10 Interesting Facts About Mahesh Babu’s Cult Classic Athadu

Discover 10 lesser-known and surprising facts about Mahesh Babu’s iconic film Athadu. From behind-the-scenes secrets to casting surprises

10 Interesting Facts About Mahesh Babu’s Cult Classic Athadu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారిగా రాజకుమారుడు మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టి తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కు తగ్గ తనయుడిగా తన ఆకట్టుకునే అందం, అభినయంతో అందరినీ మెప్పించారు. ఆ తరువాత యువరాజు, వంశీ మూవీస్ చేసి నటుడిగా మరింత క్రేజ్ సొంతం చేసుకున్న మహేష్ బాబు, ఆ తరువాత మురారి మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో కెరీర్ పరంగా విపరీతంగా దూసుకెళ్లారు. 

ఆ మూవీలో మహేష్ బాబు నటనకు యువతతో పాటు ఫ్యామిలీస్ సహా అన్ని వర్గాల ఆడియన్స్ నుండి ఎంతో మంచి పేరు లభించింది. ఆ తరువాత టక్కరిదొంగ మూవీతో ఫస్ట్ కౌ బాయ్ మూవీ చేసి తనని తాను నిరూపించుకున్న మహేష్ బాబు, ఆ తరువాత బాబీ మూవీతో పరాజయం చవిచూశారు. 

Mahesh Babu Athadu Movie Facts

అనంతరం గుణశేఖర్ దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ పై ఎం ఎస్ రాజు నిర్మించిన ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ మూవీ ఒక్కడుతో కెరీర్ పరంగా అత్యద్భుత విజయం అందుకున్నారు మహేష్ బాబు. అనంతరం నిజం సినిమాలో సీతారాం గా అమాయకుడిగా తన అద్వితీయ పెర్ఫార్మన్స్ తో అటు ఫ్యాన్స్, ఆడియన్స్ తో పాటు విమర్శకుల నుండి కూడా ప్రసంశలు సొంతం చేసుకున్న సూపర్ స్టార్, ఆ మూవీలో అద్భుత నటనకు గాను అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం సొంతం చేసుకున్నారు. 

మహేష్ బాబు 'అతడు' సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు

ఆ తరువాత పూర్తి స్థాయి ప్రయోగ్రామక సినిమా నానిలో చిన్న పిల్లాడిగా మహేష్ బాబు గొప్ప నటన పై మరింతగా ప్రసంశలు కురిసాయి. ఆ తరువాత అక్క తమ్ముళ్ల సెంటిమెంటల్ స్టోరీగా గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ చేసిన మూవీ అర్జున్ కూడా మంచి విజయం అందుకుంది. అయితే సరిగ్గా అదే సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అతడు మూవీ చేయడానికి సిద్ధం అయ్యారు మహేష్ బాబు. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ మూవీని జయభేరి ఆర్ట్స్ సంస్థ పై ప్రముఖ సీనియర్ నటుడు నిర్మాత అయిన మురళి మోహన్ గ్రాండ్ గా నిర్మించారు. 

అప్పట్లో భారీ స్థాయిలో హై టెక్నీకల్ వాల్యూస్ తో నిర్మితం అయిన అతడు మూవీలో రెండు రకాల విభిన్న షేడ్స్ కలిగిన పార్ధు, నందు పాత్రల్లో తన మార్క్ అద్భుత పెర్ఫార్మన్స్ తో మరొక్కసారి అందరినీ అలరించారు మహేష్. ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించగా కీలక పాత్రల్లో సోను సూద్, ప్రకాష్ రాజ్, నాజర్, సునీల్, సుధ, జరీబు తదితరులు నటించారు. 

ఫ్యామిలీ యాక్షన్ తో కూడిన ఆకట్టుకునే ఎంటర్టైనర్ గా రూపొందిన అతడు మూవీ 2005 ఆగష్టు 10న అనగా మహేష్ బాబు జన్మదినం తదుపరి రోజు రిలీజ్ అయి ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక అక్కడి నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ క్రేజ్ తో అనేక ఏరియాస్ లో అతడు మూవీ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకెళ్లింది. 

Interesting Facts about Athadu

ఇక ఈ మూవీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన స్క్రీన్ ప్లే, యాక్షన్ సీన్స్, డైలాగ్స్ తో పాటు సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, హీరోయిన్ త్రిష ఆకట్టుకునే అందం, యాక్టింగ్, ఫైట్స్ వంటివి అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. సోను సూద్ విలన్ గా చేసిన ఈ మూవీలో సునీల్ కామెడీ అలరిస్తుంది. 

ఆ అప్పట్లో మంచి అంచనాలు అందుకున్న అతడు మూవీ హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ లో కూడా అత్యంత ప్రత్యేకం అని చెప్పాలి. అంతేకాదు కల్ట్ క్లాసిక్ గా నిలిచిన అతడు మూవీ రానున్న 2025 ఆగష్టు 9న మహేష్ బాబు జన్మదినం సందర్భంగా భారీ ఎత్తున థియేటర్స్ లో రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. మరి ఈ మూవీ గురించిన పలు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని ఇప్పుడు తెలుసుకుందాం.

అతడు సినిమా తీయడానికి ముందు ఉన్న చర్చలు

1. ముందుగా ఈ మూవీ స్టోరీ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వినిపించారట దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అయితే కథ తనకు నచినప్పటికీ అప్పటి తన సినిమా లైనఫ్స్ కారణంగా పవన్ ఆ సినిమాని చేయలేకపోయారు. అనంతరం దానిని మహేష్ బాబుకి వినిపించిన త్రివిక్రమ్ ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ సొంతం చేసుకున్నారు. 

2. ఇక అతడులో సాంగ్స్ విషయంలో త్రివిక్రమ్ తో పాటు సంగీత్ దర్శకుడు మణిశర్మ ఎంతో ప్రత్యేకమైన కేర్ తీసుకున్నారట. సాంగ్స్ అన్ని కూడా అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా ఉండాలని, అలానే ఏళ్ళు గడిచినప్పటికీ సాంగ్స్ యొక్క ఫ్రెష్ ఫీల్ తగ్గకూడదనేలా దగ్గరుండి మరీ జాగ్రత్తగా కంపోజ్ చేశారట. ఈ సాంగ్స్ అప్పట్లో ఆడియో పరంగా అతిపెద్ద సెన్సేషన్ సృష్టించడం విశేషం. 

3. ఇక ఈమూవీలో మహేష్ బాబు పాత్రకు ప్రత్యేకంగా సాగె కామెడీ ఎక్కువగా ఉండదు, వృత్తి రీత్యా ప్రొఫెషన్ కిల్లర్ కావడంతో ఎక్కువుగా సెటిల్ పెర్ఫార్మన్స్ చేయాల్సి ఉండడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ పాత్రకు తగ్గ విధంగా నటించి ఆకట్టుకున్నారు. ఎక్కువగా యాక్షన్ ఎమోషనల్ సీన్స్ లో మహేష్ బాబు నటన నభూతో నభవిష్యతి అనేలా ఉంటుంది. 

Mahesh Babu Classic Film Details

4. ఈ సినిమా ద్వారా తొలిసారిగా మహేష్ కు జోడీగా నటించిన త్రిష, ఆయనతో నటించిన అతడు ఎక్స్ పీరియన్స్ తో పాటు ఆ రోజులు ఎప్పటికీ మరువలేనని చెప్తుంటారు. అలానే ఈ మూవీ తన లైఫ్ లో కూడా ఎంతో ప్రత్యేకం అని, అనంతరం మహేష్ తో మరొక్కసారి సైనికుడు లో కూడా నటించిన పలు అనుభవాలు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా పంచుకున్నారు త్రిష. 

5. ముఖ్యంగా అతడు మూవీ మొత్తం కూడా మహేష్ బాబు షార్ట్ హెయిర్ తో మనకు కనిపిస్తారు. అయితే సినిమాలోని అవును నిజం సాంగ్ లో మాత్రం మహేష్ బాబు హెయిర్ స్టైల్ స్టైలిష్ గా అద్భుతంగా ఉంటుంది. దీని అనంతరం అప్పటికే పోకిరి మూవీ ఓకె చేయడంతో ఆ పాత్ర కోసం తన భర్త మహేష్ హెయిర్ స్టైల్ విషయంలో నమ్రత శిరోద్కర్ సరికొత్త నిర్ణయం తీసుకుని ట్రెండీ స్టైల్ లో ఆయన హెయిర్ పెంచేలా జాగ్రతగా ప్లాన్ చేశారట. అందుకే పోకిరి, సైనికుడు, అతిథి మూవీస్ లో మహేష్ హెయిర్ స్టైల్ అద్భుతంగా ఉంటుంది. 

6. అప్పట్లో షారుఖ్ ఖాన్ నటించిన డాన్ మూవీ కోసం వాడిన ప్రత్యేక ఖరీదైన కెమెరాలని అతడు మూవీలోని క్లైమాక్స్ ఫైట్ యాక్షన్ సీన్స్ కోసం వాడారు. టీమ్ మొత్తం ఎన్నో రోజుల పాటు కష్టపడి తీసిన ఆ సీన్ ఇప్పటికీ కూడా అందరినీ ఎంతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆ సీన్స్ తీసేటప్పుడు మహేష్ బాబు ఎంతో కష్టపడ్డారని, ఆ దుమ్ము ధూళిలో కూడా ఆయన ఏమాత్రం వెనుకడుగు వేయకుండా డూప్ లేకుండా యాక్ట్ చేసారని పలు సందర్భాల్లో దర్శకుడు త్రివిక్రమ్ చెప్పారు. 

అతడు చిత్రానికి సంబంధించిన వెనుక కథలు, ట్రివియా

7. అతడు తీస్తున్న సమయంలో దిగ్గజ నటుడు శోభన్ బాబుని కలిశారట మురళి మోహన్. మరి ప్రస్తుతం ఇండస్ట్రీ ఎలా ఉంది, నేను సినిమాలు చేయడం చూడడం ఎప్పుడో మానేసాను కదా, ఎవరు బాగా యాక్ట్ చేస్తున్నారు అని శోభన్ బాబు అడిగారట. మన కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు ఒక్కో సినిమాతో నటుడిగా ఎంతో దూసుకెళ్తున్నాడని, ప్రస్తుతం తనతో అతడు అనే మంచి ఫ్యామిలీ యాక్షన్ మూవీ తీస్తున్నట్లు చెప్పారట మురళి మోహన్. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చారు మురళి మోహన్. 

8. ఇక ఈ మూవీలో విలన్ గా నటించిన సోను సూద్ పాత్ర కోసం అప్పట్లో హీరో వేణుని ముందుగా తీసుకుందాం అని భావించినట్లుగా అప్పటి సినీ పత్రికల్లో వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల రీత్యా ఆయన స్థానంలో బాలీవుడ్ నటుడు సోను సూద్ నటించారు. అతడులో మల్లి పాత్రలో సోను సూద్ నటన నిజంగా అత్యద్భుతం అని చెప్పక తప్పదు. 

Athadu Behind the Scenes Trivia

9. ఇక అతడు మూవీ వరల్డ్ వైడ్ గా అత్యధిక సార్లు టెలివిజన్ లో ప్రదర్శింపబడ్డ తెలుగు మూవీగా, అనగా మొత్తంగా 1500 సార్లు ఈ మూవీ ప్రదర్శితం అయి వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. అలానే ప్రదర్శితం అయిన ప్రతిసారి దాదాపుగా మంచి టిఆర్పి రేటింగ్స్ ని కూడా ఈ మూవీ సొంతం చేసుకుని మరొక సెన్సేషన్ ని సృష్టించింది. 

10. అలానే అతడు మూవీలో అద్భుత నటన గాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ నటుడిగా నంది అవార్డుతో పాటు, ఉత్తమ డైలాగ్ రైటర్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ కి గాను విహెచ్ శ్రీనివాస్ కూడా నంది పురస్కారాలు సొంతం చేసుకోవడం విశేషం. 

11. ఇక అతడు మూవీలో డైలాగ్స్ కూడా ఒక మంచి సెన్సేషన్ సృష్టించాయి అని చెప్పక తప్పదు. అంతకముందు పలు సక్సెస్ఫుల్ సినిమాలకు కథ, డైలాగ్స్ అందించినప్పటికీ నువ్వే నువ్వే మూవీతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్, అనంతరం చేసిన అతడులో డైలాగ్స్, డైరెక్షన్ తో విపరీతమైన పేరు సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ కూడా ఈమూవీ యొక్క డైలాగ్స్ అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో మీమ్స్ గా విశేషంగా ఆదరణ సొంతం చేసుకుంటూ ఉంటాయి. 

12. అతడు లో ఫైట్స్ విషయంలో కూడా దర్శకుడు త్రివిక్రమ్ ఎంతో కొత్తగా ఆలోచన చేసారు. ముఖ్యంగా సినిమాలో పొలం ఫైట్ తో పాటు గుడి దగ్గర ఫైట్స్ యువతతో పాటు మాస్ ఆడియన్స్ ని కూడా విశేషంగా ఆకట్టుకుంటాయి. ఫైట్స్ లో ఎక్కువగా విపరీతమైన వయొలెన్స్ చూపించకుండా స్టైలిష్ యాక్షన్ తో అందరినీ అదిరిపోయేలా డిజైన్ చేసారు. కాగా ఈ సినిమాకి పీటర్ హెయిన్స్ ఫైట్ మాస్టర్ గా పని చేసారు.

13. అలానే అతడు మూవీ యొక్క పూర్తి స్క్రిప్ట్ ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కేవలం 30 రోజుల్లో పూర్తి చేయడం విశేషం. ఇక ఈ మూవీ తెలుగులో భారీ విజయం అనంతరం దీనిని హిందీలో బాబీ డియోల్ హీరోగా ఏక్ అనే టైటిల్ తో రీమేక్ చేయగా సంగీత్ శివన్ దీనిని తెరకెక్కించారు. అయితే అది పర్వాలేదనిపించే విజయం అందుకుంది. అంతే కాదు, భోజ్ పురి భాషలో డబ్ కాబట్టి తొలి తెలుగు మూవీ అతడు.  

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow