Salaar 2 Shooting Start Date Full Details

Salaar 2 shooting start date confirmed. Prabhas returns with action-packed sequel. Check full update.

Salaar 2 Shooting Start Date Full Details

టాలీవుడ్ స్టార్ నటుడు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నుండి సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా ఎన్నో అంచనాలు ఉంటాయి. ఇటీవల నాగ అశ్విన్ తీసిన భారీ ప్రతిష్టాత్మక సైన్స్ ఫిక్షన్ జానర్ ఎంటర్టైనర్ మూవీ కల్కి 2898 మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి అతి పెద్ద బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు ప్రభాస్. ఇక ప్రస్తుతం ఓవైపు రెండు సినిమాల యొక్క షూట్స్ తో బిజీ బిజీగా కొనసాగుతున్నారు ప్రభాస్. 

సలార్ 2 షూటింగ్ ఎప్పుడు మొదలవుతోంది?

అందులో ఒకటి మారుతీ తీస్తున్న హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ది రాజా సాబ్ కాగా మరొకటి లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా హను రాఘవపూడి తీస్తున్న మూవీ. ఈ రెండు మూవీస్ పై ప్రభాస్ ఫ్యాన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ది రాజా సాబ్ మూవీలో వింటేజ్ ప్రభాస్ ని చూస్తారని, అలానే మంచి కామెడీ తో పాటు ప్రభాస్ మార్క్ ఎంటర్టైన్మెంట్, స్టైలిష్ ఫైట్స్ యాక్షన్ సీన్స్ కూడా ఈ మూవీలో ఉంటాయట. 

ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఇక హను రాఘవపూడి తీస్తున్న మూవీలో ప్రభాస్ కి జోడీగా ఇమాన్వి నటిస్తుండగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ సీతారామం మాదిరిగా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని టాక్. 

అలానే వీటితో పాటు ఆనిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తీయనున్న యాక్షన్ ఎంట్రటైనర్ మూవీ స్పిరిట్ షూట్ లో కూడా జాయిన్ అవ్వనున్నారు ప్రభాస్. కాగా ఈ మూవీ పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరిలో కూడా ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. 

కాగా ఈ మూవీ కోసం ఇప్పటికే పలువురు కీలక పాత్రధారుల యొక్క ఎంపిక జరుగుతోంది. మరోవైపు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అండ్ టీమ్ సినిమా కోసం విదేశాల్లో పలు ప్రత్యేక అద్భుతమైన లొకేషన్స్ ని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. కాగా ఒక హాలీవుడ్ నటుడితో పాటు మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ స్పిరిట్ మూవీలో కీలక పాత్రల్లో నటించనున్నారు అనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. 

సలార్ 2 లో ప్రభాస్ పాత్రలో నూతన కోణం

అయితే వీటికి సంబంధించి టీమ్ నుండి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ మాత్రం రావాల్సి ఉంది. ఆనిమల్ మూవీకి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన యువ సంగీత తరంగం హర్షవర్ధన్ రామేశ్వర్ స్పిరిట్ మూవీ కోసం ఇప్పటికే పలు మ్యూజిక్ సిట్టింగ్స్ తో సాంగ్స్ కంపోజింగ్ కూడా పూర్తి చేశారట. 

అలానే బాలీవుడ్ కి చెందిన ఒక అందాల కథానాయిక ఇందులో ప్రభాస్ కి జోడీగా నటించనున్నట్లు సమాచారం. అలానే ఇది ఒక సిన్సియర్ పోలీస్ అధికారి యొక్క కథ కాగా, ఆ పాత్ర కోసం ప్రభాస్ అతి త్వరలో పూర్తిగా కొత్త పద్దతిలో మేకోవర్ పరంగా సిద్ధం కానున్నారు. 

తన మార్క్ యాక్షన్ అంశాలతో పాటు ప్రభాస్ మార్క్ స్టైలిష్ అంశాలు అన్ని కలగలిపి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ యొక్క కథ, కథనాలు రాసుకున్నారట. టి సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ మూవీ ఈ ఏడాది చివర్లో పట్టాలెక్కి 2027 ప్రథమార్ధంలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. 

కాగా స్పిరిట్ మూవీకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో ఒక్కొక్కటిగా అధికారికంగా వెల్లడి కానున్నాయి. అయితే అసలు విషయం ఏమిటంటే, వీటి అనంతరం ఇటీవల ప్రభాస్ నటించి పెద్ద విజయాలు సొంతం చేసుకున్న సలార్ తో పాటు కల్కి 2 సినిమాలు కూడా ప్రారంభం కానున్నాయి. 

ఇప్పటికే ఫస్ట్ పార్ట్స్ షూటింగ్ సమయంలోనే ఆ రెండు సినిమాలు కూడా సెకండ్ పార్ట్స్ కి సంబంధించి కొంతమేర షూటింగ్ జరుపుకున్నాయి. అయితే పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సలార్ 2 కోసం కూడా దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతోఎదురుచూస్తున్నారు. 

సలార్ పెద్ద విజయం అందుకున్న విషయం తెలిసిందే. కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమాని కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించిన విషయం తెలిసిందే. అందులో మాస్ యాక్షన్ సీన్స్ తో పాటు హీరో ఎలివేషన్ సీన్స్ మరొక రేంజ్ లో ఉన్నాయి. 

వాటికి థియేటర్స్ లో ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది. కాగా అటువంటి మాస్ యాక్షన్ సీన్స్ సలార్ 2 లో చాలానే ఉన్నాయని టాక్. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ చేస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. అది పూర్తి కావడానికి మరొక ఏడాది వరకు టైం పెట్టె ఛాన్స్ ఉంది. 

ఈలోపు సలార్ 2 కి సంబంధించి బ్యాలెన్స్ స్క్రిప్ట్ వర్క్ అండ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని కూడా ప్రారంభించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని టాక్. అన్ని అనుకున్నట్లు జరిగితే సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో తీయనున్న స్పిరిట్ కొంతమేర షూటింగ్ అనంతరం సలార్ 2 కూడా పక్కాగా పట్టాలెక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. 

సలార్ 2 దర్శకుడి నుండి అధికారిక ప్రకటన

మరోవైపు మలయాళ నటుడు, దర్శకుడు అలానే సలార్ లో ప్రభాస్ స్నేహితుడిగా వార్ధరాజ్ మన్నార్ పాత్ర చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB29 లో నటిస్తున్నారు. ఇక అవి పూర్తి అయి పక్కాగా సలార్ సెట్స్ మీదకు వెళ్ళడానికి ఏడాది వరకు టైం పడుతుంది. 

అనంతరం వీలైనంత త్వరలో ఆ మూవీని పూర్తి చేసి ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేలా ఆ మూవీ టీమ్ ఇప్పటినుండే ప్రణాళికలు సిద్ధం చేస్తోందట. మరోవైపు ప్రభాస్ పాత్ర సలార్ 2 లో మరింత పవర్ఫుల్ గా ఉండనుందని అంటున్నారు. మొత్తంగా అయితే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆయన నుండి వరుస సినిమాలతో పెద్ద పండుగలు ఖాయమని తెలుస్తోంది. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow