Bhairavam Movie Review – Manchu Manoj's Comeback in Action Drama

Bhairavam Movie Review: Manchu Manoj returns in a gripping action drama alongside Bellamkonda Sai Sreenivas and Nara Rohith. Read the full Telugu review.

Bhairavam Movie Review – Manchu Manoj's Comeback in Action Drama

'భైరవం' మూవీ రివ్యూ : ఆకట్టుకునే యాక్షన్ ఎమోషనల్ డ్రామా మూవీ 

సినిమా పేరు : భైరవం 

విడుదల తేదీ : 30 మే 2025

Telugu Movie Media Rating : 3. 5 / 5

నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్, దివ్య పిళ్ళై, అదితి శంకర్, ఆనంది తదితరులు 

దర్శకత్వం : విజయ్ కనకమేడల 

సంగీతం : శ్రీచరణ్ పాకాల 

నిర్మాత : కేకే రాధామోహన్ 

సినిమాటోగ్రఫీ : హరి కె వేదంతం 

భైరవం మూవీ రివ్యూ – మంచు మనోజ్ మళ్లీ యాక్షన్‌లో

తాజాగా టాలీవుడ్ నటులు నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ ల కలయికలో యువ దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ భైరవం. ఇటీవల తమిళ్ లో రిలీజ్ అయి పెద్ద విజయం సొంతం చేసుకున్న గరుడన్ మూవీ కి ఇది అఫీషియల్ రీమేక్.

Bhairavam Telugu review

ఈ మూవీలో అదితి శంకర్, దివ్యా పిళ్ళై, ఆనంది హీరోయిన్స్ గా నటించగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై దీనిని కేకే రాధామోహన్ ఎంతో భారీ స్థాయిలో నిర్మించారు. ఇటీవల సాంగ్స్ తో పాటు టీజర్, ట్రైలర్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన భైరవం మూవీ తాజాగా రిలీజ్ అయి ఎంతమేర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది అనేది ఇప్పుడు పూర్తి రివ్యూలో చూద్దాం. 

కథ : 

తూర్పుగోదావరి జిల్లా దేవిపురం గ్రామంలో ఉన్న అమ్మవారి గుడి ట్రస్టీ గా ఉన్న నాగరత్నమ్మ (Jayasudha) తన మనవడు గజపతి (Manchu Manoj) తో పాటు వరద (Nara Rohit) శ్రీను (Bellamkonda Srinu) లను చిన్నప్పటి నుండి ఒకేలా పెంచుతుంది. కొన్నేళ్ల అనంతరం నాగరత్నమ్మ మరణించడంతో అదే సమయంలో వారి దేవాలయ భూమి పై ఒక మంత్రి కన్ను పడడంతో దాని యొక్క ట్రస్టీగా గజపతి, వరద కలిసి శ్రీను ని నిలబెట్టి గెలిపిస్తారు. 

అయితే అనంతరం జరిగే కొన్ని అనుకోని ఘటనల కారణంగా వరద ని గజపతి చంపాల్సి వస్తుంది, మరి ఇంతకీ దానికి కారణం ఏంటి, శ్రీను ఆ సమయంలో ఏమి చేసాడు, మధ్యలో పోలీసులకి అబద్దం చెప్పిన వరద భార్య Divya Pillai వద్ద చెడుగా శ్రీను ఎందుకు నిలబడతాడు,అసలు శ్రీను అబద్దం ఎందుకు చెప్పాడు, ఆపై అసలు కథ ఏవిధమా మలుపులతో ముందుకు సాగుతుంది అనేది మొత్తం కూడా సినిమా తెరపై చూడాల్సిందే. 

కథ, నటన, సాంకేతిక అంశాలు – పూర్తి విశ్లేషణ

ప్లస్ పాయింట్స్ : 

ముఖ్యంగా ఈ మూవీలో కీలక పాత్రలు చేసిన బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురు కూడా తమ తం పాత్రల్లో ఎంతో ఒదిగిపోయి నటించారు అని చెప్పాలి. మనోజ్ తో పాటు రోహిత్ ఇద్దరి పాత్రల మధ్య వచ్చే సీన్స్, సంభాషలను బాగుంటాయి. ఇక కీలకమైన ముఖ్య పాత్ర చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ నటన ఎంతో బాగుంది. 

Bhairavam 2025 film analysis

ఇంటర్వెల్ తో పాటు ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ తో అతడు అదరగొట్టాడు. ఇక ఈ ముగ్గురు హీరోలతో పాటు చేసిన Adithi Shankar, దివ్యాపిళ్ళై, Anandhi తమ తమ పాత్రల యొక్క పరిధి మేరకు ఆకట్టుకున్నారు. నాగరత్నమ్మ గా జయసుధ నటన ఎప్పటివలె ఎంతో సహజంగా అదిరిపోయింది. ముఖ్యంగా సినిమాలో దర్శకుడు రాసుకున్న యాక్షన్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే పండాయి. వాటిని సినిమాకి బలంగా చెప్పుకోవచ్చు. 

మైనస్ పాయింట్స్ : 

ముఖ్యంగా ముగ్గురు హీరోల యొక్క పాత్రల మధ్య మంచి సీన్స్ రాసుకున్న దర్శకుడు విజయ్ కనకమేడల కీలకమైన వారాహి అమ్మవారి సన్నివేశం సీన్స్ మరింత బాగా రాసుకున్నారు. అయితే ఇతర సీన్స్ లో మాత్రం ఆ స్థాయిలో రాసుకోలేదు. ఫస్ట్ హాఫ్ బాగున్న ఈ మూవీ సెకండ్ హాఫ్ లో మెల్లగా నెమ్మదించడంతో పాటు సాగదీసినట్లు అనిపిస్తుంది. 

Bhairavam movie rating

ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అంశాలు బాగున్నా కూడా ఆడియన్స్ కి ఇది వెలితిగా అనిపిస్తుంది. ముగ్గురు హీరోల మధ్య మనస్పర్థల సన్నివేశాలు ఇంకా హృద్యంగా రాసుకోవాల్సింది, అలానే బెల్లంకొండ శ్రీనివాస్ లవ్ ట్రాక్ లో కూడా డెప్త్ లేదు. ఆయన పాత్ర మరింత బాగా ఎస్టాబ్లిష్ చెసి ఉంటె సినిమాకి అది మరింత పెద్ద ప్లస్ అయ్యేది. విలన్ పాత్రలు కూడా బలంగా అనిపించవు. ఈ విషయమై అలానే సెకండ్ హాఫ్ కథనం విషయమై దర్శకుడు విజయ్ కనకమేడల ఇంకా ఎంతో శ్రద్ధ పెడితే బాగుండేది. 

సాంకేతిక వర్గం : 

దర్శకుడు విజయ్ కనకమేడల గరుడన్ రీమేక్ గా దీనిని తీసుకుని తెరకెక్కించాలని ఆలోచన బాగుంది, ముఖ్యంగా యాక్షన్ ఎమోషనల్ సీన్స్ ఈ మూవీకి ప్రధాన హైలైట్. అయితే కథనం మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఆయన నడిపించలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రెండు సాంగ్స్ బాగున్నాయి. విజువల్స్ కూడా గ్రాండ్ గానే ఉన్నాయి. ఇక ఎడిటింగ్ విభాగం వారు సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా కొన్ని సాగతీత సీన్స్ కట్టిస్తే బాగుండేది. నిర్మాత కేకే రాధామోహన్ సినిమా యొక్క ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని మూవీ మొత్తం చూస్తే అర్ధం అవుతుంది. 

Bhairavam movie public talk

మా అభిప్రాయం, హైలైట్స్ మరియు రేటింగ్

తీర్పు : 

ఓవరాల్ గా అందరిలో మంచి అంచనాలతో ఇటీవల రిలీజ్ అయిన భైరవం మూవీ యాక్షన్, ఎమోషనల్ అంశాలతో పాటు మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ల యాక్టింగ్ తో ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ బాగా సాగిన ఏ మూవీ యొక్క సెకండ్ హాఫ్ విషయంలో దర్శకుడు విజయ్ తడబడ్డారు. స్క్రీన్ ప్లే ని ఆసక్తికరంగా ముందుకు నడపలేకపోయారు. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ మాత్రం బాగున్నాయి. మొత్తంగా మంచి యాక్షన్ ఎమోషనల్ మూవీని ఇష్టపడేవారికి భైరవం ఎంతో బాగా నచ్చుతుంది. ఒకసారి అయితే మీ మీ ఫ్యామిలీస్ తో ఈ మూవీని థియేటర్స్ లో ఒక లుక్ వేయండి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow