Akhanda 2 Teaser Out Now – Balayya Returns With Mass Power
Akhanda 2 teaser featuring Nandamuri Balakrishna is out now. Packed with powerful dialogues and action, check what fans are saying

నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా 2021 డిసెంబర్ లో రిలీజ్ అయిన మూవీ అఖండ (Akhanda). ఈ మూవీలో బాలకృష్ణ రెండు పాత్రల్లో నటించగా బోయపాటి శ్రీను దీనిని తెరకెక్కించారు. ప్రగ్య జైస్వాల్ (Pragya Jaiswal) హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో శ్రీకాంత్, నితిన్ మెహతా, జగపతిబాబు, పూర్ణ తదితరులు ఇతర కీలక పాత్రలు చేసారు.
అఖండ 2 టీజర్ విడుదల – బాలయ్య మాస్ ఎంట్రీ
థమన్ (S Thaman) సంగీతం అందించిన ఈ మూవీ అప్పట్లో మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మ్రోగించింది. ముఖ్యంగా బాలకృష్ణ అఘోరా పాత్రలో కనబరిచిన సూపర్ పెర్ఫార్మన్స్ తో పాటు థమన్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, దర్శకుడు బోయపాటి శ్రీను టేకింగ్ వంటివి ఈ మూవీ యొక్క భారీ విజయానికి కారణంగా నిలిచాయి.
తన కెరీర్ పరంగా బాలకృష్ణ తో చేసిన మూడు సినిమాలైన సింహా, లెజెండ్, అఖండ లతో ఒకదానిని మించేలా మరొకటి అత్యద్భుత విజయాలు సొంతం చేసుకుని బాలకృష్ణతో ప్రత్యేక క్రేజీ కాంబినేషన్ ఏర్పరిచారు బోయపాటి. ఇక అఖండ మూవీ అనంతరం వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాల చేశారు బాలకృష్ణ.
అయితే అవి మూడు కూడా మంచి విజయాలు సొంతం చేసుకున్నాయి. వాటి అనంతరం మరొక్కసారి బోయపాటి శ్రీనుతో బాలకృష్ణ చేస్తున్న మూవీ అఖండ 2. ఫస్ట్ పార్ట్ కి సీక్వెల్ గా అంతకు మించి మరింత గ్రాండియర్ గా రూపొందుతున్న ఈమూవీలో యువ అందాల నటి సంయుక్తా మీనన్ (Samyuktha Menon) హీరోయిన్ గా నటిస్తుండగా 14 రీల్స్ ప్లస్ సంస్థ పై గోపి ఆచంట, రామ్ ఆచంట దీనిని నిర్మిస్తున్నారు.
పవర్ ప్యాక్డ్ యాక్షన్, డైలాగ్స్‌తో టీజర్ అద్భుతం
అఖండ 2 (Akhanda 2 Teaser) మూవీ ప్రారంభం నుండి అందరిలో ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పరిచింది. ముఖ్యంగా పార్ట్ 1 లోని అఘోర పాత్ర ఇందులో మరింత అద్భుతంగా రాసుకుని తెరకెక్కిస్తున్నారట దర్శకుడు బోయపాటి శ్రీను. అలానే సంగీత దర్శకుడు థమన్ కూడా ఈమూవీ యొక్క సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై ఎంతో గట్టిగా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.
పార్ట్ 1 ని మించేలా మరింత అద్భుతంగా అవుట్పుట్ వచ్చేలా టీమ్ మొత్తం కూడా ఎంతో శ్రమిస్తోంది. కొన్నాళ్ల క్రితం గ్రాండ్ గా ప్రారంభం అయిన అఖండ 2 ఇటీవల హిమాలయాల్లోని కొన్ని కీలక ప్రదర్శల్లో కూడా షూటింగ్ జరుపుకుంది. అయితే విషయం ఏమిటంటే, రేపు నటసింహం నందమూరి బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని నేడు కొద్దిసేపటి క్రితం టీమ్ అఫీషియల్ గా రిలీజ్ చేసింది.
ఇక అఖండ 2 టీజర్ ని మనం పరిశీలిస్తే అఘోరా గా బాలకృష్ణ పవర్ఫుల్ పాత్ర, పలికిన డైలాగ్స్, ముఖ్యంగా గ్రాండియర్ విజువల్స్, ఫైట్స్, యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. వాటితో పాటు ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మరొక లెవెల్లో ఉంది. ఈ టీజర్ ని బట్టి చూస్తే అఖండ 2 లో బాలకృష్ణ నటవిశ్వరూపాన్ని చూడవచ్చని అర్ధం అవుతోంది.
ఓవరాల్ గా ప్రస్తుతం ఈ మూవీ యొక్క టీజర్ కి అందరి నుండి విశేషమైన ప్రశంసలు కురుస్తుండడంతో పాటు యూట్యూబ్ లో ఈ టీజర్ విపరీతంగా వ్యూస్ సొంతం చేసుకుంటూ దూసుకెళుతోంది. కాగా అఖండ 2 మూవీని సెప్టెంబర్ 25న దసరా పండుగ కానుకగా గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నట్లు టీజర్ ద్వారా మరొక్కసారి మేకర్స్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు.
అభిమానుల స్పందన, సినిమా విడుదల అంచనాలు
అందుతున్న సమాచారాన్ని బట్టి అఖండ 2 బాలకృష్ణ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న మూవీ అని చెప్తున్నారు. అలానే అటు హీరోయిన్ సంయుక్తా మీనన్ తో పాటు విలన్ గా చేస్తున్న ఆది పినిశెట్టి సహా అందరి పాత్రలు అద్భుతంగా డిజైన్ చేశారట దర్శకడు బోయపాటి (Boyapati Srinu).
త్వరలో ఈ మూవీ నుండి ఒక్కొక్కటిగా సాంగ్స్ తో పాటు అన్ని అప్ డేట్స్ ని అందించేందుకు టీమ్ సిద్ధమవుతోంది. మరోవైపు నిర్మాతలు కూడా అఖండ 2 క్వాలిటీ, ఖర్చు విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు చేస్తున్నట్లు టీజర్ ని బట్టి చూస్తే మనకు అర్ధం అవుతుంది.
ముఖ్యంగా టీజర్ లో బాలకృష్ణ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ తో పాటు బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ అందరినీ ఆకట్టుకోవడంతో తప్పకుండా రిలీజ్ అనంతరం మూవీ అతి పెద్ద విజయం ఖాయం అని నందమూరి ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అఖండ 2 టీజర్ మీ మంచి రెస్పాన్స్ లభిస్తుండడంతో టీమ్ కూడా ఆనందం వ్యక్తం చేస్తోంది.
వాస్తవానికి సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ ఓజి కూడా రిలీజ్ అవుతున్నప్పటికీ తమ మూవీ యొక్క రిలీజ్ డేట్ లో ఏమాత్రం మార్పు లేదని మరొక్కసారి దీని ద్వారా స్పష్టం చేసింది అఖండ 2 టీమ్. మొత్తంగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సొంతం చేసుకుని బాలకృష్ణ, బోయపాటి శ్రీను ల కాంబినేషన్ కి మరింత మంచి క్రేజ్ తీసుకురావాలని మా Telugu Movie Media టీమ్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
What's Your Reaction?






