Rajinikanth Coolie vs War 2: Big Box Office Clash Ahead
Rajinikanth’s Coolie movie set for massive box office clash with Hrithik Roshan and Jr NTR’s War 2. Check full details and release update.

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ప్రస్తుతం రెండు సినిమాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తీస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కూలీ మూవీ ఒకటి. ఇక ఈ మూవీలో అందాల కథానాయిక శృతి హాసన్, కన్నడ స్టార్ నటుడు ఉపేంద్రతో పాటు బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమీర్ ఖాన్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలు చేస్తుండగా అనిరుద్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్నారు.
ఈ మూవీ అనౌన్స్ మెంట్ దగ్గరి నుండి అందరిలో భారీ స్థాయి అంచనాలు కలిగి ఉంది. ఇక ఇటీవల కూలీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ టీజర్ తో పాటు ఫస్ట్ సాంగ్ అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. సన్ పిక్చర్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీని రజిని ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్నారని మూవీ టీమ్ చెపుతోంది.
Rajinikanth Coolie and War 2 Release Clash
మరోవైపు ఎన్టీఆర్ తో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తొలిసారిగా చేస్తున్న మూవీ వార్ 2. కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయి పెద్ద విజయం సొంతం చేసుకున్న బాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ వార్ కి ఇది సీక్వెల్. దీనిని యువ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తుండగా బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఎంతో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.
Hrithik Roshan and Jr NTR in War 2 Hype
కేవలం రెండు పాటలు కొద్దిపాటి సీన్స్ మినహా తమ మూవీ మొత్తం పూర్తి అయిందని, తొలిసారిగా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉందని తాజాగా ఒక కార్యక్రమంలో భాగంగా హృతిక్ రోషన్ మాట్లాడుతూ తెలిపారు. అయితే అసలు విషయం ఏమిటంటే, రజినీకాంత్ కూలీ అలానే ఎన్టీఆర్ హృతిక్ ల వార్ 2 రెండూ కూడా ఈ ఏడాది ఆగష్టు 14 న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్నాయి.
వార్ 2 యొక్క రిలీజ్ డేట్ ఇటీవల నిర్మాతలు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా అనౌన్స్ చేయగా నేడు కూలీ మూవీ టీమ్ కూడా అఫీషియల్ రిలీజ్ డేట్ ని ప్రకటించింది. దీనితో ఇండియాలోని పలువురు ఫ్యాన్స్ సినీ లవర్స్ లో ఎంతో క్రేజ్ కలిగిన ఈ రెండు ప్రాజక్ట్స్ ఒకే రోజున థియేటర్స్ లోకి వస్తుండడంతో వీటిలో ఏది ఎంతమేర విజయం సొంతం చేసుకుంటుంది అనేటువంటి ఆసక్తిని ఇప్పటి నుండే వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి రెండు సినిమాలకు తెలుగు, హిందీతో పాటు పలు ఇతర సౌత్ భాషల్లో భారీ క్రేజ్ నెలకొని ఉంది. అలానే వీటి యొక్క ప్రీరిలీజ్ బిజినెస్ కూడా గ్రాండ్ గా జరిగే అవకాశం ఉంది. మరి ఈ రెండు క్రేజీ సినిమాల్లో ఏది ఏస్థాయిలో ఆడియన్స్ ని మెప్పిస్తుంది, ఏది ఎంతమేర విజయం సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరొక మూడున్నర నెలల వరకు ఓపిక పట్టాల్సిందే.
Box Office Predictions and Fan Reactions
ఇక ఈ రెండు సినిమాల యొక్క థియేటర్స్ కేటాయింపుల విషయమై త్వరలో అన్ని పనులు ప్రారంభం కానున్నాయట. మొత్తంగా అటు కూలీ ఇటు వార్ 2 రెండూ కూడా విజయవంతం అయి భారతీయ సినిమా ఖ్యాతిని మరింతగా పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
What's Your Reaction?






