Telugu News Paper Tollywood: Latest Movie News, Gossip & Live Cinema Updates
Get the latest updates from Telugu News Paper Tollywood – Breaking cinema news, movie releases, celebrity gossip, and exclusive Tollywood coverage

ప్రస్తుతం టాలీవుడ్ (Tollywood) లో పలు బడా సినిమాలతో పాటు కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలు కూడా ఆడియన్స్ ముందుకి వస్తూ మంచి విజయాలు సొంతం చేసుకుంటున్నాయి. ఆ విధమా ఇప్పటికే గడిచిన ఐదు నెలల్లో పలు సినిమాలు విజయవంతం కాగా మరికొన్ని ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. కాగా వాటిలో అందరిలో ఎక్కువగా క్రేజ్ ఏర్పరిచిన లేటెస్ట్ అప్ కింగ్ మూవీస్ యొక్క లేటెస్ట్ అప్ డేట్స్ ఇప్పుడు చూద్దాం.
SSMB 29
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ అందరిలో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీని శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఎంతో భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా కీలలకే పాత్రల్లో ప్రియాంక చోప్రా (Priyanka Chopra), పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithiviraj Sukumaran) నటిస్తున్నారు. అలానే వీరితో పాటు కొందరు హాలీవుడ్ నటులు కూడా ఇందులో భాగం కానున్నట్లు టాక్. ఆస్కార్ విజేత ఎం ఈమె కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఇప్పటికే 15 శాతం వరకు షూటింగ్ జరుపుకుంది. మళ్ళి జూన్ నుండి మిగతా భాగాన్ని ఎక్కడా గ్యాప్ లేకుండా చిత్రీకరించనున్నారు. అనంతరం అన్ని కార్యక్రమాలు ముగించి మూవీని 2027 సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తెలుగు న్యూస్ పేపర్ టాలీవుడ్ తాజా అప్డేట్స్
AA 22
ఇటీవల సుకుమార్ తీసిన పుష్ప 2 (Pushpa 2 The Rule) మూవీతో కెరీర్ పరంగా అతి పెద్ద బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుని ఇండియా మొత్తం కూడా పెద్ద సంచలనం క్రియేట్ చేసిన ప్రముఖ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), దీని అనంతరం ఓవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తో ఒక మైథలాజికల్ మూవీ అనౌన్స్ చేసారు. అలానే తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో భారీ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ అనౌన్స్ చేసారు అల్లు అర్జున్ . జులై లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీలో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు టాక్. సన్ పిక్చర్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించనున్న ఈ మూవీకి సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నారు. అందరిలో ఎంతో భారీ క్రేజ్ ఏర్పరిచిన ఈ మూవీ 2027 ప్రారంభంలో రిలీజ్ కానుంది.
OG (They Call Him OG)
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేస్తున్న మూడు సినిమాల్లో అందరి అంచనాలు ఎక్కువగా ఓజి మూవీ పైనే ఉన్నాయి. ఈ మూవీలో ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో బాలీవుడ్ (Bollywood) నటుడు ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రియ రెడ్డి, అర్జున్ దాస్ కనిపించనున్నారు. ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా అన్ని వర్గాల ఆడియన్స్ ని ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ ని ఆకట్టుకునేలా యువ దర్శకుడు సుజీత్ దీనిని గ్రాండ్ లెవెల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఓజి మూవీ యొక్క లేటెస్ట్ షెడ్యూల్ లో నేడు పవన్ జాయిన్ అయ్యారు. దీనిని సెప్టెంబర్ 5న ఆడియన్సు ముందుకి తీసుకువచ్చేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోంది.
సినిమా విడుదల తేదీలు, హీరోహీరోయిన్ల న్యూస్, గాసిప్
Peddi
మెగా పవర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) హీరోగా తాజాగా ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు సన తీస్తున్న యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా ఎంటర్టైనర్ మూవీ పెద్ది. ఈ మూవీలో రామ్ చరణ్ మంచి మాస్ పాత్ర చేస్తుండగా ఆయనకు జోడీగా బాలీవుడ్ అందాల నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తోంది. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇప్పటికే 30 శాతం మేర షూటింగ్ జరుపుకుందని, అలానే గతంలో తన నుండి వచ్చిన రంగస్థలం (Rangasthalam) ని మించేలా పెద్ది మూవీ ఉంటుందని తాజాగా లండన్ లో జరిగిన ఫ్యాన్స్ మీట్ లో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ తెలిపారు. ఏ ఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని వెంకట సతీష్ కిలారు గ్రాండ్ గా పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తున్నారు.
War 2
టాలీవుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ (NT Ramarao Jr) తో పాటు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan) ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ పై ఎంతో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వార్ 2 (War 2). ఈ మూవీని యువ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తుండగా ఇందులో కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తోంది. మొదటి నుండి అందరిలో ఈ క్రేజీ ప్రాజక్ట్ పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈమూవీ ఆగష్టు 14న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్సు ముందుకి రానుంది. ఇందులో హృతిక్ తో పాటు ఎన్టీఆర్ కలిసి చేయనున్న ఒక డ్యాన్స్ సాంగ్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుందని, ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ అయితే మరో రేంజ్ లో ఉంటాయని బి టౌన్ టాక్.
Ntr Neel Movie
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న రెండు సినిమాల్లో ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ (Dragon) మూవీ కూడా ఒకటి. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి. ఇక రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. దీనికి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన గౌడ ఫోటోగ్రఫి అందిస్తున్నారు. ఇక ఇటీవల గ్రాండ్ గా షూటింగ్ ప్రారంభం అయిన ఈ మూవీ 2026 జూన్ చివర్లో ఆడియన్స్ ముందుకి రానుంది.
తెలుగు మీడియా ద్వారా వచ్చిన తాజా మూవీ బ్రేకింగ్ న్యూస్
The Rajasaab
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా మాళవిక మోహనన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), రిద్ది కుమార్ (Riddhi Kumar) హీరోయిన్స్ గా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్రాండ్ హర్రర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ది రాజా సాబ్. ఈ మూవీ పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) కీలక పాత్ర చేస్తుండగా దీనిని గ్రాండ్ లెవెల్లో భారీ వ్యయంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై వివేక్ కూచిభొట్ల, టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆల్మోస్ట్ షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ మూవీ ఈ ఏడాది ద్వితీయార్ధంలో గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కి సిద్ధమవుతోంది.
Spirit
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న మూడు సినిమాల్లో స్పిరిట్ మూవీ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సాధారణ ఆడియన్స్ లో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల రణబీర్ కపూర్ (Ranbir Kapoor) తో ఆనిమల్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తీసిన సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఈ మూవీని గ్రాండ్ గా తెరకెక్కించనున్నారు. ఇక స్పిరిట్ మూవీలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనుండగా ఆయనకు జోడీగా బాలీవుడ్ అందాల నటి దీపికా పదుకొనె (Deepika Padukone) నటించనున్నటు లేటెస్ట్ టాలీవుడ్ బజ్. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ మూవీ 2026 చివర్లో ఆడియన్సు ముందుకి వచ్చే అవకాశం ఉంది.
What's Your Reaction?






