Mahavatar Narasimha Review – A Breathtaking Visual Journey Through Divine Legend

Mahavatar Narasimha review: This animated mythological epic blends stunning visuals with devotion, but pacing issues and graphic scenes might surprise you. Rating, breakdown & verdict inside.

Mahavatar Narasimha Review – A Breathtaking Visual Journey Through Divine Legend

మహావతార నరసింహ రివ్యూ : అద్భుతమైన డివోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ 

సినిమా పేరు : మహావతార నరసింహ 

విడుదల తేదీ : 25 జులై 2025

తెలుగు మూవీ మీడియా రేటింగ్ : 3. 5 / 5

దర్శకత్వం : అశ్విన్ కుమార్ 

నిర్మాతలు : కుషాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ 

సంగీతం & నేపధ్య సంగీతం : సామ్ సి ఎస్ 

ఎడిటర్స్ : అశ్విన్ కుమార్, అజయ్ వర్మ 

కెజిఎఫ్, సలార్ వంటి ప్రతిష్టాత్మక భారీ మాస్ యాక్షన్ సినిమాలని మనకి అందించిన ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ వారు తాజాగా నిర్మించిన భారీ యానిమేషన్ డివోషనల్ ఎంటర్టైనర్ మూవీ మహావతార నరసింహ. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క ఫస్ట్ టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకోవడంతో మూవీ పై అందరిలో బాగా అంచనాలు ఏర్పడ్డాయి. మరి తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం. 

మహావతార్ నరసింహ సమీక్ష – విజువ‌ల్ వ్యూయర్స్ ని ఎంతవరకు మెప్పించింది ?

కథ

ఇక ఈ మూవీ యొక్క కథలోకి వెళితే కశ్యప మహాముని భార్యలలో ఒకరైన దితి ఒకరోజు మోహితురాలై సరైన సమయం కానప్పటికీ కూడా కశ్యప మహామునితో సంగమించడం వలన పుట్టే బిడ్డ రాక్షస గణాన పుడతాడని తెలిసి కూడా ఆ పనిచేస్తుంది. అనంతరం అందుకు ఫలితంగా అత్యంత క్రూరులైన కవలలు హిరణ్యకశిప, హిరాణ్యాక్షులు వారికి పుత్రులుగా జన్మిస్తారు. 

కాగా వీరిద్దరినీ శ్రీమహావిష్ణువు యొక్క బద్ద శత్రువులుగా గురువు అయిన శుక్రా చార్యుడు వారిని పెంచి పెద్ద చేస్తాడు. అయితే అప్పటికీ ఎన్నో క్రూరమైన ఆకృత్యాలు చేస్తూ రాక్షసుల్లో మేటిగా కొనసాగుతున్న వీరిలో ఒకరైన హిరణ్యాక్షుని శ్రీమహావిష్ణవు తన వరాహ అవతారంలో సంహరిస్తారు. ఆ ఘటనతో హిరణ్యకశిపుని విష్ణువు పై మరింతగా ద్వేషం పెరుగుతుంది. 

Mahavatar Narasimha Review

అనంతరం కఠోర తపస్సు చేసి బ్రహ్మ నుండి ఒక గొప్ప వరం పొందుతాడు హిరణ్యకశిపుడు. ఆపై అతడికి జన్మించిన ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడు కావడం అతడికి ఏమాత్రం నచ్చదు. అనంతరం కథ ఏ విధంగా సాగింది, ప్రహ్లాదుడు తండ్రి మాట విన్నాడా లేదా, మరి నరసింహ అవతారం వై విధంగా ఉద్భవించింది, ఇంట గానీ బయట గానీ ,మనిషి చేత గానీ మృగం చేత గానీ నెల మీద గానీ నింగిలో గానీ మరణం లేని హిరణ్యకశిపుని ఏవిధంగా నరసింహుడు సంహరించాడు అనేది మొత్తం కూడా మనం మహావతార నరసింహం మూవీలో వెండితెరపై చూడాల్సిందే.    

కథ, యానిమేషన్ వైవిధ్యం & మ్యూజిక్ విశ్లేషణ

ప్లస్ పాయింట్స్

నిజానికి ఇటువంటి గొప్ప డివోషనల్ కథని తీసుకుని దానిని గ్రాండ్ లెవెల్లో భారీ స్థాయిలో యానిమేటెడ్ మూవీగా తీసిన నిర్మాణ సంస్థ 
హోంబలె ఫిలిమ్స్ వారికి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియచేయాలి. ముఖ్యంగా డివోషనల్ సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ కి ఈ మూవీ థియేటర్స్ లో మంచి అనుభూతిని అందిస్తుంది. సినిమా మొదటి నలభై నిముషాలు ఎంతో ఆకట్టుకునే రీతిన సాగుతుంది. 

ముఖ్యంగా వరాహ అవతారం ఎపిసోడ్స్ ఆడియన్స్ కి మంచి అనుభూతిని అందిస్తాయి అని చెప్పాలి. ఆ యాక్షన్ సీన్స్ బాగా విజువల్ ట్రీట్ ని అందిస్తాయి. ఇక ప్రహ్లాదునికి శ్రీమహా విష్ణువుకి మధ్యన వచ్చే సీన్స్ బాగున్నాయి. ప్రహ్లాదుని శ్రీమహావిష్ణువు కాపాడే సీన్స్ తో పాటు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. 

యానిమేషన్ చిత్రం అయినప్పటికీ కూడా టీమ్ సృష్టించిన ప్రపంచం ఎంతో అద్భుతంగా ఉంటుంది. భూలోకం, స్వర్గం, బ్రహ్మలోకం వంటివి మనకి మంచి ఐ ఫీస్ట్ ని అందిస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. ఇక కీలకమైన చివరి నరసింహ అవతారం సీన్స్ వచ్చినపుడు మూవీ పీక్ కి వెళ్తుంది, ప్రతి ఒక్క ఆడియన్సు కి ఆ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. 

Mahavatar Narasimha Movie Review

ప్రతి ఒక్క పాత్ర సహజంగా ఉండడంతో పాటు నరసింహ అవతారంలో నరుడు, సింహం కలిస్తే ఎంత అద్భుతంగా సహజంగా ఉంటుందో అదే విధంగా తెరపై అద్భుతమైన రీతిన యానిమేషన్ తో చూపించి ఆకట్టుకున్నారు టీమ్. ముఖ్యంగా ఏ తో పటు బి, సి సెంటర్స్ ఆడియన్సు కూడా ఈ మూవీలో పలు కీలక సీన్స్ ని ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు, అలానే వారికి కూడా కొన్ని సీన్స్ మరింత నచ్చుతాయి. యాక్షన్ సీన్స్ తో పాటు ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి. ప్రతి పాత్ర ఎంతో బాగుండడంతో పాటు యానిమేషన్ వర్షన్ లో పాత్రల యొక్క చిత్రీకరణ అద్భుతం. 

మైనస్ పాయింట్స్

ముఖ్యంగా ఈ యానిమేటెడ్ డివోషనల్ మూవీలో మొదటి నలభై నిముషాలు బాగున్నప్పటికీ ఆ తరువాత కథనం కొద్దిగా నెమ్మదించడంతో పాటు మధ్యలో పాటలు కథనం యొక్క ఫ్లో ని ఇబ్బంది పెట్టినట్లు అనిపిస్తుంది. నిజానికి ఇటువంటి భక్తి సినిమాలకి పాటలు అవసరమే కానీ మంచి జోరుతో సాగుతున్న మూవీకి అవి కొద్దిపాటి అడ్డంకి అయితే అనిపిస్తుంది. అక్కడక్కడా కొన్ని సీన్స్ నెమ్మదిగా సాగుతాయి. అలానే కొద్దిపాటి అంశాలు లాజికల్ పరంగా ఆలోచించాల్సించి వస్తుంది. 

Mahavatar Narasimha Rating

అయితే మరొక విషయం ఏమిటంటే, హిరణ్యకశిపుని సోదరి హోళిక ఎపిసోడ్ బాగానే ఉన్నప్పటికీ చావులేని వరం ఉన్నా కూడా కాపాడుకోలేకపోయే నిస్సహాయతకి పొంతన ఉన్నట్లు అనిపించదు. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ కి ముందు హిరణ్యకశిపుని ప్రహ్లాదునికి సీన్స్ మధ్య డ్రామా మరింతగా పెట్టి ఉంటే బాగుండేది. వారి మధ్యన మాటల యుద్ధం లాంటివి లేకుండా సింపుల్ గా ముగించడం కొంత నిరుత్సాహపరుస్తుంది. 

ప్లస్ మైనస్ అంశాలు, రేటింగ్ & తాజా ట్రేడ్ టాక్

సాంకేతికవర్గం

ముఖ్యంగా యానిమేషన్ మూవీకి నిర్మాతలైన క్లీమ్ ప్రొడక్షన్స్ వారు బాగానే పెట్టిన ఖర్చు మనకు తెరపై కనిపిస్తుంది. కొన్ని యాక్షన్ సీన్స్ లో విజువల్ ఎఫెక్ట్స్ ఎంతో బాగుంటాయి. కీలకమైన క్లైమాక్స్ ఎపిసోడ్స్ లో వచ్చే సీన్స్ రియలిస్టిక్ గా అనిపించడంతో పాటు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఈ విషయం లో నిర్మాతల తో పాటు టీమ్ మొత్తాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. అలానే డబ్బింగ్ పరంగా కూడా ఎక్కడ లోపాలు లేవు, ఇది వాస్తవంగా కన్నడ మూవీ అయినప్పటికీ కూడా తెలుగు మూవీలానే మనకు అనిపిస్తుంది. మూవీకి మరొక పెద్ద ప్లస్ పాయింట్ సామ్ సీఎస్ సంగీతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్. 

Mahavatar Mythological Epic

ముఖ్యమైన సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో ఎలివేట్ చేస్తుంది. ఎడిటింగ్ విభాగం యొక్క వర్క్ బాగున్నా ఒకటి రెండు సీన్స్ కట్ చేయాల్సింది. దర్శకుడు అశ్విన్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించాల్సిందే. ఓవరాల్ గా మూవీని అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా చక్కగా తీశారు. కీలక సన్నివేశాల విషయంలో మరింత శ్రద్ద తీసుకుని డిజైన్ చేయడం ఎంతైనా అభినందించాల్సిన విషయం. ఆయన క్రియేట్ చేసుకున్న ప్రపంచం విజువల్స్ అద్భుతం. 

తీర్పు

మొత్తంగా చూసుకుంటే ఎంతో మంచి అంచనాలతో తాజాగా ఆడియన్స్ ముందుకి వచ్చిన మహావతార నరసింహ సినిమా డివోషనల్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ని అలరిస్తుంది. ముఖ్యంగా భక్తులకి అయితే మరింతగా మనసుకు నచ్చుతుంది. మేకర్స్ సృష్టించిన యానిమేటెడ్ ప్రపంచం అందులోని పాత్రలు మనల్ని ఎంతో కట్టిపడేస్తాయి. ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే వరాహావతారం సెకండ్ హాఫ్ లో వచ్చే నరసింహావతారం ఎపిసోడ్స్ ప్రత్యేకంగా అద్భుతంగా ఉంటాయి. 

Telugu Animation Movie Review

అయితే అక్కడక్కడా కొన్ని మూమెంట్స్ స్లోగా అనిపించడంతో పాటు పాటలు కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. అవి తప్ప దాదాపుగా మూవీ మొత్తంగా కూడా అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. మీకు వీలైతే ఈ వారం కుటుంబంతో కలిసి మహావతార నరసింహ మూవీ మీ సమీప థియేటర్స్ లో చూడండి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow