Prabhas The RajaSaab Teaser: Horror Comedy Entertainer Glimpse Shocks Fans

The teaser of Prabhas' upcoming horror comedy entertainer 'The RajaSaab' is finally out, offering fans a powerful glimpse packed with action and style

Prabhas The RajaSaab Teaser: Horror Comedy Entertainer Glimpse Shocks Fans

తెలుగు స్టార్ యాక్టర్ ప్రభాస్ (Prabhas) హీరోగా ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాల్లో ది రాజాసాబ్ (The Rajasaab) ఒకటి. అలానే దానితో పాటు హను రాఘవపూడి తీస్తున్న మరొక మూవీ కూడా ఉంది. అలానే త్వరలో సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మూవీ కూడా చేయనున్నారు ప్రభాస్. కాగా ఈ మూడు క్రేజీ ప్రాజక్ట్స్ పై రెబల్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. 

ఇటీవల చివరిగా నాగ అశ్విన్ తీసిన భారీ పాన్ ఇండియన్ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ కల్కి 2898 ఏడి (Kalki 2898 AD) ద్వారా పెద్ద సక్సెస్ అందుకున్న ప్రభాస్ ఈ మూడు సినిమాల పై ఎంతో బాగా దృష్టి పెట్టారు. అయితే వీటిలో ముందుగా ది రాజాసాబ్ మూవీ ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. 

Prabhas The RajaSaab Teaser Release

వాస్తవానికి ఎప్పుడో ప్రారంభం అయిన ఈ మూవీ యొక్క షూటింగ్ ఇటీవలస కొన్ని నెలలుగా ఎంతో సైలెంట్ గా జరిగింది. కాగా ఈ మూవీని మారుతీ తెరకెక్కించగా ప్రముఖ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు గ్రాండ్ గా నిర్మించారు. అలానే ఇందులో ప్రభాస్ కి జోడీగా టాలీవుడ్ యువ అందాల నటీమణులు ముగ్గురు నటిస్తున్నారు. 

వారు మాళవిక మోహనన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) తో పాటు రిద్ది కుమార్ (Riddhi Kumar). ఈ ముగ్గురికీ సినిమాలో మంచి ప్రాధాన్యత కలిగిన పాత్రలు ఉన్నాయట. ఇక ఈ మూవీకి రాక్ స్టార్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల కొన్నేళ్లుగా ప్రభాస్ నుండి బాహుబలి 2, సాహో, సలార్, రాధేశ్యామ్, ఆదిపురుష్, కల్కి 2898 ఏడి డిఫరెంట్ జానర్ మూవీస్ రాగా ది రాజసాబ్ ద్వారా వింటేజ్ ప్రభాస్ ని ఫ్యాన్స్, ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు దర్శకుడు మారుతీ ఈ కథని హారర్ కామెడీ జానర్ లో రాసుకున్నారు.

ప్రభాస్ ది రాజాసాబ్ టీజర్ విడుదల

ఆ విధంగా ప్రారంభం అయిన ఈ మూవీ మంచి అంచనాలు సంతరించుకుంది. అంతకముందు గోపీచంద్ తో మారుతీ తీసిన పక్కా కమర్షియల్ మూవీ ఫ్లాప్ కావడంతో ది రాజాసాబ్ మూవీ తీయగలనో లేదో అనే అపనమ్మకం తనలో ఏర్పడడంతో హీరో ప్రభాస్ అన్నివిధాలా తనను ప్రోత్సహించినట్లు చెప్పారు దర్శకుడు మారుతీ. 

అయితే ఇప్పటికే ది రాజాసాబ్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ తో పాటు మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై బాగా అంచనాలు ఏర్పరిచాయి. ఇక నేడు ఈ మూవీ నుండి టీజర్ ని రిలీజ్ చేశారు. ముఖ్యంగా టీజర్ ని పూర్తిగా పరిశీలిస్తే ప్రభాస్ స్టైలిష్ వింటేజ్ లుక్స్ తో పాటు ఆయన పలికిన డైలాగ్స్, ఎంటర్టైన్మెంట్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 

అలానే టీజర్ లో విజువల్స్ తో పాటు విఎఫ్ఎక్స్ కూడా బాగుంది. ఇక థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు హీరోయిన్స్ సహా అందరి పాత్రలు బాగున్నాయి. ఓవరాల్ గా అందరినీ ఆకట్టుకుంటూ ప్రస్తుతం ది రాజాసాబ్ మూవీ టీజర్ మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంటోంది. ఇంకా ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఒక కీలక పాత్ర చేస్తున్నారు. 

The RajaSaab Teaser Review

కామెడీ హర్రర్ జానర్ అనేది ఇటీవల బాలీవుడ్ సహా అన్ని మూవీ ఇండస్ట్రీల్లో మంచి క్రేజే ఏర్పరుచుకుంది. కొన్నాళ్లుగా ఆ జానర్ లో రిలీజ్ అయిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన విషయం తెల్సిందే. అందుకే అదే జానర్ ఎంచుకున్న దర్శకుడు మారుతీ, ది రాజాసాబ్ మూవీని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా తెరకెక్కిస్తున్నట్లు టీజర్ ని బట్టి చూస్తే మనకు అర్ధం అవుతుంది. 

మాస్ ఎంటర్‌టైనర్‌గా ప్రభాస్ గ్లింప్స్ అదిరింది

కాగా గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) బావ అయిన సుధీర్ బాబుతో ప్రేమ కథా చిత్రం (Prema Kahta Chitram) అనే కామెడీ హర్రర్ మూవీ తీసి పెద్ద విజయం అందుకున్నారు మారుతీ. ఇక అందరు తనకు సపోర్ట్ గా నిలవడంతో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో ఇంత పెద్ద సినిమా తీయడం సాధ్యం అయిందని టీజర్ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ చెప్పారు మారుతీ. 

సంగీత దర్శకుడు ఎస్ థమన్ కూడా ది రాజాసాబ్ మూవీ కోసం ఎంతో కష్టపడ్డారని, త్వరలోనే మూవీ సాంగ్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేయడంతో పాటు ప్రమోషన్స్ గురించి కూడా ఆలోచన చేస్తున్నట్లు చెప్తున్నారు. మూవీలో థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మరొక రేంజ్ లో ఉంటుందని అన్నారు. 

హైదరాబాద్ లో ఎంతో గ్రాండ్ లెవెల్లో తెలుగు మీడియా తో పాటు నేషనల్ మీడియా అందరినీ కూడా పిలిచి ఎంతో వైభవంగా ది రాజాసాబ్ టీజర్ ఈవెంట్ ని నిర్వహించింది టీమ్. ఓవరాల్ గా టీజర్ కి బాగా రెస్పాన్స్ వస్తుండడంతో తప్పకుండా డిసెంబర్ 5న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానున్న మూవీ భారీ విజయం ఖాయం అని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 

The RajaSaab Glimpse Youtube

మరోవైపు హీరో ప్రభాస్ తో పాటు నిర్మాతలు టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల కూడా మూవీ పై ఎంతో నమ్మకంగా ఉన్నారు. దర్శకుడు మారుతీ తెరకెక్కించిన తీరు ఎంతో నచ్చిందని, ప్రభాస్ ని ఆయన ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎలాగైతే చూడాలని కోరుకుంటున్నారో అదే విధంగా దర్శకుడు మారుతీ కథ, కథనాలు, ఆయన పాత్ర రాసుకుని తెరకెక్కిచినట్లు నిర్మాతలు మాట్లాడుతూ చెప్పారు. 

అయితే ది రాజాసాబ్ మూవీ యొక్క నిడివి 3 గంటలు పైగా ఉంటుందని ఇటీవల పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవడంతో దాని పై దర్శకుడు మారుతీ క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ అంత ఎక్కువ లేకుండా తక్కువ రన్ టైంతోనే మూవీని ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. 

కథానాయిక, విడుదల తేదీ, అభిమానుల స్పందన

హీరోయిన్స్ ముగ్గురు పాత్రలతో పటు నటుడు సంజయ్ దత్ కూడా ది రాజాసాబ్ మూవీలో ఎంతో బాగా పెర్ఫార్మ్ చేసారని, ఇకపై ఆయనకు సౌత్ లో మరింతగా అవకాశాలు పెరగడం ఖాయం అన్నారు. ఇప్పటికే కన్నడ మూవీ కెజిఎఫ్ పార్ట్ 2 లో అధీగా నెగటివ్ పాత్ర చేసి నటుడు సంజయ్ దత్ సౌత్ ఆడియన్స్ ని సైతం ఎంతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 

అయితే టీజర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేయానికి ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేయబడ్డ కొన్ని థియేటర్స్ లో ప్రత్యేకంగా ప్రదర్శించగా పలువురు ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఎంజాయ్ చేసారు. మరి రిలీజ్ తరువాత ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ మూవీ పెద్ద విజయం అందుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా మా Telugu Movie Media టీమ్ కోరుకుంటోంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow