Prabhas Age, Birthday, Height, and Full Biography 2025
Know the real age of Prabhas, his birthday, height, family details, and full biography in 2025. Get latest updates on the Rebel Star

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ గా వరుసగా పలు సినిమాలతో అలానే సక్సెస్ లతో కొనసాగుతున్న స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇక కెరీర్ పరంగా తన పెద్ద నాన్న కృష్ణంరాజు నట వారసుడిగా తొలిసారిగా ఎన్నో ఏళ్ళ క్రితం ఈశ్వర్ సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చారు ప్రభాస్.
ఆ మూవీ విజయం అనంతరం మూడవ సినిమా వర్షం ద్వారా బిగ్గెస్ట్ హిట్ కొట్టారు ప్రభాస్. ఆ మూవీలో త్రిష హీరోయిన్ గా నటించగా శోభన్ తెరకెక్కించారు. అనంతరం ఎస్ ఎస్ రాజమౌళి తీసిన ఛత్రపతి, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బుజ్జిగాడు సినిమాలతో మరిన్ని విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు ప్రభాస్.
ప్రభాస్ వయసు మరియు జన్మదిన వివరాలు
ఆ తరువాత పాన్ ఇండియన్ మూవీ బాహుబలి 1 తో దేశవ్యాప్తంగా ఆడియన్స్ యొక్క క్రేజ్ అందుకున్నారు. అనంతరం దానికి సీక్వెల్ గా రూవుపొందిన బాహుబలి 2 మూవీ మరింత భారీ విజయంతో దేశవ్యాప్తంగా ప్రభాస్ క్రేజ్, పేరు మారుమ్రోగింది. ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలతో మరింత పెద్ద మార్కెట్ తో దూసుకెళ్ళసాగారు ప్రభాస్.
ఇక ఇటీవల నాగ అశ్విన్ తీసిన కల్కి 2898 ఏడి, ప్రశాంత్ నీల్ తీసిన సలార్, ఓం రౌత్ తీసిన ఆదిపురుష్ సినిమాల ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు ప్రభాస్. అయితే వీటిలో సలార్, కల్కి 2898 ఏడి సినిమాలు మరింత భారీ విజయాలు సొంతం చేసుకుని ప్రభాస్ మార్కెట్ ని మరింత పెంచాయి.
ప్రభాస్ జీవిత చరిత్ర 2025
ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా పెద్దగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ కొనసాగుతున్న హీరో ప్రభాస్. మారుతీ తీస్తున్న ది రాజా సాబ్, హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న మరొక సినిమా, ఈ రెండు చేస్తున్న ప్రభాస్, త్వరలో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న స్పిర్తి మూవీ కూడా ఆరంభించనున్నారు. ఇక వీటి తరువాత కల్కి 2, సలార్ 2 సినిమాలు కూడా తెరకెక్కనున్నాయి.
అలానే వీటితో పాటు హను మాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో బకాసుర, కోలీవుడ్ యంగ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో మరొక సినిమా కూడా ప్రభాస్ లైనప్ లో ఉన్నాయి. ఇక కెరీర్ బిగినింగ్ నుండి తనకు వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుని తన ఆకట్టుకునే నటనతో ఎందరో ఫ్యాన్స్ యొక్క మనసుసు చూరగొన్న ప్రభాస్ వయసు ప్రస్తుతం 45 ఏళ్ళు.
ఇక 23 అక్టోబర్ 1979 న జన్మించారు ప్రభాస్. తండ్రి సూర్యనారాయణ రాజు, పెదనాన్న కృష్ణంరాజు అంటే ప్రభాస్ కు అమితమైన ప్రేమ. మొదటి నుండి తాను వారిద్దరి నుండి ఎంతో నేర్చుకున్నానని, నటుడిగా ఎదుగుతున్న సమయంలో వారిద్దరూ తనని చూసి ఎంతో ఆనందించేవారని అంటారు ప్రభాస్.
ప్రభాస్ ఎత్తు, కుటుంబం మరియు ప్రొఫెషనల్ ప్రయాణం
అయితే తనకు ఇష్టమైన ప్రభాస్ ని హాలీవుడ్ సినీ తెరపై చూడాలని భావించిన కృష్ణంరాజు ఇటీవల అనుకోకుండా కాలం చేయడం ప్రభాస్ ని వారి కుటుంబాన్ని ఒక్కసారిగా తీవ్ర విషాదంలోకి నెట్టింది. అనంతరం మెల్లగా కోలుకున్న కృష్ణంరాజు కుటుంబం త్వరలో ప్రభాస్ కి మంచి అమ్మాయిని చూసి వివాహం చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్.
అయితే ఆయన వివాహం కనుక కుదిరితే ఫ్యాన్స్ తో పాటు అందరికీ తప్పకుండ తెలియచేస్తాం అని, దయచేసి ఆ విషయమై తప్పుడు కథనాలు ప్రచారం చేయవద్దని పలు మార్లు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇక రానున్న ప్రభాస్ పుట్టినరోజు నాడు ఈసారి ది రాజా షబ్ మూవీ ఆడియన్స్ ముందుకి వచ్చే ఛాన్స్ ఉందని టాక్.
త్వరలో ఆ మూవీ యొక్క అఫీషియల్ రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు. మొదటి నుండి నటుడిగా ఎంతో గొప్ప పేరుతో కొనసాగుతున్నప్పటికీ ఎంతో ఒదిగి ఉండే మంచి మనస్తత్వం కలిగిన ప్రభాస్ సినిమా అవకాశం కోసం పలువురు నటీనటులు ఎదురు చూస్తుంటారు. మరి రాబోయే రోజుల్లో ఆయన నటుడిగా మరింత మంచి పేరు, విజయాలతో దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
What's Your Reaction?






