Ram Charan Peddi Movie Teaser: Must-Watch First Look
Watch the latest Ram Charan Peddi movie teaser. Get a glimpse of the power-packed visuals and action sequences. Don't miss it!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇటీవల ప్రముఖ దర్శకుడు శంకర్ తీసిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్, ఎస్ జె సూర్య, రాజీవ్ కనకాల, సముద్రఖని, అంజలి తదితరులు ముఖ్య పాత్రలని పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. ఐతే ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ మూవీ ఏమాత్రం అంచనాలు అందుకోలేకపోయింది.
Ram Charan Peddi Movie Teaser Out Now!
ఇక దాని అనంతరం యువ దర్శకుడు బుచ్చిబాబు సనతో తన నెక్స్ట్ మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు మెగా పవర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ మూవీకి పెద్ది అనే టైటిల్ ని నిర్ణయించి ఇటీవల అఫీషియల్ ఫస్ట్ లుక్ అనౌన్స్ చేయించారు. ఈ మూవీ యాక్షన్ తో కూడిన స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథతో రూపొందుతోంది. ఇందులో మీర్జాపూర్ సిరీస్ ఫేమ్ దివ్యేందు శర్మ ఒక ముఖ్య పాత్ర చేస్తుండగా కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ మరొక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.
Watch Ram Charan’s Stunning Look in Peddi Movie Teaser
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పెద్ది మూవీలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆస్కార్ అందుకున్న సంగీత దర్శకుడు ఏ ఆర్ రహమాన్ దీనికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఒక్కసారిగా అందరిలో భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచిన పెద్ది మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని శ్రీరామనవమి కానుకగా ఏప్రిల్ 6న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం పెద్ది గ్లింప్స్ టీజర్ అదిరిపోయినట్లు చెప్తున్నారు. ముఖ్యంగా ఇందులో మాస్ పవర్ఫుల్ లుక్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అదరగొట్టగా ఒక డైలాగ్ కూడా సూపర్ గా ఉందని అంటున్నారు. ముఖ్యంగా విజువల్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పెద్ది గ్లింప్స్ లో అదిరిపోనుందని చెప్తున్నారు.
మొత్తంగా అయితే గ్లింప్స్ టీజర్ రిలీజ్ అనంతరం అందరిలో పెద్ది పై అంచనాలు అమాంతం పెరగడం ఖాయం అని టాక్. ఇక ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2026 వేసవి కానుకగా మార్చి 26న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.
Peddi Movie Teaser: A Visual Treat for Mega Fans
ఇక ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ వాటితో కలిసి తన సొంత సంస్థ వ్రిద్ది సినిమాస్ పై యువ నిర్మాత వెంకట సతీష్ కిలారు గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తున్నారు. ఇక పెద్ది మూవీని దర్శకుడు బుచ్చిబాబు అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు చెప్తోంది టీమ్.
ముఖ్యంగా ఉప్పెన అనంతరం చాలా సమయం ఆయన ఈ మూవీ యొక్క స్టోరీ, స్క్రిప్ట్ పై గడిపారని, అన్ని విధాలా అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ని కూడా పెద్ది మూవీ ఎంతో ఆకట్టుకోవడం ఖాయం అని టాక్. మొత్తంగా పెద్ది మూవీ ఇప్పటి నుండే అందరిలో ఎంతో పాజిటివ్ బజ్ అయితే సొంతం చేసుకుంది. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఎంతమేర విజయం సొంతం చేసుకుంటుందో చూడాలి.
What's Your Reaction?






