Gaddar Film Awards 2024: A Tribute to the Voice of the People
Gaddar Film Awards 2024 announced to honour revolutionary artist Gaddar. Check full winners list, event highlights, and special tributes

తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్ లో నంది అవార్డ్స్ అందించడం ఎప్పటినుండో చూస్తున్నాం. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత ఇకపై ప్రత్యేకంగా గద్దర్ అవార్డులని సినీ పరిశ్రమ వారికి అందించనున్నట్లు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
అనంతరం సీనియర్ నటి జయసుధ, నిర్మాత దిల్ రాజు సహా పలువురు సినీ పరిశ్రమ వారి నేతృత్వంలో కమిటీలని నియమించి కొన్నాళ్లుగా అవార్డులకు వచ్చిన నామినేషన్స్ ని స్వీకరించి వాటిని పరిశీలించి నేడు అవార్డుల్ని అనౌన్స్ చేసి తెలంగాణ ప్రభుత్వం.
గద్దర్ సినిమా అవార్డులు – 2024 ప్రకటన
జ్యూరీ చైర్ పర్సన్ జయసుధ, ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు ఇద్దరూ కూడా నేడు కొద్దిసేపటి క్రితం ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి పలు విభాగాల్లో గద్దర్ అవార్డులని అనౌన్స్ చేసారు. కాగా 14 సంవత్సరాల అనంతరం ఈ అవార్డుల్ని ప్రకటించిన ప్రభుత్వం, మొత్తంగా 11 క్యాటగిరీస్ లో వీటిని వెల్లడించింది.
అవార్డు గ్రహీతల పూర్తి జాబితా - Gaddar Film Awards 2024 winners
కాగా 2014 జూన్ నుండి 2023 డిసెంబర్ 31 వరకు ప్రతి ఏడాది ఒక ఉత్తమ చిత్రానికి, వాటిలో సెన్సార్ అయిన చిత్రాలని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. అయితే తెలుగుతో పాటు ఉర్ధూ చిత్రాలకు కూడా ప్రత్యేకంగా ప్రాధాన్యననిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. వీటిలో ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు సహా మొత్తంగా 21 మందికి వ్యక్తిగత అవార్డులు ఇచ్చారు. వీటిని జూన్ 14న వైభవంగా జరిగే వేడుకలో అందరికీ అందించనున్నారు.
2024 గద్దర్ అవార్డుల విజేతల వివరాలు
ఉత్తమ మొదటి చిత్రం - కల్కి 2898 ఏడి
ఉత్తమ రెండవ చిత్రం - పొట్టేల్
ఉత్తమ మూడవ చిత్రం - లక్కీ భాస్కర్
ఉత్తమ బాలల చిత్రం - 35 చిన్న కథ కాదు
హిస్టరీ - హెరిటేజ్ చిత్రం - రజాకార్
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం - ఆయ్
ఉత్తమ పరిచయ దర్శకుడు - యదు వంశీ (కమిటీ కుర్రోళ్ళు)
ఉత్తమ దర్శకుడు - నాగ్ అశ్విన్ (కల్కి 2898 ఏడి)
ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప 2)
ఉత్తమ నటి - నివేతా థామస్ (35 చిన్న కథ కాదు)
ఉత్తమ సహాయ నటుడు - ఎస్ జె సూర్య (సరిపోదా శనివారం)
ఉత్తమ సహాయ నటి - శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు)
ఉత్తమ గేయ రచయిత - చంద్రబోస్ (లేదే లేదే ప్రేమసలే - రాజుయాదవ్)
ఉత్తమ సంగీత దర్శకుడు - భీమ్స్ (రజాకార్)
ఉత్తమ నేపథ్య గాయకుడు - సిద్ శ్రీరామ్ (నిజమేనే చెబుతున్నా - ఊరిపేరు భైరవకోన)
ఉత్తమ నేపథ్య గాయని - శ్రేయ ఘోషల్ (సూసేకి అగ్గిరవ్వ మాదిరి - పుష్ప 2)
ఉత్తమ హాస్య నటుడు - సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా 2)
ఉత్తమ బాల నటుడు - మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల (35 చిన్న కథ కాదు) బేబీ హారిక (మెర్సీ కిల్లింగ్)
ఉత్తమ కథా రచయిత - శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత - వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - విశ్వనాథ రెడ్డి (గామి)
ఉత్తమ ఎడిటర్ - నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
ఉత్తమ ఆడియోగ్రాఫర్ - అరవింద్ మేనన్ (గామి)
ఉత్తమ కొరియోగ్రాఫర్ - గణేష్ ఆచార్య (ఆయుధ పూజ - దేవర)
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ - అద్నితిన్ జిహాని చౌదరి (కల్కి 2898 ఏడి)
ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ - కె. చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్ స్టర్)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ - నల్ల శ్రీను (రజాకార్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ - అర్చనా రావు, అజయ్ కుమార్ (కల్కి 2898 ఏడి)
గద్దర్ గారి జ్ఞాపకార్థంగా ప్రత్యేక గౌరవం
స్పెషల్ జ్యూరీ అవార్డులు :
నటుడు - దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
నటి - (అనన్య నాగళ్ళ) దర్శకులు - సుజీత్, సందీప్ (క)
నిర్మాతలు - ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కళ్లేపల్లి (రాజు యాదవ్)
స్పెషల్ జ్యూరీ స్పెషల్ మెన్షన్ - ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2)
తెలుగు సినిమాల పై ఉత్తమ పుస్తకం - మన సినిమా ఫస్ట్ రీల్ (రెంటాల జయదేవ్)
What's Your Reaction?






