Priyanka Arul Mohan Movies List: From Debut to Latest Hits

Check out the complete list of Priyanka Arul Mohan movies from her debut film to her latest releases in Telugu and Tamil cinema

Priyanka Arul Mohan Movies List: From Debut to Latest Hits

తెలుగు సినిమా (Telugu Cinema) పరిశ్రమలోకి ఇటీవల నాని (Nani) హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్ లీడర్ (Gang Leader) మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు తమిళ నటుడి ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan). ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందించారు. అయితే మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయవంతం అయి హీరోయిన్ గా ఫస్ట్ మూవీ తోనే ప్రియాంక అరుళ్ మోహన్ కు మంచి పేరు తీసుకువచ్చింది. 

ఆ మూవీలో తన ఆకట్టుకునే అందం, అభినయంతో అందరినీ మెప్పించారు ప్రియాంక. అయితే తొలిసారిగా తన కెరీర్ ని కన్నడ మూవీ ఒంద్ కధే హెల్ల అనే మూవీ ద్వారా ఆరంభించారు ప్రియాంక. ఆ మూవీలో తాండవ్ రామ్, సోమన్న ప్రధాన పాత్రలు చేసిన ఈ మూవీ బాగానే విజయవంతం అయింది. 

Priyanka Arul Mohan Movies List

ఇక తెలుగులో గ్యాంగ్ లీడర్ తరువాత యువ నటుడు శర్వానంద్ హీరోగా రూపొందిన శ్రీకారం మూవీ చేసారు ప్రియాంక. ఆ మూవీని బి. కిశోరె తెరకెక్కించారు. అయితే కరోనా సమయంలో రిలీజ్ అయిన ఆ మూవీ యావరేజ్ విజయం అందుకుంది. ఆ తరువాత తమిళ్ లో యువ నటుడు శివ కార్తికేయన్ తో ప్రియాంక మోహన్ చేసిన మూవీ డాక్టర్. 

ప్రియాంకా అరుల్ మోహన్ సినిమాల జాబితా

దీనిని నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ బాక్సాఫిస్ వద్ద పెద్ద సక్సెస్ సాధించి తమిళ్ లో ప్రియాంక కు మంచి పేరు, క్రేజ్ తీసుకువచ్చింది. ఇక అక్కడి నుండి స్టార్ నటిగా మంచి గుర్తింపుతో ముందుకు సాగి పలు అవకాశాలు సొంతం చేసుకున్నారు ఆమె. 

ఆ తరువాత ఏకంగా తమిళ స్టార్ యాక్టర్ సూర్య తో చేసిన సినిమా ఈటి. అయితే రిలీజ్ అనంతరం ఈ మూవీ ఆశించిన స్థాయి సక్సెస్ అందుకోలేదు. ఇక దీని తరువాత మరొకసారి శివకార్తికేయన్ తో ప్రియాంక మోహన్ చేసిన మూవీ డాన్. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద విజయవంతం అయింది. 

OG Heroine Priyanka Arul Mohan All Movies

ఆపైన దుష్ తో తొలిసారిగా కెప్టెన్ మిల్లర్ మూవీ చేసారు, అది కూడా సక్సెస్ అయింది. ఇక ఇటీవల టాలీవుడ్ స్టార్ యాక్టర్ నాచురల్ స్టార్ నానితో రెండవసారి ఆమె నటించిన మూవీ సరిపడా శనివారం. ఈ మూవీని వివేక్ ఆత్రేయ తెరకెక్కించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈమూవీ పెద్ద విజయం అందుకుని తెలుగులో ప్రియాంక అరుళ్ మోహన్ కి మరింతగా పేరు తీసుకువచ్చింది. 

ఇటీవల రవిమోహన్ హీరోగా రూపొందిన బ్రదర్ మూవీలో నటించి మంచి పేరు అందుకున్న ప్రియాంక తాజాగా జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన గోల్డెన్ స్పారో సాంగ్ లో నటించి దానితో నేషనల్ వైడ్ గా మరింత పాపులర్ అయ్యారు. ఇక లేటెస్ట్ గా టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఆమె చేస్తున్న మూవీ ఓజి. 

తెలుగు సినిమాల్లో ప్రియాంకా అరుల్ మోహన్

ఈ పాన్ ఇండియా యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ పై తెలుగు తోపాటు ఇతర భాషల ఆడియన్స్ లో ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. సుజీత్ తీస్తున్న ఈ మూవీ ఇటీవల షూటింగ్ ఆల్మోస్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. దీనిని సెప్టెంబర్ 25న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ఒకవేళ ఈ మూవీ కనుక రిలీజ్ అనంతరం పెద్ద విజయం అందుకుంటే హీరోయిన్ గా ప్రియాంక రేంజ్, మార్కెట్ వాల్యూ విపరీతంగా పెరగడం ఖాయం. 

ప్రియాంక మోహన్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే ఆమె 20 నవంబర్ 1994లో బెంగళూరులో జన్మించారు. కాగా అక్కడి పీఈఎస్ యూనివర్సిటీలో ఆమె బయోలాజికల్ ఇంజనీరింగ్ విద్యని అభ్యసించారు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి చెన్నైలో నివాసం ఉంటున్న ప్రియాంక మోహన్ మొదటి నుండి కూడా ఎంత ఎదిగినప్పటికీ కూడా ఒదిగి ఉండే మంచి మనస్తత్వం కలవారని పలువురు ఆమెతో పనిచేసిన నటీనటులు, శ్రేయోభిలాషులు చెప్తుంటారు. 

Priyanka Arul Mohan Telugu Movies

వృత్తి పట్ల అంకితభావం, అలానే పని మీద శ్రద్ధతో ముందుకు సాగితే మెల్లగా అయినా తప్పకుండా విజయం వరిస్తుందని ప్రియాంక చెప్తుంటారు. తనకు జన్మనిచ్చిన తల్లితండ్రులతో పాటు తనను ఇంతగా ఆదరిస్తున్న ఫ్యాన్స్, ఆడియన్స్ గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే అని, వారికి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని అంటారు. 

అలానే ఇకపై కెరీర్ పరంగా మరిన్ని మంచి సినిమాల ద్వారా అందరినీ అలరిస్తానని, అందుకే సినిమాల ఎంపిక విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటున్నట్టు చెప్తారు ప్రియాంక. ఇక ఆమె దాదాపుగా అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన సినీ, వ్యక్తిగత విషయాలు గురించిన ఫోటోలు, వీడియోలు ఎప్పటికపుడు ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. 

Pawan Kalyan OG Heroine Priyanka Mohan

ఇక చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మొదటి నుండి తనకు డ్యాన్స్ పట్ల మక్కువతో ప్రత్యేకంగా భారనాట్యం అభ్యసించారు ప్రియాంక. ఇక ఆమె ఎక్కువగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కంటే పుస్తకాలు చదవానికి ఇష్టపడతారు. తనకు తీరిక దొరికిన సమయాల్లో అలానే షూటింగ్స్ లేనపుడు ఎక్కువగా పలు ఫిలాసఫీ, సైకాలజీ కి సంబందించిన పుస్తకాలూ ఆమె చదవడానికి ఆమె ఇష్టపడతారు. 

తమిళ సినిమాల్లో ఆమె ప్రయాణం

అలానే ఎక్కువగా తీరిక దొరికితే తన ఫ్యామిలీతో సరదాగా క్వాలిటీ టైం గడిపేందుకు ఆమె ప్రిఫరెన్స్ ఇస్తారు. అలానే తన ఫిట్నెస్ పై ఎంతో శ్రద్ధ పెట్టె ప్రియాంక తరచు యోగా, ఇతర వ్యాయామాలతో పాటు డైట్ విషయంలో కూడా ఎంతో శ్రగా వ్యవహరిస్తూ ఆరోగ్యాన్ని, మనసుని ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. 

అయితే అప్పుడప్పుడు చీట్ మీల్ సమయంలో ఎక్కువగా థాయ్ ఫుడ్ ని ఇష్టపడే ప్రియాంక, వాటితో పాటు విభిన్న రకాల వంటకాలు తింటూ ఉంటారు. ముఖ్యంగా తనకు ఇంతటి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎందరో ప్రేక్షకాభిమానులు కారణం అని భావించే ప్రియాంక, మధ్యలో తనకు వీలైనంతలో పలువురికి సహాయం చేస్తూ సామజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ తన ఉదారత చాటుకుంటూ ఉంటారు. 

Priyanka Arul Mohan Tamil Films

ఇక ప్రియాంక అరుళ్ మోహన్ కు తెలుగుతో పాటు ఇంగ్లీష్, కన్నడ, తమిళ భాషలు కూడా బాగానే వచ్చు. ఆ విధంగా అటు నటిగా ఇటు మంచి మనసున్న వ్యక్తిగా అందరినీ ఆకట్టుకుంటూ మంచి సినిమాలు, సక్సెస్ లతో బాగా క్రేజ్ తో కొనసాగుతున్న ప్రియాంక మోహన్ రాబోయే రోజుల్లో మరింత విజయాలు అందుకుని కెరీర్ పరంగా దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా Telugu Movie Media సైట్ తరపున ఆమెకు ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియచేస్తున్నాము.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow