Athadu Movie Sets World Record with 1500 TV Premieres – Unbeatable Milestone!
Mahesh Babu’s blockbuster Athadu creates history by premiering 1500 times on television, setting a world record! Find out how this Telugu classic achieved this milestone

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అందాల కథానాయిక త్రిష హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అతడు. 2005 ఆగష్టు లో రిలీజ్ అయిన ఈమూవీ అప్పట్లో అతి పెద్ద విజయం సొంతం చేసుకుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చిన ఈ మూవీని జయభేరి ఆర్ట్స్ సంస్థ పై ప్రముఖ సీనియర్ నటుడు మురళీమోహన్ గ్రాండ్ గా నిర్మించారు.
Athadu Movie Creates World Record with 1500 TV Premieres
ఈ మూవీలో పార్ధు అలియాస్ నందుగా తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మంచి ఎంటర్టైన్మెంట్ యాక్షన్ అంశాలతో సాగిన ఈమూవీ యొక్క సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇంట్రెస్టింగ్ యాక్షన్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా అతడు అనగానే అన్ని వర్గాల ఆడియన్స్ లో ఎంతో మంచి క్రేజ్ ఉంది.
ఇక అతడులో అదరక బదులే చెప్పేటి అనే పల్లవితో సాగె టైటిల్ సాంగ్ ని విపరీతమైన క్రేజ్ ఉంది. ఆడియో పరంగా అలానే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరంగా కూడా అప్పట్లో అతడు అదరగొట్టింది. అంతకముందు ఎస్ జె సూర్య తో చేసిన నాని మూవీ తో పెద్ద ఫ్లాప్ చవిచూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ తరువాత గుణశేఖర్ తీసిన సిస్టర్ సెంటిమెంట్ మూవీ అర్జున్ తో యావరేజ్ విజయం అందుకున్నారు.
Athadu’s Popularity & Record-Breaking TV Premieres
వాటి అనంతరం త్రివిక్రమ్ చెప్పిన అతడు కథకి ఓకె చెప్పారు సూపర్ స్టార్. ఆ విధంగా తొలిసారిగా మహేష్, త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ లో అతడు మూవీ రూపొందింది. ఇక ఈమూవీలో బ్రహ్మానందం కామెడీకి కూడా విశేషమైన రెస్పాన్స్ లభించింది. మహేష్ బాబుకి తాతయ్య పాత్రలో సీనియర్ నటుడు నాజర్ నటించగా హీరో ఫ్రెండ్ గా సునీల్ కనిపించారు.
చిన్నతనంలోనే ఒక చిన్న కారణంతో ఇంటి నుండి వెళ్ళిపోయిన తన మనవడు పార్ధు కోసం ఒక పెద్దాయన, వారి కుటుంబం మొత్తం కూడా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తారు. అయితే కొన్నేళ్ల తరువాత వారి ఇంటికి అతడు రావడంతో కుటుంబం మొత్తంలో ఆనందం వెల్లివిరుస్తుంది.
అయితే వచ్చిన అతడు తన మనవడు కాదని వేరొకడని పెద్దాయనతో పాటు వారి కుటుంబం మొత్తం తెలుసుకుంటారు. ఈ మధ్యలో కథ ఏ విధంగా సాగింది, వచ్చిన వాడు పార్ధు కాకుండా ఎవరు, మరి నిజం తెలిసిన అనంతరం అతడిని ఆ కుటుంబం ఏమి చేసింది, ఏ విధంగా వ్యవహరించింది అనేది మొత్తం కూడా వెండితెరపై చూడాల్సిందే. ఇక థియేటర్స్ లో అదరగొట్టిన ఈ మూవీ ఎన్నోసార్లు టెలివిజన్ లో ప్రదర్శితం అయింది.
Athadu’s Impact on Telugu Cinema & TV Audience
అలా ప్రతిసారి కూడా మంచి టిఆర్పి రేటింగ్స్ సొంతం చేసుకున్న అతడు మూవీ ఒక ప్రత్యేకమైన వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. ఇప్పటివరకు అక్కడక్కడా కొన్ని సినిమాలు 1000 సార్లు పైగా టివి లలో ప్రదర్శితం కాగా, వాటన్నిటినీ తలదన్నేలా అతడు మూవీ మొత్తంగా 1500 సార్లు టెలివిజన్ లో ప్రశితం అయింది. ఆ విధంగా అతడు దక్కించుకున్న ఈ రికార్డు టాలీవుడ్ తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమకు తలమానికంగా నిలిచింది.
What's Your Reaction?






