Sankranthiki Vasthunam Review : Fantastic Family Comedy Entertainer
Sankranthiki Vasthunam Review Rating టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ లో ఒకరైన విక్టరీ వెంకటేష్ హీరోగా యువ అందాల కథానాయికలు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో

'సంక్రాంతికి వస్తున్నాం' రివ్యూ : ఆకట్టుకునే ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్
సినిమా పేరు : సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)
రేటింగ్ : 3.5 / 5
తారాగణం : విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, వికె నరేష్, విటివి గణేష్, శ్రీనివాస్ అవసరాల తదితరులు
సంగీతం : భీమ్స్ సిసిలోరియో
నిర్మాత : దిల్ రాజు
దర్శకుడు : అనిల్ రావిపూడి
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ లో ఒకరైన విక్టరీ వెంకటేష్ హీరోగా యువ అందాల కథానాయికలు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం.
ఈ మూవీని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు, తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో అత్యధిక వ్యయంతో నిర్మించగా భీమ్స్ సిసిలోరియో ఇక టీజర్, ట్రైలర్ తో ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అందరికీ చెప్పకనే చెప్పారు దర్శకుడు అనిల్ రావిపూడి. గతంలో వెంకటేష్ తో ఆయన తీసిన ఎఫ్2, ఎఫ్3 మూవీస్ రెండూ కూడా బాక్సాఫీస్ వద్ద విజయవంతం అవడంతో అందరిలో సంక్రాంతికి వస్తన్నాం పై మంచి హైప్ ఏర్పడింది. మరి ఈ మూవీ యొక్క పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం.
కథ :
అనుకోకుండా జరిగిన ఒక ఘటనతో తన పోలీస్ ఉద్యోగ బాధ్యతల నుండి తప్పుకున్న యాదగిరి దామోదర రాజు, ఆపై హఠాత్తుగా ఒక కేసు విషయమై మళ్ళి నియమితం అవుతాడు. ఇక ఆ కేసులో ఒక యువ లేడీ పోలీస్ అధికారి కూడా భాగం అవుతుంది. మరి ఇంతకీ రాజు కి పోలీస్ లు అప్పగించిన కేసు ఏమిటి అతడు దానిని ఏవిధంగా పరిష్కరించాడు అనేది మొత్తం తెలియాలి అంటే సంక్రాంతికి వస్తున్నాం మూవీ థియేటర్స్ లో చూడాల్సిందే.
నటీనటుల పెర్ఫార్మన్స్ :
ముందుగా ఈ మూవీలో యాదగిరి దామోదర రాజుగా మరొక్కసారి తన ఆకట్టుకునే ఎంటర్టైనింగ్ యాక్టింగ్ తో నటుడు విక్టరీ వెంకటేష్ ఆకట్టుకున్నారు. వెంకటేష్ కామెడీ టైమింగ్ మన అందరికీ తెలిసిందే. దానిని ఎఫ్ 2, ఎఫ్ 3 అనంతరం మరొకసారి ఈ మూవీ ద్వారా బాగా వాడుకున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.
ఇక కీలకమైన ఆయన భార్య పాత్ర చేసిన ఐశ్వర్య రాజేష్ మంచి పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలో నటించి తన నటనతో అందరినీ అలరించారు. ఇక కీలకమైన కేసు లో భాగంగా కనిపించే యువ నటి మీనాక్షి చౌదరి కూడా తన అందం, అభినయంతో అలరించారు. అలానే ఇతర ముఖ్య పాత్రలు చేసిన వికె నరేష్, విటివి గణేష్, శ్రీనివాస్ అవసరాల, బుల్లిరాజుగా నటించిన మాస్టర్ రేవంత్ ఇలా ప్రతి ఒక్కరి పెర్ఫార్మన్స్ ఎంతో బాగుంది.
ప్లస్ పాయింట్స్ :
ఎంటర్టైనింగ్ గా ఆకట్టుకునే సీన్స్ తో సాగే ఫస్ట్ హాఫ్
దామోదర రాజుగా తన పాత్రలో ఆకట్టుకున్న వెంకటేష్
మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ల నటన
ముఖ్యంగా బుల్లిరాజుగా నటించిన మాస్టర్ రేవంత్
గోదారి గట్టు మీద, మీను సాంగ్స్ బాగున్నాయి
మైనస్ పాయింట్స్ :
సాదా సీదాగా సాగె సెకండ్ హాఫ్
ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్
కొన్నిచోట్ల కామెడీ అంతగా పండలేదు
Sankranthiki Vasthunam Review Telugu
Sankranthiki Vasthunam Review Rating
విశ్లేషణ :
ముందుగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ గురించి చెప్పుకోవాల్సింది దర్శకుడు అనిల్ రావిపూడి గురించి. గతంలో తన మార్క్ కామెడీ, ఎంటర్టైన్మెంట్ అంశాలతో ఆకట్టుకున్న అనిల్, మరొక్కసారి తన మూవీని అదే అంశాలతో ఈ సంక్రాంతి బరిలో నిలిపి విజయం అందుకున్నారు. ఇక విక్టరీ వెంకటేష్ లోని ఎంటర్టైన్మెంట్ డైలాగ్స్, స్టైల్ ని బాగా వినియోగించుకున్నారు దర్శకుడు అనిల్.
అలానే యువ అందాల నటీమణులు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఇద్దరూ కూడా తమ తమ పాత్రల యొక్క పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఐశ్వర్య రాజేష్ భాష, డైలాగ్స్ చెప్పిన విధానం మరింతగా అలరిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వెంకీ, ఐశ్వర్య ల జోడీకి మంచి మార్కులు వేస్తున్నారు. ఇక ఇతర ముఖ్య పాత్రలు చేసిన విటివి గేష్, సీనియర్ వికె నరేష్, బుల్లి రాజు పాత్ర చేసిన మాస్టర్ రేవంత్ సహా అందరూ అదరగొట్టారు.
సంగీత దర్శకుడు భీమ్స్ అందించిన సాంగ్స్, ముఖ్యంగా అందరినీ ఆకట్టుకునేలా సరదాగా సాగే ఎంటర్టైన్మెంట్ పద్ధతిలో దర్శకుడు అనిల్ రావిపూడి తీసిన విధానం బాగున్నాయి. సంక్రాంతి పండుగ కావడంతో ఈ ఎంటర్టైనర్ మూవీకి అందరూ కూడా ఎంతో కనెక్ట్ అవుతున్నారు. నేటితో ఈ మూవీ సక్సెస్ఫుల్ గా అన్ని ఏరియాల్లో బ్రేకీవెన్ సొంతం చేసుకుంది. రాబోయే రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం మూవీ రూ. 100 కోట్ల షేర్ కూడా సొంతం చేసుకునే అవకాశం గట్టిగా కనపడుతోంది.
తీర్పు :
మొత్తంగా విక్టరీ వెంకటేష్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ల క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ గా ఆడియన్స్ నుండి సూపర్ డూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు ప్రస్తుతం థియేటర్స్ లో అదరగొడుతూ దూసుకెళ్తోంది. వెంకీ మార్క్ కామెడీ టైమింగ్, దర్శకుడు అనిల్ రావిపూడి టేకింగ్, సాంగ్స్, ఎంటర్టైన్మెంట్ అంశాలు ఈ మూవీకి ప్రధాన బలాలు. చక్కగా ఈ మూవీని మీ మీ ఫ్యామిలీస్ తో కలిసి థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి.
Sankranthiki Vasthunam Review 123telugu
What's Your Reaction?






