Pushpa 3 Trailer Release Date, Cast & Updates: Allu Arjun Returns in 2027
Pushpa 3: The Rampage is set for a 2027 release, with Allu Arjun reprising his role. Get the latest updates on the trailer release date, cast, and production details

టాలీవుడ్ స్టార్ యాక్టర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా రెండు సినిమాలు లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. అందులో ఒకటి హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న మైథలాజికల్ మూవీ ఒకటి.
కాగా మరొకటి కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ మల్టీ కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ. దీనిని తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ గ్రాండ్ లెవెల్లో నిర్మించనుంది. ఈ రెండు సినిమాలు త్వరలోకి సెట్స్ మీదకు వెళ్లనున్నాయి.
పుష్ప 3 విడుదల తేదీ మరియు తారాగణం
అయితే అంతకముందు అల్లు అర్జున్ చేసిన మూవీ పుష్ప 2 ది రూల్. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా సుకుమార్ గ్రాండ్ గా తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.
అంతకముందు మూడున్నరేళ్ల క్రితం రిలీజ్ అయి పెద్ద విజయం అందుకున్న పాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రైజ్ మూవీకి ఇది సీక్వెల్. అయితే పుష్ప 1 మూవీలో తన అద్భుత నటనకు గాను అందరి నుండి ప్రసంశలు అందుకోవడంతో పాటు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. దానితో అందరిలో పుష్ప 2 మూవీ పై ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక పుష్ప 2 మూవీ గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి బాక్సాఫిస్ వద్ద అంచనాలు అందుకుని పెద్ద సంచలనం సృష్టించింది. తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ మరింత బాగా ఆడింది. ఇండియా వైడ్ అత్యధిక గ్రాస్ అందుకున్న మూవీగా నార్త్ లో టాప్ లో నిలిచింది పుష్ప 2 మూవీ.
అల్లు అర్జున్ పాత్ర విశేషాలు
ఇక ఈ మూవీలో కూడా మరొక్కసారి తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు అల్లు అర్జున్. ఇక ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్ తో పాటు ఆయనతో కలిసి సామ్ సి ఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది.
అయితే పుష్ప 2 సీక్వెల్ అయిన పుష్ప 3 మూవీ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అనేది ప్రస్తుతం అందరిలో ఎంతో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అల్లు అర్జున్ రెండు సినిమాలు కమిట్ అయ్యారు. మరోవైపు త్వరలో రామ్ చరణ్ తో ఒక మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నారు సుకుమార్.
ఫస్ట్ లుక్, టీజర్, మరియు ట్రైలర్ వివరాలు
కాగా వారిద్దరి కమిట్మెంట్స్ పూర్తి అయిన అనంతరం మేము పుష్ప 3 ది రాంపేజ్ మూవీని ప్రారంభిస్తాం, అలానే మూవీని వీలైనంత వరకు 2027లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తాం అని నిర్మాతలు ఇటీవల ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ తెలిపారు.
ఇక పుష్ప 1, పుష్ప 2 సినిమాల్లో నటించిన అనసూయ భరద్వాజ్, రావు రమేష్, సునీల్, తదితరులు ఇందులో కూడా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అయితే పక్కాగా పుష్ప 3 మూవీ ఎప్పుడు మొదలవుతుంది, ఇందులో స్టార్ కాస్టింగ్ ఇంకా ఎవరెవరు నటిస్తారు అనేది మొత్తం తెలియాలి అంటే మరొక ఏడాదికి పైగా వెయిట్ చేయాల్సిందే.
What's Your Reaction?






