Empuraan Movie Review Telugu – Story, Highlights & Rating

Read the complete Empuraan Movie Review in Telugu. Get insights on the story, performances, and overall verdict. Find out if it's worth watching!

Empuraan Movie Review Telugu – Story, Highlights & Rating

చిత్రం : ఎంపురాన్  (L2: Empuraan) - ఆకట్టుకునే యాక్షన్ పొలిటికల్ డ్రామా

విడుదల తేదీ : 27 మార్చి 2025

తెలుగు ఫిల్మీ . కామ్ రేటింగ్ : 3. 5 / 5

నటీనటులు : మోహన్ లాల్, టోవినో థామస్, మంజు వారియర్, పృథ్వీరాజ్ సుకుమారన్, అభిమన్యు సింగ్, జిరోమ్ ఫ్లిన్ తదితరులు. 

దర్శకుడు : పృథ్వీరాజ్ సుకుమారన్ 

నిర్మాతలు : ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ 

సంగీతం : దీపక్ దేవ్ 

Empuraan Movie Review Telugu – A Complete Analysis

2019లో మలయాళ స్టార్ యాక్టర్ మోహన్ లాల్ హీరోగా నటుడు కమ్ దర్శకుడైన పృథ్వీరాజ్ సుకుమారన్ తీసిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లూసిఫర్. ఈ మూవీ అప్పట్లో మంచి క్రేజ్ తో రిలీజ్ అయి మలయాళంలో భారీ సక్సెస్ సొంతం చేసుకుంది. హీరోగా మోహన్ లాల్ తాను పోషించిన స్టీఫెన్ నెడుంపల్లి పాత్రలో అద్భుతంగా నటించారు. 

ఇక ఇతర ముఖ్య పాత్రలు చేసిన టోవినో థామస్, వివేక్ ఒబెరాయ్, మంజు వారియర్ వంటి వారు కూడా సూపర్ గా పెర్ఫార్మ్ చేసి ఆకట్టుకున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ సూపర్ స్క్రీన్ ప్లే తో పాటు ఆకట్టుకునే కథ, కథనాలు ఈ మూవీకి ప్రధాన బలాలు. అనంతరం అదే మూవీని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా గాడ్ ఫాదర్ టైటిల్ తో తెరకెక్కించి మంచి విజయం సొంతం చేసుకున్నారు. 

అయితే విషయం ఏమిటంటే, ఆ తర్వాత దానికి సీక్వెల్ గా మరింత గ్రాండ్ గా రూపొందిన మూవీ ఎంపురాన్. ఇటీవల ప్రచార చిత్రాలతో అందరినీ ఆకట్టుకుని ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ప్రీ టికెట్ బుకింగ్స్ పరంగా ఇండియా మొత్తం కూడా పెద్ద సంచలనమే సృష్టించింది. ఇక మలయాళంతో పాటు తెలుగు సహా నేడు ఎంపురాన్ మూవీ పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఎన్నో థియేటర్స్ లో నేడు అందరి ముందుకి వచ్చిన ఈ మూవీకి బాగానే రెస్పాన్స్ లభిస్తోంది. కాగా ఈ మూవీ యొక్క పూర్తి సమీక్ష ఇప్పుడు చూద్దాం. 

కథ : 

కేరళ ముఖ్యమంత్రి అయిన జతిన్ రామ్ దాస్ (Tovino Thomas) ఆ పార్టీ నుండి తప్పుకుని స్వయంగా పార్టీ నెలకొల్పాలని నిర్ణయించుకుంటాడు. కాగా ఈ విషయమై అతడికి తోడుగా బావ బాబా బజరంగ్ అలియాస్ బాలరాజ్ (Abhimanyu Singh) అతడికి తోడుగా నిలిచినప్పటికీ సోదరి ప్రియదర్శిని రామ్ దాస్ (Manju Warrier) మాత్రం అందుకు అంగీకరించదు. అయితే ఆ సమయంలో పరిస్థితులని చక్కదిద్దెందుకు ఖురేషి అబ్రామ్ అలియాస్ స్టీఫెన్ నెడుంపల్లి (Mohanlal) రంగంలోకి దిగుతాడు. 

కాగా అప్పటికే డ్రగ్స్ దందాలో మునిగి ఉన్న స్టీపెన్ సడన్ రాకతో కేరళ రాజకీయాలు ఏవిధంగా మలుపు తీసుకున్నాయి. కాగా అతడికి బాలరాజ్ తో గల వైరం ఏమిటి, దానితో పాటు జయీద్ మసూద్ (Prithviraj Sukumaran) తో అతడి సంబంధం ఏమిటి, తదుపరి చివరికి ఏమి జరిగింది అనేది మొత్తం కూడా మనం ఎంపురాన్ మూవీలో చూడాల్సిందే. 

ప్లస్ పాయింట్స్ : 

ముఖ్యంగా ఈమూవీలో మరొక్కసారి స్టీఫెన్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అద్బుతంగా ఆకట్టుకున్నారు మోహన్ లాల్. ముఖ్యంగా పలు కీలక యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో ఆయన మరింతగా అలరించారు. ఇక జతిన్ రామ్ దాస్ గా టోవినో థామస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 

ఇక లూసిఫర్ ని మించేలా మరింత గ్రాండియర్ గా రిచ్ విజువల్స్ తో నటుడు కం దర్శకుడు అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీ సూపర్ గా తీశారు అని చెప్పాలి. అలానే పలు యాక్షన్ సీన్స్, కొన్ని ఫైట్స్ బాగున్నాయి. కీలక పాత్ర చేసిన మంజు వారియర్ కూడా తన మార్క్ పెర్ఫార్మన్స్ తో అలరించారు. అభిమన్యు సింగ్, పృథ్వీ రాజ్ సుకుమారన్ ల పాత్రలు వారి యొక్క నటన కూడా ఎంతో బాగుంది. ఇక ఇందులోని చర్చ్ ఫైట్ సెక్యూన్స్ వంటివి చూస్తుంటే మనకు హాలీవుడ్ సినిమా ఫీల్ కలుగుతుంది. 

Empuraan Telugu Review – Story, Performances & Highlights

మైనస్ పాయింట్స్ : 

నిజానికి ఈ సీక్వెల్ కోసం బాగానే కథని రాసుకున్న దర్శకుడు పృథ్వీరాజ్, కథనాన్ని మాత్రం మరింత ఇంట్రెస్టింగ్ గా నడిపించి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఇంట్రడక్షన్ సీన్స్ నుండి కొంతమేర బాగానే సాగిన ఈ సినిమాలో ఒకింత ఆలస్యంగా మోహన్ లాల్ పాత్ర ప్రవేశిస్తుంది. 

అనంతరం వచ్చే ఇంటర్వెల్ బ్లాక్ ఎంతో బాగుంది. సెకండ్ హాఫ్ పై అది బాగా ఇంట్రెస్ట్ ఏర్పరుస్తుంది. అదే ఆసక్తికర తీరున సెకండ్ హాఫ్ కూడా బాగానే నడిచినప్పటికీ మధ్యలో కొన్ని సీన్స్ స్క్రీన్ ప్లే పరంగా కొంత నిరసక్తత కలిగిస్తాయి. క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం బాగా రాసుకుని మూడవ పార్ట్ కి లీడ్ కూడా బాగానే అందించారు. టోవినో పాత్ర మరింత డెప్త్ గా రాసుకోవడంతో పాటు అతిధి పాత్రలు ఎందుకు వచ్చాయో ఎందుకు వెళ్ళాయో అర్ధం కాదు. 

Empuraan Movie Rating & Final Verdict

సాంకేతిక వర్గం : 

ఇక ఎంపురాన్ మూవీకి దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ రాసుకున్న కథ, కథనాలు ఓవరాల్ గా గుడ్ అని చెప్పవచ్చు. యాక్షన్ సీన్స్, ఎలివేషన్ సన్నివేశాలు, విజువల్స్ బాగున్నాయి. సుజిత్ వాసుదేవ్ ఈ సినిమాకి ప్రధాన బలం అని చెప్పవచ్చు. దీపక్ దేవ్ బీజీఎమ్ మరింత బాగా అందించి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఇక ఎడిటింగ్ విభాగం యొక్క పనితీరు కూడా బాగుంది. డబ్బింగ్ కూడా తెలుగు వర్షన్ బాగా అందించారు. నిర్మాణ విలువలు కూడా ఎంతో బాగున్నాయి. 

తీర్పు : 

మొత్తంగా మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ తీసిన యాక్షన్ పొలిటికల్ ఎంటర్టైనర్ మూవీ ఎంపురాన్ నేడు ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి రెస్పాన్స్ అందుకోవడం జరిగింది. అయితే పలు సినిమాల మాదిరిగా ఇందులో కూడా అక్కడక్కడా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఓవరాల్ గా మంచి యాక్షన్ ఎలివేషన్ మూవీస్ ఇష్టపడే వారికి ఇది నచ్చుతుంది. కథ మరియు కొన్ని పాత్రలు మరింత డెప్త్ గా రాసుకుని ఉంటే మూవీ మరింత పెద్ద విజయం అందుకుని ఉండేది. ఇక వీలైతే ఈవారం మీ ఫ్యామిలీ తో కలిసి సమీప థియేటర్స్ లో హాయిగా ఎంపురాన్ చూసి ఆనందించవచ్చు.   

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow