Lokah Chapter 1: Chandra Review (Telugu) – India’s First Female Superhero Epic

Lokah Chapter 1: Chandra review in Telugu — India’s first female superhero blockbuster, celebrated for its stunning visuals, rooted folklore, and Kalyani Priyadarshan's striking performance

Lokah Chapter 1: Chandra Review (Telugu) – India’s First Female Superhero Epic

కొత్త లోక చాప్టర్ 1 చంద్ర రివ్యూ (Kotha Lokah Movie Review in Telugu) : అలరించే అద్భుతమైన సూపర్ హీరో మూవీ 

విడుదల తేదీ : 29 ఆగష్టు 2025

సినిమా పేరు : కొత్త లోక చాప్టర్ 1 చంద్ర 

రేటింగ్ : 3. 5 / 5

నటీనటులు : కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్, చందు సలీం కుమార్, నిశాంత్ సాగర్, రఘునాథ్ పాలెరీ, నిత్యశ్రీ తదితరులు 

దర్శకత్వం : డామినిక్ అరుణ్ 

నిర్మాత : దుల్కర్ సల్మాన్ 

సంగీతం : జేక్స్ బిజోయ్ 

సినిమాటోగ్రఫీ : నిమిష్ రవి 

కొత్త లోక – చాప్టర్ 1: చంద్ర సమీక్ష – భారతదేశంలో మొదటి మహిళా సూపర్‌హీరో

ఇటీవల యువ నటి కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నిర్మించిన సూపర్ హీరో యాక్షన్ మూవీ కొత్త లోకా ఛాపర్ 1 చంద్ర. ఈ మూవీని యువ మలయాళ దర్శకుడు డామినిక్ అరుణ్ తెరకెక్కించగా జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు. ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్సు ముందుకి వచ్చిన ఈమూవీ మలయాళంలో ముందుగా రిలీజ్ అయి పెద్ద విజయం సొంతం చేసుకుంది. తాజాగా దీనిని తెలుగులో కూడా రిలీజ్ చేయగా బాగా క్రేజ్ తో కొనసాగుతోంది. మరి ఈ మూవీ యొక్క పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం. 

Telugu Movie Reivew

కథ :

చంద్ర అలియాస్ నీలి అనే అమ్మాయి కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) సూపర్ పవర్స్ ని కలిగి ఉంటుంది. అయితే అంతకముందు ఒక ఒక  మిషన్ లో భాగంగా ఆమె శత్రువుల దాడి నుండి త్రుటిలో తప్పించుకుంటుంది. అయితే ఆ ఘటన అనంతరం మూతోన్ మమ్ముట్టి వాయిస్ ఆమెని జాగ్రత్తగా రహస్యంగా ఉండాలని హెచ్చరిస్తాడు. 

ఆ తరువాత చంద్ర బెంగళూరుకి వెళ్తుంది. అక్కడే ఎవరికీ తెలియకుండా ఎంతో రహస్యంగా జీవిస్తుంటుంది. అయితే ఆమె ప్రక్క ఇంట్లో నివాసముండే ముగ్గురు యువకుల్లో ఒకడైన సన్నీ నస్లేన్ (Naslen) ఆమెకి ఆకర్షితుడై ఎలాగైనా పరిచయం పెంచుకుని ఆమెతో సన్నిహితంగా ఉండాలని భావిస్తాడు. 

Lokah Chapter 1 Chandra Review Telugu

అయితే ఇదే సమయంలో ఇన్స్పెక్టర్ గా పని చేసే నాచియప్పన్ గౌడ శాండీ మాస్టర్ అనుకోని ఒక ఘటన కారణంగా అనుమానం కలుగుతుంది. మరి ఇంతకీ ఆ ఘటన ఏమిటి, అసలు అతడికి చంద్ర మీద ఎందుకు అనుమానం వచ్చింది. మరి సన్నీ ఆమెతో స్నేహం చేశాడా, ఆపైన కథ ఏవిధమైన మలుపులు తిరిగింది. అసలు చంద్ర ఎవరు, ఆమె గతం ఏమిటి ఇలాంటి ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానం దొరకాలి అంటే మూవీ తెరపై చూడాల్సిందే. 

ప్లస్ పాయింట్స్ :

ముఖ్యంగా కొత్త లోక మూవీలో చంద్ర పాత్రలో నటించిన హీరోయిన్ కళ్యాణ్ ప్రియదర్శన్ తన పాత్రకి జీవం పోశారని చెప్పాలి. సూపర్ హీరో పాత్రలో ఆమె నటన ఎంతో బాగుంది. ముఖ్యంగా పలు కీలక యాక్షన్ సీన్స్ లో ఎంతో బాగా నటించింది. వాస్తవానికి భారతీయ సినిమాల్లో మహిళా సూపర్ హీరోల పాత్రలు తక్కువ అని చెప్పాలి. 

కొత్త లోక చాప్టర్ 1 చంద్ర కథ, పాత్రలు & దర్శకత్వం విశ్లేషణ

ఒకరకంగా ఇంత గ్రాండ్ గా మహిళా సూపర్ హీరో మూవీగా రూపొందిన మూవీ ఇదే అని చెప్పకతప్పదు. ఇప్పటికే తమ చిత్ర సీమ నుండి పలు అద్భుతమైన సినిమాలు అందించిన మలయాళ చిత్ర పరిశ్రమ వారు మరొక్కసారి ఈ తరహా సినిమాని మన ముందుకి తీసుకువచ్చారు. 

అయితే సాధారణ సినిమాల మాదిరిగా ఒక విలన్ ని పెట్టి హీరోయిన్ ప్రధాన పాత్ర కాబట్టి ఆమె అతడితో యుద్ధం చేయడం కాకుండా దీనిని ఒక సినిమాటిక్ యూనివర్స్ మూవీగా ఆకట్టుకునే కథ, కథనాలతో దర్శకుడు డామినిక్ అరుణ్ చక్కగా తెరకెక్కించారు. ముఖ్యంగా కేరళకు చెందిన జానపద కథకు సూపర్ హీరో టచ్ ని జోడించడం బాగుంది. 

Lokah Chapter 1 Telugu Movie Review

ఆ విధంగా కలిపి సినిమాని ఆకట్టుకునేలా దర్శకుడు ముందుకి తీసుకెళ్లాడు. ప్రీ ఇంటర్వెల్ సీన్ తో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే పలు యాక్షన్ సీన్స్ అయితే ఎంతో బాగుంటాయి. దానికి తోడు సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చక్కగా సెట్ అయి సీన్స్ ని మరింతగా ఎలివేట్ చేసింది. ఇక ఇతర నటీనటులైన నస్లేన్, శాండీ మాస్టర్ ఇద్దరూ కూడా తమ తమ పాత్రల్లో అదరగొట్టారు. యాక్షన్ సెక్కున్స్ తో పాటు కళ్యాణి ప్రియదర్శన్ చేసిన స్టంట్స్ కూడా అలరిస్తాయి. విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు మలయాళ స్టార్ నటుడు టోవినో థామస్ క్యామియో పాత్ర కూడా అలరిస్తుంది. 

మైనస్ పాయింట్స్ :

నిజానికి ఇటువంటి సూపర్ హీరో సినిమాటిక్ మూవీలో ఎమోషనల్ అంశాలు మరింత బలంగా రాసుకుని ఉంటే బాగుండేది. ఇక ఫస్ట్ హాఫ్ లో చంద్ర, సన్నీ మధ్య వచ్చే బాండింగ్ సీన్స్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ లో మాత్రం అవి కొద్దిగా సాగతీసినట్లు అనిపిస్తాయి. వాటిని మరింత ఆకట్టుకునేలా రాసుకోవాల్సింది. ఇక ఇటువంటి సినిమాలకు అవతల సరైన విలన్ ఉండాలి, అయితే విలన్ గా నాచియప్పన్ గౌడ చేసిన శాండీ మాస్టర్ నటనతో ఆకట్టుకున్నప్పటికీ ఆ పాత్రలో అంత పవర్ఫుల్ ఇంపాక్ట్ కనిపించదు. 

Lokah Chandra Movie Review in Telugu

ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ కొంత నీరసంగా సాగుతుంది. వాస్తవానికి సినిమాటిక్ యూనివర్స్ అనే అంశం పై ఎక్కువ దృష్టి పెట్టడంతో కొంత కథ అంతగా ఆకట్టుకోదు. అయితే ప్రధానంగా మూవీ మొత్తం కూడా చంద్ర చుట్టూనే తిరిగినా పలు సపోర్ట్ పాత్రలకు సరైన ప్రాధాన్యత లేకపోవడంతో పాటు కొన్ని పాత్రలు మనకు కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తాయి. 

సాంకేతిక విభాగం

ముఖ్యంగా దర్శకుడు డామినిక్ అరుణ్ అద్భుతంగా తన దర్శకత్వ ప్రతిభని ప్రదర్శించారు అని చెప్పాలి. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా సాగతీతగా అనిపించినప్పటికీ ఓవరాల్ గా ఇటువంటి కథతో తన దర్శకత్వ ప్రతిభ అద్భుతం. టెక్నీకల్ గా కొత్త లోక చాప్టర్ 1 చంద్ర ఆకట్టుకుంటుంది. నిమిష్ రవి గ్రాండియర్ విజువల్స్ తో పాటు జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వాల్యూస్, గ్రాఫిక్స్ వంటివి ఎంతో బాగా కుదిరాయి. డబ్బింగ్ వర్క్ కూడా బాగున్నప్పటికీ ఎడిటింగ్ విభాగం వారు మాత్రం మరింత ఎఫెక్టివ్ గా వర్క్ చేయాల్సింది. 

తీర్పు

మొత్తంగా చూస్తే కొత్త లోక చాప్టర్ 1 చంద్ర మూవీ అలరించే సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందిన అలరించే మూవీ అని చెప్పాలి. టెక్నీకల్ గా ఎంతో బాగా కుదిరిన ఈ మూవీలో ప్రధాన పాత్ర చేసిన కళ్యాణి ప్రియదర్శన్ అద్భుత నటన కూడా ఈ మూవీకి ప్లస్ పాయింట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆకట్టుకునే విజువల్స్, అలరించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎంతో గ్రాండియర్ గా ఉన్న ప్రొడక్షన్ వాల్యూస్ వంటివి ఈమూవీకి మంచి సక్సెస్ ని అందించాయి. 

ప్రేక్షకుల స్పందన & మొదటి రోజు టాక్

ఒక మహిళా సూపర్ హీరో మూవీగా రూపొంది అందరినీ అలరిస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో కొంత నీరసంగా అనిపించే అమాశాలు ఉన్నాయి. ఇక విలన్ పాత్ర మరింత బలంగా లేకపోవడం కొంత బలహీనంగా అనిపిస్తుంది. నిర్మాత దుల్కర్ సల్మాన్, దర్శకుడు డామినిక్ అరుణ్ ఇటువంటి కథని ఎంచుకున్నందుకు ప్రత్యేకంగా అభినందించాలి. 

Lokah Series Part 1 Chandra Review

టీమ్ మొత్తం ఎంతో బాగా శ్రమపడి దీనిని తెరకెక్కించినట్లు మనకు తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. ఇక బిగ్ స్క్రీన్ పై తప్పకుండా మంచి అనుభూతిని అందించే ఈ మహిళా సూపర్ హీరో మూవీని తప్పకుండా మీ సమీప థియేటర్స్ లో చూసి కుటుంబం అంతా ఆనందించండి. 

మరి ఇటువంటి లేటెస్ట్ మూవీ న్యూస్, అప్ డేట్స్, గ్యాలరీస్, అప్ డేట్స్, గాసిప్స్, రివ్యూస్ కోసం ఎప్పటికప్పుడు మా Telugu Movie Media సైట్ ని తరచు ఫాలో అవుతూ మమ్మల్ని సపోర్ట్ చేయ ప్రార్ధన

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow