Tamannaah Bhatia's new song ‘Nasha’ from Raid 2 is going viral from Raid 2
Experience Tamannaah Bhatia's New Song captivating dance in 'Nasha' from Raid 2. Discover why this track is the talk of the town.

తెలుగు సినిమా పరిశ్రమ (Tollywood) లో ప్రస్తుతం స్టార్ నటిగా పలు అవకాశాలతో మంచి క్రేజ్ తో కొనసాగుతున్న వారిలో తమన్నా భాటియా (Tamannaah Bhatia) కూడా ఒకరు. కెరీర్ పరంగా తొలిసారిగా యువ నటుడు మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన శ్రీ సినిమా ద్వారా ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.
ఆ సినిమాలో తన ఆకట్టుకునే అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకున్నారు తమన్నా. అనంతరం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ డేస్ (Happy Days) సినిమాలో యువ నటుడు వరుణ్ సందేశ్ తో సరసన నటించిన తమన్నా ఆ సినిమా ద్వారా భారీ విజయం సొంతం చేసుకున్నారు. ఇక అక్కడి నుండి ఆమెకు నటిగా మంచి అవకాశాలు ఒక్కొక్కటిగా రాసాగాయి.
తమన్నా భాటియా కొత్త పాట ‘నషా’ – సోషల్ మీడియాలో సంచలనం!
అయితే వచ్చిన ఛాన్స్ లని వినియోగించుకుని పలు సక్సెస్ లు సొంతం చేసుకుని ఎందరో ప్రేక్షకాభిమానుల నుండి మంచి పేరు, క్రేజ్ సొంతం చేసుకున్నారు తమన్నా.
ఇక టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NT Ramarao Jr), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సహా పలువురు ఇతర నటుల సరసన కూడా నటించి ఆకట్టుకున్నారు. అనంతరం అటు తమిళ్ లో కూడా ఆమెకు అవకాశాలు ఊపందుకున్నాయి.
తమన్నా భాటియా 'నషా' పాటలో మెరిసిన నృత్యం
కాగా వాటిని కూడా వినియోగించుకుని తమిళ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ అందుకున్నారు తమన్నా. ఆపైన అటు హిందీ సినిమా పరిశ్రమలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన తమన్నా భాటియా అక్కడ కూడా మంచి సినిమాలు చేశారు.
ఇక ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో యువ దర్శకుడు అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లింగ్ యాక్షన్ సూపర్ నతురల్ మూవీ ఓదెల 2 (Odela 2). ఈ మూవీని సంపత్ నంది నిర్మించారు.
అందులో అఘోరి పాత్రలో తమన్నా నటన అందరినీ ఎంతో ఆకట్టుకుంది. కాగా ఓదెల 2 సినిమా బాగానే ఆడింది. ఇక తాజాగా అజయ్ దేవగన్ హీరోగా బాలీవుడ్ ఆడియన్స్ ముందుకి వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రెయిడ్ 2 (Raid 2). కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయి పెద్ద విజయం సొంతం చేసుకున్న రెయిడ్ మూవీకి ఇది అఫీషియల్ సీక్వెల్.
కాగా ఈ మూవీలో వాణి కపూర్, రితేష్ దేశ్ ముఖ్ ప్రధాన పాత్రల్లో నటించగా రాజ్ కుమార్ గుప్తా దీనిని తెరకెక్కించారు. ప్రస్తుతం థియేటర్స్ లో ఆడియన్స్ ని మెప్పిస్తూ నాగ కలెక్షన్ తో కొనసాగుతోంది రెయిడ్ 2 మూవీ. అయితే అసలు విషయం ఏమిటంటే ఈ మూవీలో నషా Nasha అనే పల్లవితో సాగె సాంగ్ లో ప్రత్యేకంగా నర్తించారు తమన్నా.
Tamannaah Bhatia New Song
తమన్నా డాన్స్ పై అభిమానుల స్పందన
ఈ డ్యాన్స్ నెంబర్ ని వైట్ నాయిస్ కలెక్టివ్స్ వారు కంపోజ్ చేయగా జాస్మిన్ సండ్లస్, సాచెట్ టాండన్, దివ్య కుమార్, సుమంతో ముఖేర్జీ అద్భుతంగా ఆలపించారు. ఇక ఈ సాంగ్ ని జానీ రచించారు. కాగా ఈ సాంగ్ లో తమన్నా స్టైల్, డ్యాన్స్ కి యువత తో పాటు మాస్ ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ లభిస్తోంది.
ముఖ్యంగా ఆమె డ్యాన్స్ తో పాటు స్టైల్ కి వారు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం థియేటర్స్ లో ఎంతో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటున్న నషా సాంగ్ అటు యూట్యూబ్ లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ తో కొనసాగుతోంది.
ఆ విధంగా అటు హీరోయిన్ గా నటిస్తూనే అలానే ప్రత్యేక డ్యాన్స్ నంబర్స్ కూడా చేస్తున్నారు తమన్నా. ఇక ప్రస్తుతం ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజక్ట్స్ ఉన్నాయి. కాగా వాటిలో తమన్నా మరిన్ని సక్సెస్ లని అలానే పేరుని సొంతం చేసుకోవాలని మన Telugu Movie Media కోరుకుంటోంది.
What's Your Reaction?






