Shocking TRP Ratings for Allu Arjun’s Pushpa 2 – Breaks All Records!
Pushpa 2 starring Allu Arjun registers shocking TRP numbers on TV. Check out the record-breaking viewership stats here

టాలీవుడ్ పాన్ ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇటీవల సుకుమార్ తీసిన మాస్ యాక్షన్ ఎంటెర్టైనర్ సినిమా పుష్ప 2 ది రూల్ . ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో రావు రమేష్, జగపతి బాబు, ఫహాద్ ఫాసిల్, బ్రహ్మాజీ, అనసూయ భరద్వాజ్ తదితరులు నటించారు.
పుష్ప 2కి రికార్డు TRP – అల్లు అర్జున్ మళ్లీ మేజిక్ చేశాడా?
అంతకముందు ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయం అందుకున్న పుష్ప ది రైజ్ మూవీకి ఇది సీక్వెల్ అనేది తెలిసిందే. అయితే పుష్ప 1 భారీ విజయం అందుకోవడంతో పాటు అందులో అద్భుతంగా నటించిన అల్లు అర్జున్ ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. దానితో అందరిలో పుష్ప 2 పై ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే రిలీజ్ అనంతరం అంచనాలు అందుకుని పుష్ప 2 మూవీ భారీ విజయం సొంతం చేసుకుంది. ఓవరాల్ గా రూ. 1800 కోట్లకు పైగా గ్రాస్ ని సొంతం చేసుకున్న ఈ మూవీలో మరొక్కసారి తన స్టన్నింగ్ పెర్ఫార్మన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు అల్లు అర్జున్. కాగా పుష్ప 2 మూవీ అటు నార్త్ ఆడియన్స్ ని సైతం విశేషంగా ఆకట్టుకుని హిందీలో అత్యధిక నెట్ కలెక్షన్ అందుకున్న మూవీగా ఇండియా వైడ్ పెద్ద సంచలనం క్రియేట్ చేసింది.
ఇక పుష్ప 2 మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్ తో పాటు సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్,గ్రాండియర్ విజువల్స్, రష్మిక మందన్న ఆకట్టుకునే అందం, అభినయం, సుకుమార్ ఆకట్టుకునే కథ, కథనాలు టేకింగ్ వంటివి కూడా మూవీ యొక్క భారీ విజయానికి కారణం అయ్యాయి.
టీవీ ప్రసారంలో పుష్ప 2 TRP ఎంత వచ్చిందంటే!
ఇక అటు థియేటర్స్ లో అదరగొట్టిన ఈ మూవీ అనంతరం ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చి అక్కడ కూడా విశేషమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే విషయం ఏమిటంటే, ఇటీవల ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానెల్ స్టార్ మాలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రదర్శితం అయిన పుష్ప 2 మూవీ యొక్క టిఆర్పి ఏ స్థాయిలో వస్తుంది అనేది అందరిలో చర్చనీయాంశంగా మారింది.
కాగా లేటెస్ట్ టాలీవుడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మూవీ రూరల్, అర్బన్ ఏరియాస్ అన్నిట్లో కలుపుకుని ఓవరాల్ గా 12.61 వరకు టీఆర్పీ అందుకున్నట్లు చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయి రేటింగ్ ని బట్టి చూస్తే అర్బన్ లో 12.61 అలానే అర్బన్ + రురల్ లో కలిపి 11.54 రేటింగ్ ని పుష్ప 2 మూవీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా నేడు ఎక్కువగా ప్రేక్షకాభిమానులు యూట్యూబ్, ఇతర యాప్స్, ఓటిటి మాద్యమాలతో కాలం గడుపుతున్న సంగతి తెల్సిందే. అలానే మరోవైపు దేశవ్యాప్తంగా అందరినీ ఐపీఎల్ అలరిస్తోంది.
పుష్ప ఫ్రాంచైజ్ లో ఇది వరకెన్నడూ లేని విజయమా?
కాగా ఇటువంటి సమయంలో కూడా పుష్ప 2 టెలివిజన్ ప్రీమియర్ పరంగా ఈ స్థాయి టిఆర్పి రేటింగ్ అందుకోవడం అనేది నిజంగా పెద్ద షాకింగ్ విషయం అంటున్నాయి సినీ వర్గాలు.
ముఖ్యంగా ఇటు తెలుగు రాష్టాలతో పాటు యావత్ భారత దేశం మొత్తం కూడా పుష్ప మూవీ ద్వారా తన యొక్క ఆకట్టుకునే యాక్టింగ్ తో ఆ విధంగా ఎందరో ఆడియన్స్, ఫ్యాన్స్ మనస్సులో అల్లు అర్జున్ గొప్ప ముద్రవేశారని తెలుస్తోంది.
ఇక ఇప్పటివరకు తెలుగు సినిమాల పరంగా అత్యధిక టిఆర్పి రేటింగ్ ని అలవైకుంఠపురములో మూవీ దక్కించుకోగా అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తీసిన సరిలేరు నీకెవ్వరు మూవీ రెండవ స్థానంలో నిలిచింది. అనంతరం ఇటీవల వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తీసిన సంక్రాంతికి వస్తున్నాం మూడవ స్థానంలో నిలిచింది. మరి దీనిని బట్టి పుష్ప 2 నాలుగవ స్థానంలో నిలిచిందని తెలుస్తోంది. దీనితో తదుపరి రానున్న పుష్ప 3 మూవీ పై అందరిలో మరింత భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
What's Your Reaction?






