Interesting Update About Prabhas’ Salaar 2 – Fans Can’t Keep Calm
A new update on Prabhas’ Salaar 2 has fans excited. Here’s what’s officially revealed about the sequel to the blockbuster.

టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మొత్తం రెండు సినిమాలు చేస్తున్నారు. అయితే వాటిలో ఒక సినిమా ది రాజా సాబ్ అతి త్వరలో ఆడియన్స్ ముందుకి రానుంది. ఈశ్వర్ మూవీతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ అక్కడి నుండి పలు సక్సెస్ లతో టాలీవుడ్ లో మంచి క్రేజ్, మార్కెట్ తో కొనసాగారు.
దాదాపుగా పన్నెండేళ్ల క్రితం రచయిత కొరటాల శివ దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన సినిమా మిర్చి. ప్రభాస్ తో కొరటాల తీసిన ఈ సినిమా అప్పట్లో పెద్ద విజయాన్ని అందుకుని హీరోగా ప్రభాస్ కి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. యువి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క శెట్టి, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ గా నటించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.
సలార్ 2కి సంబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్ – ప్రభాస్ ఫ్యాన్స్ లో హుషారు
దాని తరువాత దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి రెండు సినిమాల్లో ప్రభాస్ హీరోగా నటించారు. ఆర్కా మీడియా బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఎంతో భారీ ఖర్చుతో నిర్మించిన ఈ సినిమాలు రిలీజ్ తరువాత ఒక దానిని మించి మరొకటి ఎంతో గొప్ప సంచలన విజయాలు అందుకుని టాలీవుడ్ సినిమా కీర్తిని హాలీవుడ్ వరకు వెలుగెత్తి చాటాయి.
దర్శకుడు రాజమౌళి అద్భుత దర్శకత్వ ప్రతిభ తో పాటు ఈ సినిమాల్లో రెండు పాత్రల్లో నటించిన ప్రభాస్, తన వండర్ఫుల్ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్నారు. ఆ సినిమాల భారీ సక్సెస్ తో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా గొప్ప ఇమేజ్ ని మార్కెట్ ని సొంతం చేసుకున్న ప్రభాస్ ఆ తరువాత యువి క్రియేషన్స్ బ్యానర్ ఫై సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో మూవీ చేసారు.
శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించిన ఆ సినిమా కూడా పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయి ఏడాదిన్నర క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ సాధించింది. ఆ తరువాత రాధాకృష్ణ దర్శకత్వంలో గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ సంస్థలు నిర్మించిన రాధేశ్యామ్ మూవీ మూవీ చేశారు ప్రభాస్.
సలార్ సీక్వెల్ లో మాస్ ఎలిమెంట్స్ డబుల్ కావచ్చట
కొన్నేళ్ల క్రితం యూరోప్ లో జరిగిన ఒక వాస్తవ లవ్ స్టోరీ కి రూపంగా ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా దర్శకుడు రాధాకృష్ణ ఈ మూవీని తెరకెక్కించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు, భాగ్యశ్రీ, షాషా ఛత్రి, మలయాళ నటుడు జయరాం, కమెడియన్ ప్రియదర్శి, సచిన్ ఖేడేకర్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేసారు.
మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన రాధేశ్యామ్ మూవీ బాగానే విజయం అందుకుంది. రెట్రో లవ్ స్టోరీగా సాగిన ఈ మూవీలో ప్రభాస్ రోల్ అందరినీ ఆకట్టుకుంది. ఇక దీని తోపాటు మరోవైపు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఇతిహాస గాథ రామాయణం స్పూర్తితో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాలో కూడా ప్రభాస్ నటించారు.
ఇందులో ప్రభాస్ రాఘవ పాత్రలో నటించగా బాలీవుడ్ ప్రఖ్యాత నటుడు సైఫ్ ఆలీ ఖాన్ లంకేశ్ పాత్ర చేసారు. ప్రముఖ మ్యూజికల్ కంపెనీ టి సిరీస్ అధినేత టి భూషణ్ కుమార్ నిర్మాతగా నాలుగు వందల కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా పై అందరిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
రిలీజ్ అనంతరం ఆదిపురుష్ బాగానే సక్సెస్ అందుకుంది. ఇక దీని తోపాటు కెజిఎఫ్ సినిమాల దర్సకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే భారీ మాస్, యాక్షన్ కమర్షియల్ మూవీ కూడా చేసారు ప్రభాస్. తొలిసారిగా ప్రభాస్ కి జోడీగా శృతి హాసన్ నటించిన ఈ సినిమాని కన్నడ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ వారు ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించారు.
ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. ముఖ్యంగా ప్రభాస్ చేసిన యాక్షన్ సీన్స్, పవర్ఫుల్ డైలాగ్స్, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన తీరు అందరినీ ఆకట్టుకున్నాయి. భారీ నిర్మాణ విలువలతో పాటు రవి బస్రూర్ మ్యూజిక్, భువన గౌడ ఫోటోగ్రఫి, ముఖ్యంగా వరదరాజ మన్నార్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనబరిచిన నటన కూడా అందరినీ అలరించింది.
ఇక ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజీ తో పాటు త్వరలో సందీప్ రెడ్డితో స్పిరిట్ సినిమాలు చేయనున్నారు ప్రభాస్. ఆపైన మహానటి దర్శకుడు నాగ అశ్విన్ తో ప్రభాస్ చేసిన భారీ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ కల్కి 2898 ఏడి కూడా విడుదలైన బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ ప్రభంజనం సృష్టించింది.
అయితే వీటి అనంతరం సలార్ 2, అలానే కల్కి 2 సినిమాలు చేయనున్నారు ప్రభాస్. ఈ సినిమాల పై దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ 2 ని మరింత గ్రాండ్ గా తీసేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారట.
ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబో మళ్లీ రేపే సంచలనం
అయితే కొద్దిభాగం దీని యొక్క షూట్ ఫస్ట్ పార్ట్ తోపాటు పూర్తి అయింది. కాగా ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్ ని మించి ఎంతో అదిరిపోతుందని, అండర్ వరల్డ్ డాన్ గా ఎంతో వైలెంట్ గా సాగే తన పాత్ర కోసం ప్రభాస్ త్వరలో మరింత బల్క్ గా బాడీని పెంచనున్నారని టాక్.
సలార్ పార్ట్ 1 తో పోలిస్తే ఇందులో యాక్షన్ ఎలివేషన్ సీన్స్ మరింతగా గూస్ బంప్స్ తెప్పించే రేంజ్ లో డిజైన్ చేసి సిద్ధం చేశారట. ఇక ఖర్చు పరంగా కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాత విజయ్ కిరాగందూర్ సలార్ 2 ని ఎంతో గ్రాండ్ గా నిర్మించేందుకు సిద్దమవుతున్నారట.
కాగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సలార్ 2 లో ఊహించలేని పలు ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే తన చేతిలో ఉన్న సినిమాలు పూర్తి అయిన వెంటనే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సలార్ 2 యొక్క షూట్ లో జాయిన్ అవుతారని నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ తెలిపారు.
మరోవైపు ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక భారీ మాస్ యాక్షన్ మూవీ తీస్తున్న సంగతి తెలిసిందే. అది పూర్తి అయిన వెంటనే సలార్ పై పూర్తిగా ఆయన ఫోకస్ చేస్తారట. త్వరలో అని వివరాలు అధికారికంగా వెళ్ళకవుతాయని టాక్.
What's Your Reaction?






