Mahesh Babu’s Khaleja Creates New Records in Re-release

Mahesh Babu’s Khaleja is setting new box office records in its re-release. Fans celebrate the blockbuster’s grand comeback with massive response

Mahesh Babu’s Khaleja Creates New Records in Re-release

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో అనుష్క శెట్టి (Anushka Shetty) హీరోయిన్ గా రూపొందిన యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ మూవీ ఖలేజా. కనకరత్న మూవీస్ బ్యానర్ పై సింగనమల రమేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మించిన ఈ మూవీ 2010 అక్టోబర్ 7న మంచి అంచనాలతో అప్పట్లో గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చింది. 

అంతకముందు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతిథి మూవీ అనంతరం దాదాపుగా మూడేళ్ళ తరువాత వస్తున్న మూవీ కావడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఖలేజా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలానే అంతకముందు మహేష్, త్రివిక్రమ్ కలిసి చేసిన అతడు మూవీ 2005లో రిలీజ్ అయి సంచలన విజయం అందుకోవడంతో తప్పకుండా ఖలేజా భారీ విజయం ఖాయం అని అందరూ భావించారు. 

మహేష్ బాబు ఖలేజా రీ-రిలీజ్ రికార్డుల వర్షం

అయితే మొత్తంగా రిలీజ్ రోజు బెనిఫిట్ షోస్ నుండే ఈ మూవీ ఆశించిన స్థాయి టాక్ ని అందుకోలేకపోయింది. ముఖ్యంగా ఈ మూవీలో కథ బాగున్నప్పటికీ దానిని డీల్ చేసే విధానం, కథనాన్ని ఆడియన్స్ ఊహించిన విధంగా నడపడంలో దర్శకుడు త్రివిక్రమ్ విఫలం అయ్యారు. 

వాస్తవానికి ఖలేజా మూవీకి సంబంధించి అప్పట్లో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ టీజర్ విపరీతమైన రెస్సాన్స్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆ టీజర్ లో మహేష్ బాబు పవర్ఫుల్ లుక్ తో పాటు మాస్ ఫైట్ అందరినీ ఎంతో ఆకట్టుకుంది. దానితో ఖలేజా మూవీ పక్కా యాక్షన్ మూవీ అని అందరూ భావించారు. 

కానీ తీరా థియేటర్స్ లో ఆ మూవీ చూసిన ఆడియన్స్ కి ఆశించిన స్థాయి ఫీల్ లభించలేదు. అయితే ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ మూవీ ద్వారా తనలోని పూర్తి స్థాయి కామెడీ కోణాన్ని బయటకు తీశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఖలేజాలో మహేష్ బాబు పోషించిన సీతారామరాజు పాత్ర అందరినీ ఎంతలా ఆకట్టుకుంది అంటే మహేష్ ఫ్యాన్స్ తో ఇప్పటికే ఎందరో సాధారణ ప్రేక్షకులు సైతం ఆ పెర్ఫార్మన్స్ కి ఫిదా అవుతారు. 

ఇక ఈ మూవీ అటు టెలివిజన్ స్క్రీన్ పై ఎన్నిసార్లు ప్రదర్శితం అయినప్పటికీ కూడా కోట్లాది ఫ్యాన్స్ తో పాటు ఎందరో ఆడియన్స్ యొక్క ఆదరణతో మంచి రేటింగ్స్ కూడా ఎప్పటికప్పుడు రాబడుతుంది. మహేష్ బాబు పవర్ఫుల్ యాక్టింగ్ కామెడీ టైమింగ్ తో పాటు హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి చేసిన కామెడీ సీన్స్ ఎంతో పండాయి. 

థియేటర్లలో భారీ స్పందన – ఫ్యాన్స్ ఫెస్టివల్

అలానే అలీ, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం సీన్స్ కి కూడా విశేషమైన రెస్సాన్స్ లభించింది. త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్ కి మహేష్ బాబు సూపర్ డైలాగ్ టైమింగ్ తోడైతే అటు థియేటర్స్ మాత్రమే కాదు ఇటు ఈ మూవీ ప్రదర్శితం అయిన ప్రతి ఇల్లు ఎంతో సందడిగా మారింది. కామెడీ మాత్రమే కాకుండా మనిషిలోనే దేవుడున్నాడు అంటూ త్రివిక్రమ్ రాసుకున్న స్టోరీ లైన్ ఎంతో బాగుంటుంది. 

మొత్తంగా అప్పట్లో థియేటర్స్ లో ఫ్లాప్ గా నిలిచినప్పటికీ ఓపెనింగ్స్ పరంగా చాలా ఏరియాల్లో ఖలేజా కలెక్షన్స్ దున్నేసి పెద్ద రికార్డు నెలకొల్పింది. ఇక ఓవరాల్ టాక్ పరంగా ఫ్లాప్ అయిన ఈ మూవీ మే 30న సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం ఒకరోజు ముందుగా రెండు తెలుగు రాష్ట్రాలు సహా పలు ప్రాంతాల్లో గ్రాండ్ గా రీ రిలీజ్ కి రెడీ అయింది. 

వాస్తవానికి టాలీవుడ్ లో రీ రిలీజ్ లని పరిచయం చేసింది మహేష్ బాబు నటించిన పోకిరి మూవీ. అప్పట్లో రీ రిలీజ్ లో కూడా ఈ మూవీ పెద్ద విజయం అందుకుంది. అనంతరం మహేష్ నటించిన ఒక్కడు, బిజినెస్ మ్యాన్, మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలు కూడా రీ రిలీజ్ లలో పెద్ద రికార్డ్స్ నమోదు చేసాయి. 

Mahesh Khaleja Re Release Records

ముఖ్యంగా మురారి మూవీ ఆల్ టైం రీ రిలీజ్ హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న మూవీగా ఇప్పటికీ టాప్ స్థానంలో కొనసాగుతుండడం విశేషం. దానితో ఖలేజా రీ రిలీజ్ పై అందరిలో విశేషమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తెలుగు రాష్ట్రాలు సహా అనేక ప్రాంతాల్లో ఈ మూవీ రీ రిలీజ్ యొక్క బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుకి కోట్లాది ఫ్యాన్స్ తో పాటు ఎందరో సాధారణ ప్రేక్షకుల్లో కూడా అనంతమైన క్రేజ్ ఉండడమే దీనికి నిదర్శనం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటికే నైజాం, ఉత్తరాంధ్ర, కోస్తా ఏరియాల్లో భారీ ప్రీ బుకింగ్స్ తో కొనసాగుతున్న ఖలేజా మూవీ అటు యుఎస్ఏ, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో కూడా బాగా బుకింగ్స్ అందుకుంటోంది. 

కలెక్షన్లు, హౌస్‌ఫుల్స్, సోషల్ మీడియా ట్రెండ్

ఇక ఖలేజా మూవీ ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్స్ బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్ లు కలిపి మొదటి రెండు రోజుల అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా 160కె టికెట్స్ బుకింగ్ జరుపుకుంది. దీని యొక్క ఫైనల్ సేల్స్ 200కె కూడా దాటేసే అవకాశం గట్టిగా కనపడుతోంది. ఇక బుక్ మై షో లోనే 24 గంటల్లో రీ రిలీజ్ మూవీస్ లో ఏకంగా 75కె టికెట్ బుకింగ్స్ జరుపుకున్న మూవీగా పెద్ద సంచలన రికార్డు నెలకొల్పింది. 

అలానే రూ. 3 కోట్లకు పైగా టికెట్ సేల్స్ ని ఇప్పటివరకు ఈమూవీ జరుపుకుంది. మరోవైపు ఆంధ్ర సహా పలు ఏరియాల్లో ఇంకా టికెట్స్ బుకింగ్స్ కోసం మరిన్ని థియేటర్స్ ని కూడా యాడ్ చేస్తున్నారు. 

ప్రస్తుతం ఖలేజా మూవీ యొక్క రీ రిలీజ్ టికెట్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే ఫస్ట్ డే ఈ మూవీ భారీ స్థాయిలో కలెక్షన్ అందుకోవడంతో పాటు ఓవరాల్ గా రీ రిలీజ్ లలో భారీ గ్రాస్ అందుకున్న మూవీగా టాప్ స్థానంలో నిలిచే అవకాశం స్పషంగా కనపడుతోంది. 

అలానే అటు బెంగళూరు, తమిళనాడులో కూడా ఖలేజా రీ రిలీజ్ బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో అక్కడ కూడా పలు ప్రాంతాల్లో థియేటర్స్ ని పెంచే ఆలోచనలో ఉన్నారు. మొత్తంగా మరి రీ రిలీజ్ డే 1 నుండి ఖలేజా మూవీ మొత్తంగా వరల్డ్ వైడ్ ఎంతమేర కలెక్షన్ రాబడుతుందో చూడాలి. 

కాగా ఇటువంటి లేటెస్ట్ మూవీ న్యూస్, అప్ డేట్స్, రివ్యూ, బాక్సాఫీస్ కలెక్షన్స్ డీటెయిల్స్ కోసం ఎప్పటికప్పుడు మా Telugu Movie Media సైట్ చూస్తూ ఉండండి

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow