Pawan Kalyan OG Movie Full Form Revealed

Find out what OG means in Pawan Kalyan’s much-awaited film! The powerful full form of OG is finally revealed with an exciting backstory

Pawan Kalyan OG Movie Full Form Revealed

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాల్లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu) మూవీ ఒకటి. తాజాగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలిసి తీస్తున్న భారీ హిస్టారికల్ యాక్షన్ డ్రామా మూవీ హరి హర వీర మల్లు మూవీ యొక్క షూటింగ్ పూర్తి చేసారు పవన్ కళ్యాణ్. 

Pawan Kalyan OG release date

ప్రస్తుతం వేగవంతంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈమూవీ జులై 18న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ మూవీలో పవన్ కళ్యాణ్, వీర మల్లు అనే గజదొంగ పాత్ర చేస్తుండగా అయన సరసన హీరోయిన్ గా నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) నటిస్తున్నారు. 

పవన్ కళ్యాణ్ OG మూవీ – OG పూర్తి రూపం ఏమిటి?

మెగా సూర్య ప్రొడక్షన్స్ సంస్థ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.  ఇక దీనితో పాటు తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ యొక్క షూటింగ్ కూడా ప్రారంభించారు పవన్. 

అయితే ఈ మూవీని విజయ్ హీరోగా తమిళ్ లో రూపొంది పెద్ద విజయం సొంతం చేసుకున్న తేరికి రీమేక్ గా రూపొందుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కాగా లేటెస్ట్ గా ప్రారంభం అయిన షెడ్యూల్ ప్రకారం దీనిని ఫ్రెష్ గా పూర్తిగా కొత్త కథతో దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నట్లు చెప్తున్నారు. 

ఇందులో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్ర చేస్తుండగా ఆయనకు జోడీగా శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇది వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది. 

Powerstar Pawan Kalyan OG Film

ఈ మూవీ పై కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఈమూవీతో పాటు సాహూ, రన్ రాజా రన్ సినిమాల దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ ఓజి. 

ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఒక మాస్ గ్యాంగ్ స్టర్ పాత్ర చేస్తుండగా ఆయనకు జోడీగా ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటిస్తున్నారు. దీనిని గ్రాండియర్ లెవెల్లో ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవల చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఓజిలో తాజా తన పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేశారు పవన్. 

OG అంటే ఏమిటి? – సినిమాలో దాగిన అర్థం

కేవలం మరొక మూడు రోజుల ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉన్న ఈ మూవీ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. ఇటీవల ఓజి మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై ఎన్నో అంచనాలు ఏర్పరిచాయి. 

ఇక ఓజి లో ప్రకాష్ రాజ్ తో పాటు అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలు చేస్తున్నారు. తన అభిమాన పవర్ స్టార్ తో చేస్తున్న మూవీ కావడంతో దర్శకుడు సుజీత్ ఈ మూవీకి సంబంధించి ప్రతి విషయమై ఎంతో శ్రద్ధ తీసుకుని తెరకెక్కిస్తున్నట్లు టాక్. 

Pawan Kalyan OG Movie Release Date

అయితే అసలు విషయం ఏమిటంటే, ఓజి అంటే ఏమిటి అనేది చాలా మంది పవన్ ఫ్యాన్స్ తో పాటు పలువురు నార్మల్ ఆడియన్స్ లో గల సందేహం. ఈ విషయమై ఇటీవల దర్శకుడు సుజీత్ ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ, ఓజి అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని, కాగా ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు ఓజాస్ గంభీర అని తెలిపారు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత్రకి OG టెగ్ ఎందుకు పెట్టారు?

ముఖ్యంగా ఇందులో పవర్ స్టార్ యాక్టింగ్ తో పాటు స్టైల్, స్వాగ్, డైలాగ్స్, ఫైట్స్ వంటివి ఫ్యాన్స్ కి ఎంతో నచ్చుతాయని, సాధారణ ప్రేక్షకులు సైతం ఓజి మూవీని ఎంతో ఆదరిస్తారనే నమ్మకాన్ని ఆయన వెలిబుచ్చారు. ఇక త్వరలో ఓజి మూవీ నుండి ఒక్కొక్కటిగా అప్ డేట్స్ వరుసగా రానున్నాయి. 

ఇక ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఒక కీలక పాత్ర చేస్తునట్లు ఇటీవల వార్తలు రాగ అవి కేవలం పుకార్లు మాత్రమే అంటూ రేణు దేశాయ్ కొట్టిపారేశారు. మొత్తంగా అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఓజి మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ అనంతరం పెద్ద విజయం అందుకుని హీరోగా పవన్ రేంజ్ ని మార్కెట్ ని మరింతగా పెంచాలని కోరుకుందాం.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow