Actresses in Tollywood: Top Heroines List with Photos (2025)

Explore the top actresses in Tollywood with their movie history, latest photos, Instagram buzz, and fan following. Updated heroine list 2025

Actresses in Tollywood: Top Heroines List with Photos (2025)

టాలీవుడ్ లో ప్రస్తుతం పలువురు యువ నటీమణులు తమ ఆకట్టుకునే అందం, నటనతో ఎందరో ఫ్యాన్స్ ని అలానే ఆడియన్స్ ని అలరిస్తూ మంచి పేరుతో కొనసాగుతున్నారు. ఆ విధంగా దూసుకెళ్తున్న నటీమణులు ఎవరు, వారు ఏ ఏ సినిమాల ద్వారా రంగప్రవేశం చేసి ఎంతమేర క్రేజ్, సక్సెస్ లతో దూసుకెళ్తున్నారు అనేది ప్రస్తుతం లిస్ట్ ప్రకారం చూద్దాం. 

1. Samantha Ruth Prabhu  

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సమంతకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో రూపొందిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ 2 లో ఆమె పోషించిన రాజీ పాత్రకు అందరి నుండి విశేషమైన పేరు లభించింది. ఒకింత నాచురల్ గా ఆమె కనిపించిన ఈ పాత్ర దేశవ్యాప్తంగా సమంతకు మంచి పేరు తీసుకువచ్చింది. తొలిసారిగా ఏ మాయ చేసావే సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయిన సమంత రూత్ ప్రభు ఫస్ట్ మూవీతోనే బెస్ట్ హిట్ కొట్టారు. అక్కడి నుండి వరుసగా సిన్మాలు చేస్తూ కొనసాగిన ఆమె ఆనతికాలంలోనే అనేక సక్సెస్ లు అందుకుని గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా క్రేజ్ అందుకున్నారు. ఇటీవల శాకుంతలం, యశోద, బేబీ, యు టర్న్ వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేసి వాటితో మరింత క్రేజ్ అందుకున్నారు. 

Beautiful Tollywood heroines

2. Anushka Shetty

టాలీవుడ్ కి తొలిసారిగా సూపర్ మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టి, అంతకముందు యోగా గురువు భారత్ ఠాకూర్ వద్ద యోగా శిక్షణ తీసుకున్నారు. అనంతరం ఆమెని చూసిన దర్శకుడు పూరి జగన్నాథ్, నాగార్జునతో తీసిన సూపర్ మూవీలో షాషా పాత్రకు ఎంపిక చేసారు. అనంతరం ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకున్న అనుష్క, ఆపైన కోడి రామకృష్ణ తీసిన అరుంధతి మూవీ ద్వారా భారీ విజయం అందుకుని స్టార్ నటిగా విశేషమైన క్రేజ్ తో దూసుకెళ్లారు. ఇక అక్కడి నుండి తెలుగుతో పాటు తమిళ్ లో కూడా సినిమాలు చేసిన అనుష్క, ఆపైన బాహుబలి సిరీస్ సినిమాల్లో దేవసేన పాత్రలో అద్భుతంగా నటిచిం నేషనల్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. 

Top female stars in Telugu cinema

3. Kajal Aggarwal  

తొలిసారిగా తేజ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన లక్ష్మి కళ్యాణం మూవీ ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్, ఆ తరువాత చందమామ మూవీ ద్వారా మంచి విజయం తన ఖాతాలో వేసుకున్నారు. అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఆమె చేసిన మగధీర మూవీ పెద్ద విజయం సొంతం చేసుకుని నటిగా స్టార్ స్టేటస్ ఆమెకు అందించింది. అక్కడి నుండి తెలుగుతో పాటు హింది, తమిళ్ లో కూడా పలు సినిమాలు చేస్తూ విపరీతమైన క్రేజ్, సక్సెస్ లతో దూసుకెళ్లారు. ఇక ఇటీవల సత్యభామ వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీలో కూడా నటించి అందరినీ మెప్పించారు కాజల్. అయితే వివాహం అనంతరం ఒకింత సెలెక్టెడ్ గా ఆమె సినిమాలు చేస్తున్నారు. 

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ – 2025 లిస్ట్

4. Keerthy Suresh 

నేను శైలజ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు కీర్తి సురేష్. రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఆ మూవీలో ఆకట్టుకునే అందం ,యాక్టింగ్ తో అలరించి మంచి సక్సెస్ కూడా అందుకున్నారు కీర్తి. ఇక అక్కడి నుండి మెల్లగా వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుని సక్సెస్ లతో దూసుకెళ్లారు. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు తో సర్కారు వారి పాట, నాని తో నేను లోకల్, నాగ అశ్విన్ తీసిన మహానటి, సినిమాల సక్సెస్ లతో మరింత క్రేజ్ అందుకున్నారు. అలానే మిస్ ఇండియా, పెంగ్విన్ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో కూడా నటించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ, తమిళ్ లో కూడా పలు అవకాశాలతో కొనసాగుతున్నారు కీర్తి సురేష్. 

Famous Telugu movie actresses

5. Tamannaah Bhatia 

టాలీవుడ్ కి మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన శ్రీ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన తమన్నా, ఆ తరువాత శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీ డేస్ మూవీ ద్వారా పెద్ద సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నారు. అక్కడి నుండి ఆమెకు అవకాశాలు రాసాగాయి. అదేసమయంలో నాగచైతన్య హీరోగా రూపొందిన 100% లవ్, కార్తీ ఆవారా సినిమాల సక్సెస్ లు ఆమెకు బాగా క్రేజ్ తీసుకువచ్చాయి. అక్కడి నుండి స్టార్ నటిగా తెలుగు, తమిళ్, హిందీలో కూడా పలు సినిమాలు చేస్తూ కొనసాగిన తమన్నా, ఇటీవల హిందీలో బాబ్లీ బౌన్సర్ మూవీ ద్వారా అక్కడి ఆడియన్స్ ని కూడా అలరించారు. ప్రస్తుతం తమన్నా చేతిలో పలు క్రేజీ మూవీస్ ఉన్నాయి. 

Young Tollywood heroines

6. Shruti Haasan 

సిద్దార్ధ హీరోగా రూపొందిన అనగనగా ఒక ధీరుడు మూవీ ద్వారా తెలుగుకి హీరోయిన్ గా పరిచయం అయింది కమల్ హాసన్ కూతురు శృతి హాసన్. అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఆమె చేసిన గబ్బర్ సింగ్ మూవీ సూపర్ సక్సెస్ హీరోయిన్ గా శృతికి బాగా పేరు తీసుకువచ్చింది. ఆపైన సూపర్ స్టార్ మహేష్ తో శ్రీమంతుడు ఇండస్ట్రీ హిట్ తో అందరిలో మరింతగా పేరు సొంతం చేసుకున్న ఆమె ఆపైన తెలుగు, తమిళ్, హిందీ సినిమాల అవకాశాలతో దూసుకెళ్లారు. కేవలం నటిగానే కాక అటు సింగర్, మ్యూజిక్ కంపోజర్ గా కూడా ఆ,అక్కడక్కడ సినిమాలకు పని చేసారు శృతి హాసన్. ఇక ప్రస్తుతం ఆమె చేతిలో పలు భారీ సినిమాలు ఉన్నాయి. 

హిట్ సినిమాలు, సోషల్ ఫాలోయింగ్, గ్లామర్ రేంజ్

7. Raashi Khanna 

తెలుగు చిత్ర పరిశ్రమకి తొలిసారిగా అవసరాల శ్రీనివాస్ తీసిన ఊహలు గుసగుసలాడడే మూవీ ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన రాశి ఖన్నా, ఆ మూవీ ద్వారా మంచి విజయం అందుకున్నారు. అనంతరం ఆమెకు మెల్లగా అవకాశాలు రసాగాయి. వరుణ్ తేజ్ తో తొలిప్రేమ, సాయి ధరమ్ తేజ్ తో ప్రతిరోజు పండగే, రామ్ తో హైపర్ వంటి సక్సెస్ఫుల్ సినిమాల్లో ఆమె నటించారు. అలానే అటు తమిళ్ లో కూడా పలు అవకాశాలు అందుకున్నారు రాశి ఖన్నా. తాజాగా తెలుగు, తమిళ్ తో పాటు హిందీలో పలు ఛాన్స్ లతో ఆమె దూసుకెళ్తున్నారు. 

Trending actresses in Tollywood 2025

8. Rashmika Mandanna 

ఛలో మూవీ ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న, ఆ తరువాత భీష్మ సక్సెస్ తో మరింత పేరు అందుకున్నారు. ఆపైన సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేసిన సరిలేరు నీకెవ్వరు భారీ విజయం నటిగా ఆమెకు విశేషమైన పేరు తీసుకువచ్చింది. అక్కడి నుండి స్టార్ నటిగా దూసుకెళ్లిన రష్మిక తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సక్సెస్ గా మలుచుకుని నేషనల్ క్రష్ గా తెలుగు, హిందీ, తమిళ్ ఆడియన్స్ నుండి మంచి పేరు సొంతం చేసుకున్నారు. అల్లు అర్జున్ తో చేసిన పుష్ప సిరీస్ సినిమాలు, రణబీర్ తో చేసిన ఆనిమల్ సినిమాల భారీ విజయాలు ఆమెకు నేషనల్ వైడ్ గా విపరీతమైన గుర్తింపు, పేరు తీసుకువచ్చాయి. ప్రస్తుతం రష్మిక చేతిలో పలు బడా మూవీ ఆఫర్స్ ఉన్నాయి. 

అభిమానులలో క్రేజ్ మరియు తాజా ఫోటో గ్యాలరీ

9. Sreeleela 

యువ నటి శ్రీలీల తొలిసారిగా పెళ్లి సందడి మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన తీసిన ధమాకా మూవీ భారీ విజయం శ్రీలీలకు మంచి పేరు తీసుకువచ్చింది. అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన గుంటూరు కారం మూవీ కూడా సక్సెస్ కావడంతో స్టార్ నటిగా శ్రీలీల పేరు అంతటా మరింతగా వినిపించసాగింది. ఆపైన దాదాపుగా చాలా మంది హీరోలతో వర్క్ చేసిన శ్రీలీల, ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళ్, హిందీ సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. హిందీలో ఆషికి 3 మూవీతో ఆమె ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రస్తుతం కెరీర్ పరంగా శ్రీలీల చేతిలో పలు క్రేజీ ప్రాజక్ట్స్ ఉన్నాయి. 

10. Pooja Hegde  

తొలిసారిగా నాగచైతన్య హీరోగా రూపొందిన ఒక లైలా కోసం మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే, ఆ మూవీతో విజయం అందుకున్నారు. అనంతరం వరుణ్ తేజ్ తో ముకుంద, అల్లు అర్జున్ తో డీజే సినిమాలు చేసారు. ఆపైన హరీష్ శంకర్ దర్శకత్వంలో మరొక్కసారి వరుణ్ తేజ్ తో ఆమె చేసిన మూవీ గద్దలకొండ గణేష్. ఆ మూవీ విజయం నటిగా పూజాకు బాగా పేరు తీసుకువచ్చింది. అనంతరం ఎన్టీఆర్ తో అరవింద సమేత సూపర్ హిట్, అలానే అల్లు అర్జున్ తో చేసిన అలవైకుంఠపురములో మూవీ ఇండస్ట్రీ హిట్ తో స్టార్ నటిగా విపరీతమైన క్రేజ్ తో దూసుకెళ్లారు పూజా. ఆపైన తెలుగు తోపాటు అటు తమిళ్, హిందీ సినిమా పరిశ్రమల్లో కూడా పూజా హెగ్డే కు మంచి అవకాశాలు రాసాగాయి. వాటిని సక్సెస్ లుగా మలుచుకుంటూ కొనసాగుతున్న ఆమె చేతిలో ప్రస్తుతం పలు ప్రాజక్ట్స్ ఉన్నాయి. 

Actresses with highest Instagram followers Tollywood

11. Sai Pallavi 

తెలుగు చిత్రసీమకు తొలిసారిగా ఫిదా సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీలోనే తన డ్యాన్స్, నాచురల్ యాక్టింగ్ తో అందరి  మనసులు దోచారు సాయి పల్లవి. ఆ మూవీ భారీ విజయం ఆమెకు హీరోయిన్ గా బాగా పేరు తీసుకువచ్చింది. అనంతరం ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ కొనసాగిన సాయి పల్లవి, ఆపైన నానితో ఎంసీఏ, శ్యాం సింగ రాయ్ సినిమాల సక్సెస్ లతో మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు. అనంతరం నాగ చైతన్యతో లవ్ స్టోరీ, తండేల్ మూవీ భారీ విజయాలు కూడా ఆమెకు బాగా పేరు తీసుకువచ్చాయి. అటు తమిళ్ లో అమరన్ సూపర్ డూపర్ హిట్ తో అక్కడి ఆడియన్స్ నుండి కూడా క్రేజ్ అందుకున్నారు సాయి పల్లవి. ప్రస్తుతం బాలీవుడ్ కి రామాయణ మూవీ ద్వారా ఎంట్రీ కి సిద్దమైన సాయి పల్లవి మరోవైపు పలు క్రేజీ ప్రాజక్ట్స్ కూడా చేస్తున్నారు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow