Basil Joseph’s Maranamass OTT Debut on Sony LIV

Catch Basil Joseph in his Maranamass OTT premiere streaming now on Sony LIV. Don’t miss this power-packed Malayalam Blockbuster!

Basil Joseph’s Maranamass OTT Debut on Sony LIV

మలయాళ చిత్ర పరిశ్రమలో నటుడు, దర్శకుడైన బాసిల్ జోసెఫ్ (Basil Joseph) కు ఎంతో మంచి క్రేజ్ ఉంది. అతడి నుండి సినిమాలు వస్తున్నాయి అంటే అక్కడి ఆడియన్స్ లో మంచి క్రేజ్, ఇంట్రెస్ట్ ఉంటయి. ఆ విధంగా మళయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పేరు సొంతం చేసుకున్నారు బాసిల్ జోసెఫ్. 

ఇక ఇటీవల కోవిడ్ అనంతరం ఓటిటి ఒక్కసారిగా ఊపందుకోవడంతో పాటు పలు భాషల సినిమాలు అన్ని కూడా ఇతర భాషల్లో డబ్ అవుతూ అందరికీ అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మలయాళ సినిమా పరిశ్రమ అక్కడి నుండి మరింతగా ఊపందుకుని తమ భాషతో పాటు ఇతర భాష ప్రేక్షకులకి కూడా మరింతగా చేరువైంది. 

బేసిల్ జోసఫ్ "మరణ మాస్" ఓటిటి ప్రీమియర్ సోనీ లివ్ లో

ఇక ఇటీవల మలయాళంలో రూపొందిన పలు సినిమాలు తెలుగు సహా ఇతర భాషల్లో కూడా డబ్ కాబడి మంచి కలెక్షన్ సొంతం చేసుకుంది భారీ వియయాలుగా నిలిచాయి. వాస్తవానికి సినిమాకి భాష అనేది లేదు, ఆకట్టుకునే కథ, కథనాలు ఉంటె చాలు ప్రతి భాషా ప్రేక్షకుడు కూడా వాటికి కనెక్ట్ అవుతాడు అనేది వాస్తవం. 

ఇక ఇటీవల సూక్ష్మదర్శిని, ప్రవీన్ కూడు షప్పు సినిమాల విజయాలతో మంచి జోరు మీదున్న బాసిల్ జోసెఫ్ తాజాగా శివ ప్రసాద్ దర్శకత్వంలో నటించిన మూవీ మరణ మాస్ (Maranamass). ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ కూడా విజయవంతం అయింది. 

రూ. 8 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈమూవీ ఓవరాల్ గా రూ. 18 కోట్లని రాబట్టింది. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ కోసం ఎదురు చూసిన ఆడియన్స్ కోసం తాజాగా ఆ న్యూస్ బయటకు వచ్చింది. ప్రముఖ ఓటిటి మాధ్యమం సోనీ లివ్ (Sony LIV) ద్వారా మరణ మాస్ మూవీ మే 15న మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. 

తెలుగు ప్రేక్షకుల కోసం బాసిల్ జోసఫ్ హంగామా షురూ

ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కూడా ఈమూవీ యొక్క ఓటిటి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ కూడా బాసిల్ కి మంచి పేరు ఉంది. కాగా బ్లాక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన మరణ మాస్ మూవీకి జేకే సంగీతం అందించగా టోవినో థామస్ ప్రొడక్షన్స్, రాప్ హీల్ ప్రొడక్షన్స్, వరల్డ్ వైడ్ ఫిలిమ్స్ సంస్థలు గ్రాండ్ గా నిర్మించాయి. 

ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ స్టార్ట్ - మీ సోనీ లివ్‌లో చూడండి

రాజేష్ మాధవన్, సిజు సన్నీ, బాబు ఆంటోనీ, సురేష్ కృష్ణ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు చేసారు. ఒక నగరాన్ని భయపెట్టే సీరియల్ కిల్లర్ అనుకోకుండా అతడి టార్గెట్, అలానే ఒక అమ్మాయి, ఆమె లవర్, ఒక నైట్ బస్సులో ఇరుక్కుంటారు. 

అనంతరం ఎటువంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి అనే కథాంశంతో ఇంట్రెస్టింగ్ డార్క్ కామెడీ, థ్రిల్లింగ్, సర్ప్రైజింగ్ సీన్స్ తో ఈ మూవీ రూపొందింది. ఈ మూవీలో లూక్ పాత్రలో మరొక్కసారి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు బాసిల్ జోసెఫ్. మరి థియేటర్స్ లో అందరినీ అలరించిన మరణ మాస్ మూవీ, ఎంతమేర ఓటిటి ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో ఏ స్థాయి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి. కాగా ఇటువంటి మరిన్ని ఓటిటి మూవీ అప్ డేట్స్, మూవీ న్యూస్ కోసం మన Telugu Movie Media ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి      

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow