Upcoming Telugu Movies 2025 – Tollywood New Releases
Check the full list of Upcoming Telugu Movies 2025 with release dates, star cast, trailers, and Tollywood new film updates for fans and movie lovers

టాలీవుడ్ లో ఈ ఏడాది ఇప్పటికే గడచిన తొమ్మిది నెలల్లో పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. అయితే ఎప్పటివలె అందులో కొన్ని సక్సెస్ కాగా మరికొన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక ఈ ఏడాది అనగా 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సినిమాల్లో Victory Venkatesh హీరోగా రూపొందిన Sankranthiki Vasthunam మూవీ అతిపెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి Sankranthiki Vasthunam Total Collection Worldwide ఓవరాల్ గా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ ని సొంతం చేసుకుంది.
అదే సమయంలో రిలీజ్ అయిన మెగాపవర్ స్టార్ Ram Charan హీరోగా తెరకెక్కిన Game Changer బాక్సాఫీస్ వద్ద బోల్తా కొత్తగా Balakrishna హీరోగా తెరకెక్కిన Daaku Maharaaj మాత్రం బాగానే విజయవంతం అయింది. ఆ తరువాత Naga Chaitanya హీరోగా Sai Pallavi హీరోయిన్ గా చందూ మొండేటి తీసిన Thandel కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సొంతం చేసుకుంది. వాటితో పాటు Mad Square, Court సినిమాలు కూడా భారీ విజయాలు సొంతం చేసుకున్నాయి.
అప్‌కమింగ్ తెలుగు మూవీస్ 2025 లిస్ట్
ఇక ఇటీవల ఆగష్టు 14న ఒకే రోజున రిలీజ్ అయిన NT Rama Rao Jr, Hrithik Roshan తొలిసారిగా కలిసి యాక్ట్ చేసిన భారీ Bollywood మూవీ War2 అలానే సూపర్ స్టార్ Rajinikanth హీరోగా తెరకెక్కిన Coolie సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో War2 యావరేజ్ గా అలానే Coolie ఎబోవ్ యావరేజ్ గా నిలిచాయి.
అయితే ఇటీవల యువ నటుడు Teja Sajja హీరోగా తెరకెక్కిన Mirai అలానే Bellamkonda Sai Srinivas నటించిన Kishkindhapuri సినిమాలు కూడా ఒకే రోజున రిలీజ్ అయ్యాయి. కాగా ఇవి రెండూ కూడా ప్రస్తుతం Tollywood Boxoffice Collections కుమ్మేస్తున్నాయి. అయితే వీటి అనంతరం త్వరలో పలు పెద్ద, చిన్న సినిమాలు ఈ ఏడాది అలానే వచ్చే ఏడాది రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మరి ఇంతకీ అవేమిటి అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం.
Bhadrakali :
తన తొలి సినిమా Bichagadu తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన తమిళ నటుడు కం సంగీత దర్శకుడు అయిన Vijay Antony హీరోగా తాజాగా రూపొందిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ Bhadrakali. ఈ మూవీని అరుణ్ ప్రభు పురుషోత్తమన్ తెరకెక్కించగా వాగై చంద్రశేఖర్, సునీల్ కృపాలాని, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, రిని బాట్, రియా జీతూ కీలక పాత్రలు చేసారు. ఇక ఈ మూవీ విజయ్ ఆంటోనీ కెరీర్ 25వ మూవీ కావడం విశేషం.
దీనిని అన్ని వర్గాల ఆడియన్సు ని ఆకట్టుకునేలా ఎంతో జాగ్రత్తగా దర్శకుడు అరుణ్ ప్రభు తెరకెక్కించినట్లు ఇటీవల ప్రెస్ మీట్ లో భాగంగా తెలిపారు విజయ్ ఆంటోనీ. ఈ మూవీని విజయ్ స్వయంగా నిర్మించడంతో పాటు సంగీతం కూడా సమకూర్చారు. తెలుగులో ఈ మూవీని Rana Daggubati కి Spirit Media చెందిన Asian Suresh Entertainment సంస్థలు గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండగా ఈ మూవీ సెప్టెంబర్ 19న తెలుగుతో పాటు తమిళ్ లో కూడా రిలీజ్ కానుంది. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీతో Vijay Antony ఎంతమేర సక్సెస్ అందుకుంటారో చూడాలి.
OG :
ఇటీవల Hari Hara Veera Mallu మూవీ ద్వారా ఆడియన్సు ముందుకి వచ్చి ఊహించని విధంగా బిగ్గెస్ట్ డిజాస్టర్ చవిచూశారు పవర్ స్టార్ PawanKalyan. అయితే ఆ మూవీ అనంతరం తాజాగా సుజీత్ తో ఆయన చేస్తున్న మాస్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ OG (They Call Him OG). ఈ మూవీ పై మొదటి నుండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయి అంచనాలు నెలకొని ఉన్నాయి. S Thaman సంగీతం అందిస్తున్న ఈ మూవీని DVV Entertainments సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా అందాల భామ Priyanka Mohan హీరోయిన్ గా నటిస్తోంది.
ఇప్పటికే సాంగ్స్, టీజర్, గ్లింప్స్ లతో ఎంతో ఆకట్టుకుని భారీ అంచనాలు ఏర్పరిచిన OG Trailer ని సెప్టెంబర్ 21న విడుదల చేసి OG Pre Release Event ని కూడా అదే రోజున నిర్వహించనున్నారు. అయితే ఈ మూవీ దసరా పండుగ కానుకగా సెప్టెంబర్ 25న గ్రాండ్ గా పాన్ ఇండియన్ రేంజ్ లో పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. కాగా తమ అభిమాన Powerstar Pawan Kalyan ఈ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అని పవన్ ఫ్యాన్స్ గట్టిగ నమ్మకంగా ఉన్నారు.
Idli Kadai :
ఇటీవల Akkineni Nagarjuna తో కలిసి వెర్సటైల్ స్టార్ యాక్టర్ Dhanush నటించిన మూవీ Kuberaa. ఈమూవీని శేఖర్ కమ్ముల తెరకెక్కించగా నేషనల్ క్రష్ Rashmika Mandanna హీరోయిన్ గా నటించారు. మంచి అంచనాలతో రిలీజ్ అయిన Kuberaa Total Box office Collection అదరగొట్టే రేంజ్ లో సొంతం చేసుకుంది. మొత్తంగా కుబేరా తో సక్సెస్ కొట్టిన ధనుష్ తాజాగా తన స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కించిన మూవీ Idli Kadai.
తెలుగులో ఈ మూవీ Idli Kottu అనే టైటిల్ తో రిలీజ్ కానుంది. ఈ మూవీలో Nitya Menon హీరోయిన్ గా నటించగా GVP rakash Kumar సంగీతం అందించారు. ఆకాష్ భాస్కరన్ తో కలిసి Hero Dhanush స్వయంగా నిర్మించిన ఈ మూవీ యొక్క సాంగ్స్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్నాయి. త్వరలో Idli Kadai Trailer రిలీజ్ కానుండగా మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి అక్టోబర్ 1న గ్రాండ్ గా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
2025లో రిలీజ్ కాబోతున్న టాలీవుడ్ సినిమాలు
Kantara Chapter 1 :
ఇటీవల హీరో Rishab Shetty నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన మూవీ Kantara అందరినీ ఎంతో ఆకట్టుకుని భారీ విజయం సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసందే. ఇక Kantara Total Box Office Collection Worldwide రూ. 425 కోట్ల వరకు ఉంటుంది. ఆ విధంగా బిగ్గెస్ట్ కొట్టిన ఈ మూవీకి ప్రస్తుతం ప్రీక్వెల్ తెరకెక్కుతోంది. కాంతారా ని మించేలా దీనిని మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు రిషబ్ శెట్టి.
కాగా ఈ మూవీలో కన్నడ అందాల నటి Rukmini Vasanth హీరోయిన్ గా నటిస్తుండగా అగ్ర నిర్మాణ సంస్థ Hombale Films వారు దీనిని ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా పలు భాషల ఆడియన్సు ముందుకి రానుంది. తెలుగు రాష్ట్రాల్లో కాంతారా చాప్టర్ 1 మూవీకి భారీ స్థాయి ప్రీ రిలీజ్ జరిగింది.
Telusu Kada :
ఇటీవల వచ్చిన Tillu Square మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన యువ నటుడు Siddu Jonnalagadda అనంతరం Jack మూవీ చేసారు. Bommarillu భాస్కర్ తీసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే దాని అనంతరం తాజాగా యువ దర్శకురాలు నీరజ కోన మెగాఫోన్ పడుతున్న తెలుసు కదా మూవీలో హీరోగా యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో యువ అందాల నటీమణులు Raashi Khanna, KGF Chapter సిరీస్ సినిమాల ఫేమ్ Srinidhi Shetty హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన తెలుసు కదా టీజర్ అందరినీ ఆకట్టుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 17న ఆడియన్సు ముందుకి రానుంది.
Mass Jathara :
మాస్ మహారాజా Raviteja హీరోగా అందాల యువ నటి Sreeleela హీరోయిన్ గా యువ దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర. ఈ మూవీని Sithara Entertainments బ్యానర్ పై Suryadevara Nagavamsi, Sai Sowjanya గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈమూవీ నుండి రిలీజ్ అయిన Mass Jathara Teaser, సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై బాగానే అంచనాలు ఏర్పరిచాయి. ఈ మూవీలో రవితేజ ఒక పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తుండగా మూవీని మంచి యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా దర్శకుడు భాను తెరకెక్కిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు ముగించి ఈమూవీని అక్టోబర్ 31న విడుదల చేయనున్నారు. మరి ఈ మూవీ మాస్ రాజాకు ఏస్థాయి సక్సెస్ ని అందిస్తుందో చూడాలి.
Jatadhara :
Superstar Mahesh Babu బావ హీరోగా తాజాగా రూపొందుతున్న పాన్ ఇండియన్ మూవీ జటాధర. ఈ మూవీలో Bollywood నటి Sonakshi Sinha కీలక పాత్ర చేస్తుండగా Divya Khossla, Shilpa Shirodkar ఇతర ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ మూవీని జీ స్టూడియోస్, ప్రేమ అరోరా సమర్పిస్తుండగా వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన జటాధర టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో ఈ మూవీ గ్రాండ్ గా నవంబర్ 7న విడుదల కానుంది. కాగా ఈమూవీతో నటుడు సుధీర్ బాబు తప్పకుండా భారీ సక్సెస్ అందుకోవడం ఖాయం అని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
టాలీవుడ్ అప్ కింగ్ స్టార్ కాస్ట్, రిలీజ్ డేట్స్ & ట్రైలర్స్
Andhra King Taluka :
ఇటీవల Skanda, Double Ismart సినిమాలతో ఆశించిన స్థాయి సక్సెస్ లు సొంతం చేసుకోలేకపోయిన యువ నటుడు Ram Pothineni తాజాగా హీరోగా నటిస్తున్న మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ మూవీలో కన్నడ స్టార్ యాక్టర్ Upendra ఒక కీలక పాత్ర చేస్తుండగా ఇటీవల Anushka Shetty, Naveen Polishetty ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీని తీసి మంచి విజయం అందుకున్న యువ దర్శకుడు P Mahesh Babu దీనిని తెరకెక్కిస్తున్నారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు కల్గిన ఈమూవీలో యువ అందాల భామ Bhagyasri Borse హీరోయిన్ గా నటిస్తుండగా ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. Tollywood అగ్ర నిర్మాణ సంస్థ Mythri Movie Makers వారు గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీ నవంబర్ 28న విడుదల కానుంది.
Avatar: Fire and Ash :
గత కొన్నేళ్ల క్రితం Avatar మూవీస్ సిరీస్ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన రెండు సినిమాలు ఎంతో గొప్ప విజయాలు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. Hollywood ప్రముఖ దర్శకుడు James Cameron మరింత ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో అత్యధిక వ్యయంతో తెరకెక్కించిన తాజా సినిమా అవతార్ ఫైర్ అండ్ యాష్ డిసెంబర్ 19న భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కానుంది.
ఇక India లో కూడా ఈ మూవీ పై మరింతగా ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. English, Hindi తో పాటు Telugu సహా పలు భారతీయ భాషల్లో కూడా ఈ మూవీ రిలీజ్ కానుంది. 250 మిలియన్ల వ్యయంతో రూపొందిన ఈ మూవీని LightStrom Entertainment సంస్థ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించగా 20th Century Studios వారు దీనిని అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. ఇటీవల రిలీజ్ అయిన Avatar Fire and Ash Trailer కి విశేషమైన రెస్పాన్స్ లభించింది. మరి విడుదల తరువాత ఈమూవీ ఏస్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
Akhanda 2 Thaandavam :
నటసింహం Nandamuri Balakrishna హీరోగా ఇటీవల Boyapati Srinu దర్శకత్వంలో తెరకెక్కి రిలీజ్ అనంతరం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన మూవీ అఖండ. అయితే ఆ మూవీ అనంతరం తాజాగా దానికి సీక్వెల్ గా రూపొందుతోన్న Akhanda2 మూవీ అందరిలో మరింతగా అంచనాలు ఏర్పడ్డాయి. కాగా దీనిని ఫస్ట్ పార్ట్ ని మించేలా మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు బోయపాటి.
14 రీల్స్ ప్లస్ సంస్థ పై భారీ వ్యయంతో నిర్మితం అవుతున్న ఈమూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై భారీగా అంచనాలు ఏర్పరిచింది. కాగా ఈ పాన్ ఇండియన్ మూవీకికి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా యువ నటి Samyuktha Menon హీరోయిన్ గా నటిస్తోంది. ఆది పినిశెట్టి నెగటివ్ పాత్ర చేస్తున్న ఈ మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న భారీ స్థాయిలో పలు భాషల ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు మేకర్స్.
What's Your Reaction?






