Mahavatar: Vicky Kaushal to Portray Parashurama in Dinesh Vijan's Epic Releasing Christmas 2026
Mahavatar, starring Vicky Kaushal as Parashurama and directed by Amar Kaushik, is Maddock Films' most ambitious project yet, set for a Christmas 2026 release.

బాలీవుడ్ స్టార్ నటుల్లో ప్రస్తుతం విక్కీ కౌశల్ వరుసగా పలు సక్సెస్ లతో మంచి క్రేజ్ తో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల బాడ్ న్యూస్ సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి ఆకట్టుకున్న విక్కీ, అనంతరం ఛావా (Chhaava) మూవీ కూడా చేసారు. ఈ మూవీ ఛత్రపతి శివాజీ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందింది.
ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా మ్యాడాక్ ఫిలిమ్స్ సంస్థ పై దినేష్ విజన్ గ్రాండ్ గా నిర్మించారు. అయితే లక్ష్మణ్ ఉటేకర్ అద్భుతంగా తెరకెక్కించిన ఛావా మూవీలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్ కనబరిచిన అద్భుత నటనకు దేశవ్యాప్తంగా ఆడియన్స్ అందరి నుండి మంచి ప్రసంశలు కురిసాయి.
మహావతార్: విక్కీ కౌశల్ పరశురాముడిగా – 2026 క్రిస్మస్ విడుదల
ఇక ఈ మూవీ అనంతరం ప్రస్తుతం రణబీర్ కపూర్, అలియా భట్ తో కలిసి ప్రముఖ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీల భన్సాలీ తీస్తున్న ప్రతిష్టాత్మక మూవీ లవ్ వార్ చేస్తున్నారు. వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో ఆడియన్సు ముందుకు రానుంది. కాగా మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ అనంతరం మరొక్కసారి ఛావా నిర్మాత దినేష్ విజన్ తో కలిసి ఒక భారీ మైథలాజికల్ డ్రామా మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు విక్కీ.
మైథలాజికల్ జానర్ లో రూపొందనున్న మహావతార్ (Mahavatar) మూవీలో ఆయన పరశురాముడిగా వీరోచిత పాత్రలో కనిపించనున్నారు. తమ సంత పై అత్యంత గ్రాండ్ లెవెల్లో భారీ వ్యయంతో రూపొందనున్న ఈ మూవీలోని తన పాత్ర కోసం ఇప్పటికే హీరో విక్కీ కౌశల్ మెకోర్ పరంగా ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపారు దినేష్ విజన్.
మ్యాడాక్ ఫిల్మ్స్ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా మహావతార్
ముఖ్యంగా ఈమూవీ కోసం యావత్ తమ టీమ్ మొత్తం కూడా ఎంతో శ్రద్ధ పెట్టనుందని, అమర్ కౌశిక్ దీనిని అద్భుత విజువల్ వండర్ గా రూపొందించేందుకు సిద్దమవుతున్నట్లు ఆయన తెలిపారు. ఇక త్వరలో గ్రాండ్ గా ప్రారంభం కానున్న ఈ మూవీ 2026 క్రిస్మస్ కానుకగా ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రస్తుతం ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణల యొక్క ఎంపిక జరుగుతోందట.
ఇక ఈ మూవీలో పలువురు బాలీవుడ్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారట. మహావతార్ మూవీ ఆడియన్స్ ని ఒక సరికొత్త మైథలాజికల్ లోకంలోకి తీసుకెళ్తుందని, ప్రతి పాత్రల విజువల్స్, సీన్స్ వారి మనసుని ఎంతో ఆకట్టుకోవడంతో పాటు ఇది ఇండియన్ సినిమాల్లో ఒక బెస్ట్ మూవీగా నిలిచిపోయేలా అద్భుతంగా నిర్మించనున్నట్లు తెలిపారు దినేష్.
అమర్ కౌశిక్ దర్శకత్వంలో మైథలాజికల్ యాక్షన్ డ్రామా
ప్రస్తుతం భారతీయ సినిమా యొక్క పరిధి పూర్తిగా మారిపోయిందని, అలానే నార్త్, సౌత్ లలో పలు అద్భుతమైన సినిమాలు రూపొందుతూ మన సినీ ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చేయడం ఆనందంగా ఉందని అన్నారు.
అలానే తమ సినిమా కూడా గ్లోబల్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో పాటు భారతీయ మైథలాజీకి సంబందించిన పలు అంశాలు సినిమాల ద్వారా అందరికి తెలియచేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఇక త్వరలో పూర్తి స్థాయిలో ఒక్కొక్కటిగా మహావతార్ మూవీ గురించి అప్ డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది.
What's Your Reaction?






