిద్ధమవుతోంది. మరోవైపు హను రాఘవపూడి మూవీ యొక్క షూట్ కూడా పూర్తి చేస్తున్నారు ప్రభాస్. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. వీటి తరువాత ఆనిమల్ (Animal) దర్శకుడు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) తో స్పిరిట్ (Spirit) అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేయనున్నారు ప్రభాస్. ఈ మూవీలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనె (Deepika Padukone) హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని త్వరలో షూటింగ్ ప్రారంభించి 2026 చివర్లో రిలీజ్ చేయనుంన్నారట. కాగా వీటి తరువాత సలార్ 2 (Salaar 2), కల్కి 2 (Kalki 2) సినిమాలు చేయనున్నారు ప్రభాస్. 

Nani :

నాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా ఇటీవల యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ హిట్ 3 (Hit 3 The Third Case) ఆడియన్సు ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్ గా నటించగా ఫిస్ట్ డే ఫస్ట్ షో నుండే ఇది పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీని అనంతరం త్వరలో దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తో ది ప్యారడైజ్ (The Paradise) మూవీ చేయనున్నారు నాని. ఇటీవల ఫస్ట్ గ్లింప్స్ తో అందరిలో మంచి క్యూరియాసిటీ ఏర్పరిచిన నాని త్వరలో ఈ మూవీ యొక్క సెట్స్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. దసరా ని మించేలా తామిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న ది ప్యారడైజ్ మూవీ తప్పకుండా అందరి అంచనాలని మించి ఉంటుందని తాజాగా నాని మాట్లాడుతూ తెలిపారు. అయితే దీని తరువాత సుజీత్ తో ఒక మూవీ చేయనున్నారు నాని. 

లైవ్ టీవి లింకులు మరియు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వార్తలు

Raviteja : 

ఇటీవల హరీష్ శంకర్ దర్శకత్వంలో చేసిన మిస్టర్ బచ్చన్ (Mr Bachchan) మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు రవితేజ. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే (Bhagyasri Borse) హీరోయిన్ గా నటించగా రిలీజ్ అనంతరం ఇది ఏమాత్రం అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయింది. ఇక ప్రస్తుతం యువ దర్శకుడు భాను భోగవరపు తో రవితేజ చేస్తున్న మూవీ మాస్ జాతర (Mass Jathara). ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. కాగా ఈ మూవీలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తున్నారు. దీని అనంతరం చిత్రలహరి, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాల దర్శకుడు కిషోర్ తిరుమలతో కూడా ఒక మూవీ చేయనున్నారు రవితేజ. 

Vijay Deverakonda :

యువ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తాజాగా యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న భారీ పాన్ ఇండియన్ మూవీ కింగ్డమ్ (Kingdom). ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో విజయ్ ఒక పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్ర చేస్తుండగా ఆయనకు జోడీగా అందాల నటి భాగ్యశ్రీ బోర్సే (Bhagyasri Borse) హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై నాగవంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. కాగా కింగ్డమ్ మూవీ ఈ ఏడాది జులై 4న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.  

అయితే ఈ మూవీ తరువాత యువ దర్శకుడు రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు (Dil Raju) నిర్మించనున్న రౌడీ జనార్ధన (Rowdy Janardhan) మూవీ చేయనున్నారు విజయ్ దేవరకొండ. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇక వీటి రెండిటి అనంతరం తాజాగా రాహుల్ సంకృత్యాన్ తో కూడా మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు విజయ్. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ గా నిర్మించనుండగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇందులో విజయ్ కి జోడీగా నటించనుంది. త్వరలో ఈ మూవీస్ యొక్క పూర్తి వివరాలు ఒక్కొక్కటిగా అధికారికంగా వెల్లడి కానున్నాయి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow