Pawan Kalyan OG Release Date Announced – Mega Fans Rejoice

Pawan Kalyan’s OG movie gets an official release date. Makers confirm it with a new poster. Fans gear up for a mega celebration

Pawan Kalyan OG Release Date Announced – Mega Fans Rejoice

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా ప్రస్తుతం సెట్స్ మీద రెండు సినిమాల ఉండగా ఒక సినిమా త్వరలో రిలీజ్ కి రెడీ అయింది. కాగా సెట్స్ మీద ఉన్న సినిమాలు ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్. రిలీజ్ కి రెడీ అయిన మూవీ హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu). ఇక ఈ మూడు మూవీస్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయి అంచనాలు నెలకొని ఉన్నాయి. 

ఇటీవల 2024లో జరిగిన ఎన్నికల సందర్భంగా అంతకముందు కొన్నాళ్ల నుండి పూర్తిగా తన జనసేన పార్టీ (Janasena Party) యొక్క రాజకీయ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమైన పవన్ కళ్యాణ్, తాజాగా హరి హర వీరమల్లు మూవీ షూటింగ్ మొత్తం పూర్తి చేసారు. అలానే ఓజి (OG) లో తన పార్ట్ షూట్ మొత్తం కూడా పూర్తి చేసిన పవన్ మరొక మూడు రోజుల అనంతరం హరి శంకర్ తీయనున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) మూవీ షెడ్యూల్ లో జాయిన్ అవ్వనున్నారు. 

పవన్ కళ్యాణ్ OG విడుదల తేదీ ఫిక్స్

ఇక వీటిలో పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తీస్తున్న ఓజి మూవీ పై అందరిలో ఒకింత భారీ స్థాయి అంచనాలు నెలకొని ఉన్నాయి. దానికి ప్రధాన కారణం తొలిసారిగా పవన్ నటిస్తున్న ఆ మూవీ గ్యాంగ్ స్టర్ నేపథ్యంతో రూపొందుతుండడంతో పాటు దానిని పాన్ ఇండియన్ రేంజ్ లో ఆయనకు వీరాభిమాని అయిన సుజీత్ (Sujeeth) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండడం. 

ఇక ఓజి మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ నిర్మాత దానయ్య ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తుండగా అందాల యువ కథానాయిక ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటిస్తున్నారు. రాక్ స్టార్ ఎస్ థమన్ (S Thaman) సంగీతం అందిస్తున్న ఓజి (They Call Him OG) మూవీ నుండి తొలిసారిగా కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ అందరిలో ఒక్కసారిగా అంచనాలు విపరీతంగా పెంచేసింది. 

ముఖ్యంగా గ్లింప్స్ లో పవన్ కళ్యాణ్ స్టైల్, డైలాగ్స్, విజువల్స్ తో పాటు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి విశేషమైన క్రేజ్లభించింది . అయితే తాజాగా పవన్ కళ్యాణ్ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఓజి  మూవీకి సంబంధించి ప్రస్తుతం బ్యాలెన్స్ షూటింగ్ వర్క్ జరుగుతోంది. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ని కూడా వేగంగా పూర్తి చేసేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోంది. 

మేకర్స్ అధికారికంగా ప్రకటించిన తేదీ

వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఓజి మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్సు ముందుకి రావాల్సి ఉంది. అయితే అప్పటి పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల్లో ముఖ్యంగా పిఠాపురం ఎమ్యెల్యేగా ఓవైపు మరొకవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఎంతో బిజీగా ఉండడంతో తన పార్ట్ షూట్ కి డేట్స్ కేటాయించలేకపోయారు. 

మొత్తంగా ఇప్పటికి షూటింగ్ పూర్తి చేసారు పవన్ కళ్యాణ్. కాగా ఓజి మూవీని రానున్న దసరా పండుగ కానుకగా సెప్టెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు టీం ప్రకటించింది. ఇక ఈ మూవీలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉండడంతో పాటు మూడు షేడ్స్ తో సాగుతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. 

Pawan Kalyan OG Release Date

అలానే పవన్ పాత్రలో ఆయన పలికే డైలాగ్స్, మ్యానరిజమ్స్, స్టైల్స్ విషయంలో దర్శకుడు సుజీత్ ఎంతో శ్రద్ధపెట్టినట్లు చెప్తున్నారు. గతంలో ప్రభాస్ తో సుజీత్ తీసిన పాన్ ఇండియన్ మూవీ సాహు మంచి విజయం అందుకుంది. ముఖ్యంగా టీజర్, ట్రైలర్ తో అందరినీ అలరించిన ఆ మూవీలో ప్రభాస్ స్టైల్, యాక్టింగ్, ఫైట్స్, భారీ విజువల్స్ కి మంచి పేరు లభించింది. 

అభిమానుల ఆనందం, సోషల్ మీడియాలో ట్రెండ్

ఇక తన అభిమాన నటుడితో చేస్తుండడంతో ఓజి విషయమై సుజీత్ మరింతగా ప్రతి అంశంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారట. అందుకే సినిమా యొక్క షూట్ కూడా కొంత జాప్యం జరిగిందని, ఇక విలన్ గా కనిపించనున్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ పాత్ర కూడా ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందని టాక్. అసలు మ్యాటర్ ఏమిటంటే తాజాగా ఓజి మూవీ యొక్క న్యూ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు మేకర్స్. రానున్న దసరా పండుగ కానుకగా దీనిని సెప్టెంబర్ 25న పలు భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు టీమ్ అనౌన్స్ చేసింది.

అర్జున్ దాస్ తో పాటు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, నటి శ్రియారెడ్డి కీలక పాత్రలు చేస్తున్న ఓజి మూవీ రిలీజ్ అనంతరం అందరి అంచనాలకు మించి థియేటర్స్ లో ఆకట్టుకుని భారీ బ్లాక్ బస్టర్ విజయం ఖాయం అని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఇటీవల ఓజి మూవీ యొక్క డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటిటి మాధ్యమం సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 

OG Release Date

ఓవరాల్ గా చెప్పాలి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఓజి మూవీ అత్యధిక ఖర్చుతో తెరకెక్కుతుండటంతో పాటు రిలీజ్ అనంతరం ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడం కూడా ఖాయం అంటున్నారు. మరి అందరిలో ఇంత భారీ స్థాయి క్రేజ్ ఏర్పరిచిన పాన్ ఇండియన్ మాస్ మూవీ ఓజి రిలీజ్ తరువాత ఎంత రేంజ్ సక్సెస్ అందుకుంటుందో ఎంత కలెక్షన్ రాబడుతుందో తెలియాలి అంటే మరొక మూడు నెలల వరకు ఓపిక పట్టాల్సిందే. కాగా మా Telugu Movie Media టీమ్ తరపున ఓజి టీమ్ కి ముందస్తు బ్లాక్ బస్టర్ విజయాభినందనలు 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow